Main Menu

Tuesday, February 13th, 2018

 

కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..

ఉద్దండుల వ‌ల్ల కానిది విరాట్ సాధించాడు. సచిన్, గంగూలీ, ధోనీ వంటి కెప్టెన్లు సాధించ‌లేని కోహ్లీ సేన సాధించి చూపింది. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై ఆ జ‌ట్టును సునాయాసంగా ఓడించింది. ఆరు వ‌న్డేల సిరీస్ ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది. తొలి మూడు వ‌న్డేల‌లో సునాయాసంగా గెలిచిన టీమిండియా నాలుగో వ‌న్డేలో అనూహ్యంగా ఓట‌మి పాల‌య్యింది. అయితే పోర్ట్ ఎలిజ‌బెత్ లో జ‌రిగిన ఐదో వ‌న్డేలో మాత్రం మ‌రోసారి నెంబ‌ర్ వ‌న్ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించింది. 73 ప‌రుగుల తేడాతో సునాయాసంగా విజ‌యం సాదించింది. ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి 4-1 తేడాతో సిరీస్ ని ద‌క్కించుకుంది. చివ‌రి వ‌న్డే 17నాడు జ‌ర‌గ‌బోతోంది. కొంత‌కాలంగా ఫామ్ లో లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న రోహిత్ శ‌ర్మ బ్యాట్ కి ప‌నిచెప్ప‌డంతో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 50Read More


కాపు రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు

కాపు రిజర్వేషన్లకు మళ్లీ బ్రేక్ పడింది. చంద్రబాబు ఆడంబరంగా ప్రకటించిన 5శాతం రిజర్వేషన్లు అసలు సాధ్యం కాదని తేలిపోయింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. దాంతో ఏపీలో కాపులను బీసీల్లో చేరుస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లుబాటు కాదని తేలిపోయింది. ఈ విషయంలో కేంద్రం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఈ విషయాన్ని స్పష్టం చేసేసింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామనడం మోసగించడమేనని గతంలో మోడీ గుజరాత్ ఎన్నికల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పుడే చాలామంది కాపు రిజర్వేషన్ల తీర్మానం గురించి అనుమానం వ్యక్తం చేశారు. ఉపయోగపడే నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు మాత్రం కాపుల పట్ల టీడీపీ చిత్తశుద్ధితో రిజర్వేషన్ల ప్రకటన చేసిందని, 9 వ షెడ్యూల్ లో పెట్టడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. కానీ తీరా చూస్తేRead More


బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారి బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు తెరమీదకు వచ్చారు. టీడీపీని టార్గెట్ చేశారు. తాము లేకపోతే 2014లో టీడీపీ గెలిచేది కాదని చెప్పారు. బీజేపీ పొత్తు వల్లే టీడీపీ గట్టెక్కిందని కుండబద్ధలు కొట్టారు. టీడీపీ పొలిటికల్ జిమ్మిక్కులపై మండిపడ్డారు. వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. బీజేపీపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మిత్రపక్షం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల తీరును తప్పుబట్టారు. ఏపీని అవమానించేలా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తోలుత తన ఎంపీలకు పాఠాలు నేర్పాలని విష్ణకుమార్ రాజు సూచించారు. పార్లమెంట్ లో ఎలా ప్రవర్తించాలో నేర్పాలన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యవహారశైలి బాధాకరమని వ్యాఖ్యానించారు.


పవన్ కి ప్రయాస తప్పదు..!

ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. అన్ని పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సాగుతున్నాయి. ప్రత్యేక హోదా, ప్యాకేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీ ఆత్మగౌరవం సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సొమ్ము చేసుకోవడానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతలు పార్లమెంట్ ముందు నడుపుతున్న ప్రహసనం పెద్దగా ఫలిస్తున్నట్టు కనిపించడం లేదు. దాంతో పవన్ కళ్యాణ్ కొంత ఆలశ్యంగా ఎంట్రీ ఇచ్చారు. చివరకు ప్రత్యేక హోదా బంద్ కి మద్దతు ప్రకటించినా ఆయన మాత్రం అటు వైపు కూడా చూడలేదు. అదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ ని, ఉండవల్లిని తెరమీదకు తెచ్చి కొంత హల్ చల్ చేస్తున్నారు. తొలుత జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పినా ప్రస్తుతానికి జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ పేరుతో సరిపెట్టుకున్నారు. అయితే పవన్ చేసిన ప్రకటన ప్రకారం మరికొద్ది గంటల్లోగా చంద్రబాబు వాస్తవRead More


గేరు మార్చిన జగన్

ఏపీలో సాగుతున్న రాజకీయాల్లో వైసీపీ ఓ అడుగు ముందుకేసింది. పాలక కూటమి టీడీపీ, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అదే సమయంలో జనసేన కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వెనుకబడుతోందనే ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో ఆలశ్యంగా నష్టాన్ని గుర్తించిన జగన్ ఓ అడుగు ముందుకేశారు. రాజీనామాలకు ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 6ని డెడ్ లైన్ గా ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం గతంలోనే రాజీనామాలకు సిద్దమని ప్రకటించిన జగన్ ఈసారి బడ్జెట్ సమావేశాలు ముగియగానే రాజీనామాకి సై అనడం చర్చనీయాంశంగా మారింది. గత రెండు వారాలుగా రసవత్తరంగా సాగుతున్న రాజకీయ నాటకంలో ఇప్పుడు జగన్ గేరు మార్చడం విశేషంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6వ తేదీన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలచేత రాజీనామాRead More