Main Menu

Sunday, April 15th, 2018

 

జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!

కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏకంగా 40మంది టీడీపీ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌నే రీతిలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించారంటూ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు కూడా. వైసీపీ కూడా అదే స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చాలాకాలంగా త‌న‌తో ట‌చ్ లో ఉన్న వారంద‌రికీ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని చెప్పాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మ‌రోసారి ఫిరాయింపుల జోరు ఖాయంగా క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి ప‌లువురు నేత‌లు సైకిల్ స‌వారీకి సెండాఫ్ చెప్పేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌కు తోడుగా మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావుRead More


ఆమెను మీడియా వాడుకుందా…?

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఏపీ అంత‌టా ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం చెల‌రేగుతోంది. తెలంగాణాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు. ఫ్రంట్ పెడ‌తామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా జ‌నం దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి మీడియాలో ఓ సెక్ష‌న్ పెద్ద స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని సాధ‌నంగా మ‌ల‌చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. పిల్మ్ ఛాంబ‌ర్ ముందు బ‌ట్ట‌లు విప్పి నిర‌స‌న తెలిపిన శ్రీరెడ్డికి ఓ మీడియా సంస్థ ప్ర‌తినిధులు అండ‌గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని టాలీవుడ్ పెద్ద‌లు భావిస్తున్నారు. మహా టీవీలో ఈ నిర‌స‌న‌కు సంబంధించిన ప్ర‌చారం విస్తృతంగా సాగిన విష‌యం. ఆ త‌ర్వాత ఇదే అంశంపై ప‌దే ప‌దే చ‌ర్చ‌లు సాగిన విష‌యం కూడా ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. అయితే శ్రీరెడ్డిRead More


అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీకి అభ్య‌ర్థులు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త నేత‌లు అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగా వేట ప్రారంభించింది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో దాదాపుగా మార్చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కూ 6 జిల్లాల ప‌రిధిలో కేవ‌లం ఒకే ఒక్క అర‌కు ఎంపీ సీటుని వైసీపీ గెలుచుకోగ‌లిగింది. ఆ త‌ర్వాత గెలిచిన ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత స‌హా ప‌లువురు నేత‌లు పార్టీ నుంచి ఫిరాయించేశారు. 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో విజ‌య‌న‌గ‌రం అభ్య‌ర్థి బేబీనాయ‌న‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అభ్య‌ర్థి బొడ్డు వెంక‌టర‌మ‌ణ‌, విజ‌య‌వాడ అభ్య‌ర్థి కొనేరు ముర‌ళీ వైసీపీని వీడిపోయారు. ఇక ఏలూరు నుంచి బ‌రిలో దిగిన తోట చంద్ర‌శేఖ‌ర్, కాకినాడ అభ్య‌ర్థి చెల‌మ‌ల‌శెట్టి సునీల్ కూడా ఢోలాయ‌మానంలోRead More


టీడీపీ ఏం చెప్పుకోవాలి…?

ఏపీలో దాదాపుగా ఎన్నిక‌ల కోలాహ‌లం మొద‌ల‌య్యినట్టే చెప్ప‌వ‌చ్చు. షెడ్యూల్ కి ఏడాది ముందు నుంచే పార్టీల‌న్నీ త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రి ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటారు..ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద ఆయుధంగా మారుతోంది. పాల‌క టీడీపీ కూడా ఉద్య‌మంలోకి వ‌చ్చినా క్రెడిట్ మాత్రం విప‌క్షాల‌కే ద‌క్కుతోంది. పాచిపోయిన ల‌డ్డూలంటూ కామెంట్స్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి, ఆమ‌ర‌ణ‌దీక్ష కూడా చేసి, యువ‌భేరీల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ఎజెండా ప్ర‌త్యేక హోదానేన‌ని తేల్చిచెప్పిన జ‌గ‌న్ కి ప్ర‌జ‌ల్లో మార్కులు ప‌డుతున్నాయి. అది చంద్ర‌బాబుకి, టీడీపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. మీడియా స‌హాయంతో ఎంత‌గా ప్ర‌చారం చేసినా ఫ‌లితం ద‌క్క‌డం లేద‌ని టీడీపీ శ్రేణులే భావిస్తున్నాయి. చివ‌ర‌కు అధినేత దీక్ష ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తుందోRead More


కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్

సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప‌లు స‌మ‌స్య‌ల‌కు కూడా కార‌ణం అవుతోంది. అనేక అపోహ‌ల‌కు దారితీస్తోంది. తాజాగా అలాంటిదే విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. జ‌గ‌న్ పాద‌యాత్ర న‌గ‌రంలో అడుగుపెడుతున్న స‌మ‌యంలో హ‌ల్ చ‌ల్ చేసిన ఒక వీడియో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. జ‌గ‌న్ యాత్ర‌కు వెళుతున్న యువ‌త‌ను అడ్డుకున్నారంటూ ఆ వీడియోని పోస్ట్ చేసిన వారు ప్ర‌చారం చేయ‌డంతో దుమారానికి దారితీసింది. పోలీసులు ఇష్టారాజ్యంగా కొడుతున్న దృశ్యం క‌ల‌క‌లం రేపింది. అయితే తీరా చూస్తే స‌ద‌రు వీడియో యూపీకి చెందిన బీఎస్పీ కార్య‌క‌ర్త‌ల‌ద‌ని తేలింది. మొన్న‌టి ఏప్రిల్ 2 భార‌త్ బంద్ లో భాగంగా అందులో పాల్గొన్న ముగ్గురు యువ‌కుల‌పై పోలీసులు రెచ్చిపోయిన దృశ్యాల‌ని నిర్ధారించారు. యూపీలో విజువ‌ల్స్ తీసుకుని ఏపీకి ఆపాదిస్తూ, బీఎస్పీ కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ అభిమానులుగా పేర్కొంటూ సాగించిన ప్ర‌చారం పెద్ద వైర‌ల్ గా మారింది. దాంతోRead More


శ్రీరెడ్డికి భారీ ఛాన్స్

టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీరెడ్డి ఇటీవ‌ల వ‌రుస‌గా హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాలంటూ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి వివిధ రూపాల్లో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆమెకు భారీ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజ‌న్ 2లో నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేయ‌బోతున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ షోలో పాల్గొన‌డం కోసం ప‌లువురు ఆశావాహులు సిద్ధ‌ప‌డుతున్నారు. అయితే ఆ ఛాన్స్ మాత్రం శ్రీరెడ్డికి వ‌రించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె కోసం స్టార్ మా నిర్వాహ‌కులు సంప్ర‌దించ‌గా, ఆమె సిద్ధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే సీజ‌న్ లో బిగ్ బాస్ కోసం హైద‌రాబాద్ లోనే భారీ సెట్ వేయ‌బోతున్నారు. సీజ‌న్ వ‌న్ ని పూణేలో వేసిన ప్ర‌త్యేక ఇంటి సెట్ లో షూటింగ్Read More


సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు

సీనియ‌ర్ సాధించింది. సైనా నెహ్వాల్ గెలిచింది. పీవీ సింధు ని ఓడించింది. కామ‌న్ వెల్త్ గేమ్స్ లో ఉమెన్ బ్యాడ్మింట‌న్ విభాగంలో ఈ ఇండియ‌న్ ష‌టిల‌ర్లును ఫైనల్స్ లో త‌ల‌ప‌డ్డారు. చివ‌ర‌కు సైనాని విజ‌యం వ‌రించింది. గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకుంది. సిల్వ‌ర్ తో సింధు స‌రిపెట్టుకుంది. అప్ప‌ట్లో ఒలింపిక్స్ లో కూడా సింధుకి సిల్వ‌ర్ ద‌క్క‌డం విశేషం. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 3 గా ఉన్న పీవీ సింధుపై సైనా నెహ్వాల్ వ‌రుస సెట్ల‌లో విజ‌యం సాధించింది. 21-18, 23-21 తేడాతో గెలిచింది. తొలి సెట్ సునాయాసంగా గెలుచుకున్న‌ప్ప‌టికీ, రెండో సీట్ లో హోరాహోరీ పోరు సాగింది. అయినా చివ‌ర‌కు సైనా పై చేయి సాధించింది. సైనా విజ‌యం ప‌ట్ల ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రు భార‌తీయ స్టార్ల‌కు గోల్డ్, సిల్వ‌ర్ ద‌క్క‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తంRead More


ఎన్టీఆర్ స్థానంలో నాని..

టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ కి తిరుగులేని ఇమేజ్ ఉంది. వ‌రుస హిట్ల‌తో ఊపు మీదున్నాడు. అదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి వంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో జ‌త‌గ‌డుతూ భారీ సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న ఇమేజ్ అమాంతంగా పెంచిన బిగ్ బాస్ షో నుంచి ఆయ‌న త‌ప్పుకున్నారు. వ‌రుస సినిమాల నేప‌థ్యంలో బుల్లితెర‌కి స‌మ‌యం కేటాయించలేనంటూ తేల్చేశారు. దాంతో బిగ్ బాస్ రెండో ఎడిష‌న్ కి త హోస్ట్‌ ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. దాంతో కొత్త స్టార్ కోసం వెదికిన ‘స్టార్‌ మా’ టీవీ చానల్‌ ఈసారి కూడా యంగ్‌ హీరో వైపే మొగ్గుచూపింది. నాచురల్‌ స్టార్‌గా పేరున్న నాని ని లేటెస్ట్ బిగ్ బాస్ చేసేసింది. దాంతో సీజ‌న్ 2ని నాని న‌డిపించ‌బోతున్నాడు. దాంతో బిగ్ బాస్ షో లో పాల్గొనాల‌నేRead More


చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌

మిల్కీబ్యూటీకి మ‌రో ఛాన్స్ ద‌క్కింది. అది కూడా మెగాస్టార్ సినిమాలో కావ‌డం విశేషం. ఇప్ప‌టికే టాలీవుడ్ లో త‌మన్నా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. బాహుబలిలో మెరిసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే ఆమెకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తాజాగా సైరా సినిమాలో ఆమెకు చాన్స్ రావ‌డంతో మ‌రో మెగా ప్రాజెక్ట్ లో చోటు ద‌క్కించుకున్న‌ట్టయ్యింది. చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిస్తున్న సైరా సినిమాలో చిరంజీవి సరసన నయన తార నటిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ కీల‌క‌పాత్రలో విజయ్ సేతుపతి న‌టిస్తున్నారు. అత‌డికి జోడీగా తమన్నా న‌టించ‌బోతోంది. తమన్నా పాత్ర గురించి ఇప్పటికే ఆమెకు వివరించగా, ఆమె అంగీక‌రించిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్‌Read More