Main Menu

Monday, April 16th, 2018

 

టీడీపీలో మ‌రో త‌గాదా:మాజీ ఎమ్మెల్యే అవుట్?

తెలుగుదేశం ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఓ అడుగు వేసింది. కీల‌క ప‌ద‌వులను కేటాయింపులు చేసింది. అయితే అందులో ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి వ్య‌వ‌హారం పెద్ద త‌గాదాగా మారింది. మ‌తం కోణంలో పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నియామ‌కం వివాదాస్ప‌దం చేశారు. అయితే దాని వెనుక టీడీపీలో వ‌ర్గ‌పోరు కార‌ణ‌మ‌ని ప‌లువురు భావిస్తున్నారు. టీటీడీ చైర్మ‌న్ గిరీ ఆశించిన అనేక‌మంది ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో పుట్టా సుదాక‌ర్ యాదవ్ కి వ్య‌తిరేకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో అంత‌ర్గ‌త విబేధాల‌కు ఇదో తార్కాణంగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ వేడి ఆర్టీసీ చైర్మ‌న్ గిరీని తాకింది. త‌న‌కు ఇస్తాన‌ని చెప్పిన ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా, గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన వ‌ర్ల రామ‌య్య‌కు చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి, త‌న‌కు రీజ‌న‌ల్ ప‌ద‌వి ఇవ్వ‌డంపైRead More


ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం హీటు రాజేస్తోంది. అన్ని పార్టీలు అదే డిమాండ్ తో సాగాల్సిన స్థితి వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు హోదాని రాజ‌కీయంగా నిల‌బెట్టుకోవ‌డంలో ఛాంపియ‌న్ ఎవ‌ర‌న్న‌దే ప్ర‌శ్న‌. అయితే తాజాగా ఏపీ బంద్ స‌క్సెస్ అయిన తీరు గ‌మ‌నిస్తే అధికార తెలుగుదేశం పార్టీ ఒంట‌రిగా మిగిలిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో బీజేపీ ప్ర‌భావం అంతంత‌మాత్ర‌మే. వాస్త‌వానికి సింగిల్ గా ఎన్నిక‌ల‌కు వెళితే సింగిల్ సీటు కూడా సొంతంగా గెల‌వ‌డం ఆపార్టీకి క‌ష్ట‌మే. దానిని ఆపార్టీ నేత పైడికొండ‌ల మాణిక్యాల‌రావు కూడా అంగీక‌రించారు. తాము వెంట్రుక‌తో స‌మానం అని పేర్కొన్నారు. అయితే తాజాగా హోదా ఉద్య‌మం మాత్రం బీజేపీకి ఉన్న కొద్దిపాటి బ‌లం కోల్పోయే ప‌రిస్థితిని తీసుకొస్తే టీడీపీకి తీవ్ర న‌ష్టం చేకూర్చే ప్ర‌మాదం ఉంది. తాజాగా బంద్ దానికి సంకేతంగా భావించ‌వ‌చ్చు. బంద్ కార‌ణంగాRead More


వైసీపీతో మంత్రి మంత‌నాలు?

ఏపీలో ప‌లువురు ఎమ్మెల్యేలు మాతో ట‌చ్ లో ఉన్నార‌ని వైసీపీ ప్ర‌క‌టించింది. టీడీపీ ఎంపీలు త‌మ‌వైపు రావ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారంటూ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంకేతాలు ఇచ్చేశారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే జ‌న‌సేనాని కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి చేశారు. అయితే తాజాగా విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డితో ఓ కీల‌క మంత్రి త‌రుపున చ‌ర్చ‌లు సాగిన‌ట్టు ప్రచారం మొద‌ల‌య్యింది. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన స‌ద‌రు మంత్రి తాజాగా టీడీపీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయ‌న బంధువ‌ర్గం కూడా టీడీపీలోనే ఉన్నారు. దాంతో ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ద‌క్కుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ఆయ‌న మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మంత్రి స‌మీప బంధువు ఒక‌రు నేరుగా విజ‌య‌సాయిరెడ్డితో భేటీ కావ‌డం విశేషంగాRead More


టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌

తెలుగుదేశం పార్టీని కాపాడాలంటూ ఆపార్టీ నేత‌లే రోడ్డెక్కారు. ఏకంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్ప‌టికే మూడు సార్లు వ‌రుస‌గా ఓట‌మి పాల‌యిన త‌ర్వాత కూడా పార్టీ నేత‌లు క‌ళ్లు తెర‌వ‌డం లేద‌ని వాపోతున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం స్పందించ‌డం లేదంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. మార్కెట్ యార్డ్ క‌మిటీ చైర్మ‌న్ రామిరెడ్డి దీక్ష‌తో గుంటూరు జిల్లా న‌ర్సారావుపేట టీడీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డ్డాయి. ఒక‌ప్పుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గంలో 2004 నుంచి టీడీపీ ఓట‌మి పాల‌వుతోంది. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఇన్ఛార్జ్ ని నియ‌మించ‌డంలో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తోంది. నేటికీ అది పూర్తిచేయ‌క‌పోవ‌డంతో జిల్లా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు, పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌హా అంద‌రికీ కార్య‌క‌ర్త‌లు ప‌దేRead More