Main Menu

Wednesday, April 4th, 2018

 

మోడీ స‌ర్కార్ వెన‌క‌డుగు

మోడీ స‌ర్కార్ వెన‌క‌డుగు వేసింది. ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లు నిర్ణ‌యాల విష‌యంలో కేంద్రం ప‌దే ప‌దే మార్పులు చేసుకుంటుండ‌డం గ‌మ‌నిస్తే మోడీ స‌ర్కారు డిఫెన్స్ లో ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో రివ్యూకి వెళ్ళాల్సిన స్థితి ప్ర‌భుత్వానికి వ‌చ్చింది. అందుకు తోడుగా ఫేక్ వార్త‌ల విష‌యంలో నిర్ణ‌యాన్ని మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఆదేశాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల్సి వ‌చ్చింది. దాంతో జ‌ర్న‌లిస్టుల‌కు కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. ఫేక్ వార్త‌ల పేరుతో పాత్రికేయుల అక్రిడిటేష‌న్ ర‌ద్దు చేస్తామంటూ కేంద్ర స‌మాచార ప్ర‌చారాల శాఖ మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది. దాంతో వాటిపై జ‌ర్న‌లిస్టులు తీవ్రంగా మండిప‌డ్డారు. పెను దుమారం రేగింది. రాజ‌కీయ ప‌క్షాలు కూడా విరుచుకుప‌డ్డాయి. ఎమ‌ర్జ‌న్సీ ని త‌ల‌పించేందుకు కేంద్రం ప్ర‌యత్నిస్తోందంటూ మండిప‌డ్డాయి. దాంతో చివ‌ర‌కు నిర్ణ‌యాన్ని స‌వ‌రించాల‌ని ఆదేశించిన పీఎంవో,Read More


ఆ ఇద్ద‌రూ త‌ప్ప..అంద‌రితోనూ అంటున్న టీడీపీ

తెలుగుదేశం పొలిటిక‌ల్ లైన్ లో మార్పు ఖాయంగా క‌నిపిస్తోంది. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో విధానాల‌లో స్ప‌ష్ట‌మైన మార్పులు ఖాయం అని భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో మోడీని ఢీ కొట్టాలంటే దేశవ్యాప్తంగా అనేక‌మంది మిత్రుల‌ను క‌లుపుకుని సాగాల‌ని ఆశిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఎన్డీయే భాగ‌స్వాముల‌ను కూడా క‌లుపుకుపోవాల‌ని భావిస్తోంది. కేవ‌లం బీజేపీ, కాంగ్రెస్ మిన‌హా అన్ని పార్టీల‌తో క‌లిసి సాగుతామ‌ని చెబుతోంది. అయితే అంత‌ర్గ‌తంగా కాంగ్రెస్ తో స‌ఖ్య‌త‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. వైసీపీతో పొత్తు పెట్టుకున్నందువ‌ల్లే తాము ఎన్డీయేని వీడామ‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్పేశారు. పైకి మాత్రం ఏపీకి హోదా, విభ‌జ‌న హామీలు అని చెప్పిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థిని ప‌క్క‌న పెట్టుకోవ‌డంతో స‌హించలేక దూర‌మ‌య్యామ‌ని నేరుగా చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. దాంతో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కార‌ణంగానేRead More


జుట్టు స‌మ‌స్య‌కు చెక్ పెట్టు..!

వాతావ‌ర‌ణంలో మార్పుల‌కు తోడు, ఆహార‌పు అల‌వాట్లు కూడా మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు తీసుకొస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అలాంటి వాటిలో జ‌ట్టుకు సంబంధించి ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యువ‌త‌. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య తెల్లజుట్టు. కొంతమంది పిల్లలకు కూడా తెల్లజుట్టు వచ్చేస్తోంది. తెల్లజుట్టు సమస్య నివారణకు చాలామంది బ్యూటీ పార్లర్లు, స్పాల వెంట తిరుగుతున్నారు. నిజానికి వయస్సుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజం. కానీ చిన్నవయస్సులోనే తల నెరిసిపోతే మాత్రం ఆహారంపై శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. – రోజూ తీసుకునే ఆహారంలో మల్టీ విటమిన్లు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. – రోజువారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, కోడిగుడ్డు ఎక్కువగా తీసుకోవాలి. – ఆకుకూరలను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. ఆకుకూరలను వారానికి నాలుగుసార్లు తీసుకుంటే జుట్టు నెరిసేRead More