Main Menu

Friday, February 9th, 2018

 

బాబుకి బడ్జెట్ భయం!

కేంద్ర బడ్జెట్ కాక పూర్తిగా తగ్గలేదు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలివిడత సమావేశాలు ముగుస్తుండడంతో సీన్ కొంత మారే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో అమరావతిలో వేడి రాజుకోవడం ఖాయంగా ఉంది. ఈసారి ఏపీ బడ్జెట్ గురించి ఆసక్తికర చర్చ మొదలవుతోంది. హామీల అమలు విషయంలో కేంద్రాన్ని అన్ని పక్షాలు నిలదీస్తున్నాయి. ఎవరి మార్గంలో వారు మోడీ సర్కారు తీరుని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతున్నారు. ఇప్పటికే మోడీ, జైట్లీ ప్రకటనలు కూడా వారిని సంత్రుప్తి పరచలేదని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ లో కూడా పలు హామీలు నెరవేర్చాల్సి ఉంది. నిరుద్యోగభ్రుతి, రుణమాఫీ వంటి కీలకాంశాలు సహా పలు మాటలు నీటిరాతలుగానే ఉన్నాయి. కొన్ని అరకొరగా అమలయినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా లేవు. దాంతో చంద్రబాబు వ్యవహారం చర్చల్లోకి రాబోతోంది. బీజేపీRead More


వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్

మెగాస్టార్ చిరంజీవికి ట్రీట్మెంట్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా…అయితే ప్రస్తుతం 60వ పడిలో ఉన్న చిరు తన ఆరోగ్యం గురించి పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. రాజకీయంగా దూరం పాటిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ హీటు పుట్టిస్తున్నా చిరు మాత్రం పట్టనట్టే ఉన్నారు. మరో మూడు నెలల్లో రిటైర్ కాబోతున్న నేపథ్యంలో ఎంపీగా తన అవసరం పెద్దగా ఉండదని భావిస్తున్నారు. దాంతో పూర్తిగా పార్లమెంట్ కి ఢుమ్మా కొట్టేస్తున్నారు. సినిమాల మీద కేంద్రీకరించిన చిరంజీవి భాగంగా నేచురోపతి వైద్యం కోసం వైజాగ్ వెళుతున్నట్టు తాజాగా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రం ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కొంత ఆలశ్యమయినప్పటికీ జోరు పెంచాలని యూనిట్ భావిస్తోంది. అయితే ఈలోగానే ట్రీట్ మెంట్ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్ వెళుతున్నారనే ప్రచారం ఆసక్తిగా మారింది.. నేచురోపతిRead More


ప్రభాస్ పూర్తిగా యూరప్ లోనే…

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూడాల్సి వస్తోంది. బాహుబలి తర్వాత కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. సాహా మువీని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే ఈలోగానే కొత్త సినిమా ప్రారంభానికి ప్రభాస్ సిద్దమవుతుండడం కొంత ఆనందాన్నిచ్చే విషయం. సూజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సాహా మువీలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నిర్మాణ పనుల్లో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఈ డార్లింగ్‌ చేయబోయే చిత్రం ఏమిటన్నది స్పష్టత వచ్చేసింది. ఈ సారి ప్రభాస్ తన తదుపరి చిత్రం ఆయన సొంత బ్యానర్‌లో చేస్తున్నాడు. అదేనండీ… ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు ప్రొడక్షన్‌ గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఏప్రిల్‌ చివరి వారంలో చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించనున్నారు.Read More