Thursday, February 8th, 2018

 

బీజేపీ బంధంపై టీడీపీలో విబేధాలు

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766

తెలుగుదేశం నేతలు తల పట్టుకుంటున్నారు. తమను కనీసం పట్టించుకునే వాళ్లే లేక ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. హస్తినలో అధికార మిత్రపక్షంగా ఉన్నా వారి మాటలకు అసలు విలువ ఉండడం లేదు. చివరకు నిరసనలకు దిగినా మోడీ అండ్ కో మాట మాత్రం ఊరటనివ్వడం లేదు. ఏదో ఉద్దరిస్తారనే కథనాలు అల్లుుతున్నా కనికరించడం లేదు. ఏదో చెబుతారనుకుంటే చివరకు ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇఫ్పటికే నాలుగేళ్లు గడిచిపోయింది. ఐదు బడ్జెట్ లు అయిపోయాయి. ప్రజాగ్రహం కట్టులు తెంచుకుంటోంది. ఆఖరికి తమ కొంపల మీదకు వస్తుందనే భయాందోళన కనిపిస్తోంది. దాంతో ఏం చేయాలో పాలుపోని టీడీపీ ఎంపీలు కాడి వదిలేయాలని భావిస్తున్నారు. బీజేపీని మోయాలని చూస్తే తామే మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు. దాంతో ఈ వ్యవహారం టీడీపీలో దుమారం రేపుతోంది. రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణం అవుతోంది.Read More


మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?

shah cbn

తెలుగుదేశం తెగిస్తుందా…ఇంకా వేచి చూస్తుందా. ఆ పార్టీ ఎంపీలు సహనం చచ్చిపోయిందంటున్నారు. బీజేపీని ఇక భరించలేమంటున్నారు. పార్లమెంట్ లో తమను ఖాతరు చేయని పార్టీని పట్టుకుని వేలాడలేమంటున్నారు. కానీ అధినేత అభిప్రాయం భిన్నంగా ఉంది. దాంతో బీజేపీ, టీడీపీ బంధం ఢోలాయమానంలో కొనసాగుతోంది. ఏపీ మంత్రులు కూడా తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని వదిలించుకుంటామని తెగేసి చెబుతున్నా టీడీపీ అధ్యక్షుడు మాత్రం దుబాయ్ లో ఉండడంతో వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. ఏపీలో ప్రజలు మంచి కాకమీద ఉన్నారు. తాజాగా బంద్ తో ఇది ప్రస్ఫుటం అయ్యింది. ఈ బంద్ నిర్వహణకు చంద్రబాబు సర్కారు చేదోడు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం విశేషంగా స్పందించారనడంలో సందేహం లేదు. అయితే బీజేపీ మాత్రం ఇది పూర్తిగా చంద్రబాబు తమ మీద వేసిన స్కెచ్ గా భావిస్తోంది. బీజేపీని, మోడీని బద్నాంRead More


పడిపోయిన బంగారం ధరలు

gold

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో దేశీయంగా ఓవైపు సెన్సెక్స్ పతనం అవుతోంది. బడ్జెట్ తర్వాత రోజురోజుకీ దిగువకు పడిపోతుంది. తాజాగా బంగారం ధరలు కూడా తగ్గుదల నమోదు చేసుకున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్ లో 10గ్రాముల బంగారం 600 రూ.ల వరకూ తగ్గింది. మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. పది గ్రాముల బంగారం ధర రూ.30,950 వద్ద ట్రేడయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా ధరల పతనానికి కారణమని బులియన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధరలు కూడా మరోసారి రూ.39 వేల మార్కుకు దిగువన ట్రేడయ్యాయి. రూ.450 మేర తగ్గడంతో కిలో వెండి ధర రూ.38,900గా ఉంది. పరిశ్రమలు, కాయిన్ తయారీదారులు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు వ్యాపారులు చెబుతున్నారు.


ప్రభాస్ గురించి నన్ను విసిగించకండి…

anushka-prabhas-1

భాగమతి మరోసారి నోరు తెరిచింది. బాహుబలితో బంధం గురించి స్పష్టం చేసింది. ప్రభాస్ తో తన ప్రేమ,, పెళ్లి వ్యవహారాల గురించి వార్తలను ఆమె తోసిపుచ్చింది. తామిద్దరం కేవలం స్నేహితులమేనని, చాలామార్లు ఈ విషయం స్పష్టం చేశానని, అయినా అనవసరంగా తనను విసిగించవద్దంటూ తెలిపింది. దాంతో అనుష్క తాజా కామెంట్స్ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రభాస్ , అనుష్క బాగా దగ్గరవుతున్న విషయం అనేక మార్లు స్పష్టం అయ్యింది.. ఏకంగా భాగమతి సెట్స్ లో ప్రభావతి దర్శనం, సాహా షూటింగ్ లో అనుష్క అడుగుపెట్టడం అందుకు నిదర్శనం. అయినప్పటికీ తామిద్దరం కేవలం స్నేహితులు మాత్రమేనని జేజమ్మ చెబుతోంది. మా స్నేహం కొనసాగుతుందని చెబుతూనే, పెళ్లిలాంటి ప్రపోజల్స్ లేవంటోంది. గతం నుంచి సినీరంగానికి చెందిన ప్రేమపక్షులు చేసిన కామెంట్స్ ఇప్పుడు అనుష్క దగ్గర రిపీట్Read More


పవన్ పథకం పారుతుందా..

janasena

ఏపీ రాజకీయాల్లో జనసేన వ్యవహారాలు నిత్యం ఆసక్తిగానే ఉంటాయి. అసలు ఆపార్టీ తీరే విభిన్నంగా ఉంటుంది. ఇప్పటికీ ఏకవ్యక్తి పార్టీగానే కనిపిస్తోంది. నిర్మాణం మాట పక్కన పెడితే నేటికీ కమిటీలు, కార్యకర్తలు కనిపించడం లేదు. పరీక్షలు పెట్టి ఎంపిక చేసిన వాళ్లకు కూడా భవితవ్యం బోధపడడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి ప్రత్యేక హోెదా డిమాండ్ ముందుకు తెచ్చారు. సొంత పార్టీ నిర్మాణం విషయంలో నాన్చుతున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా వివిధ పార్టీలు, నాయకులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానికి తగ్గట్టుగా లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో మంతనాలకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఏపీలో వివిధ పక్షాలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నాయి. అలాంటి సమయంలో అందరినీ కలిపి ఒక తాటిRead More


మాజీ సీఎం కులం మార్చేసిన మోడీ

Faridabad - Prime Minister Narendra Modi  during a workshop for the newly elected MPs at Suraj Kund in Faridabad on Saturday, 28 June 2014. (Photo by ARIJIT SEN . DNA)

మోడీ వ్యతిరేకులు అనేక ప్రచారాాలు చేస్తుంటారు. మిస్టర్ ఫేకూ అని కూడా పిలుస్తుంటారు. ఆయన తీరుని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో ఎండగడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయనతో పాటు అనుచరులు కూడా పలుమార్లు ఫేక్ ఫోటోలు వినియోగించి పక్కాగా దొరికిపోయారు. ఇక తాజాగా పార్లమెంట్ సాక్షిగా మోడీ చేసిన ప్రకటనలో అర్థసత్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మోడీ అబద్ధాల ప్రభావం ఆఖరికి అత్యున్నత చట్ట సభకు చేరిందనే వాదన వినిపిస్తోంది. ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై ఎంపీల నిరసనకు సమాధానంగా మోడీ పార్లమెంట్ లో ప్రసంగిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ మీద ఆయన దుమ్మెత్తిపోశారు. ఏపీ డిమాండ్స్ కోసం నిలదీస్తుంటే ఆయన మాత్రం కర్ణాటకా ఎన్నికల ప్రచార సభను తలపించేలా ఉపన్యసించారు. పూర్తిగా కాంగ్రెస్ మీద దాడికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే దళిత ముఖ్యమంత్రిRead More


ఆత్మహత్యాయత్నం వెనుక రాయపాటి కొడుకు

rayapati

ఏపీలో మరో వివాదం రాజుకుంది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. గుంటూరు జిల్లాకి చెందిన ఈ సీనియర్ తెలుగుదేశం ఎంపీ కొడుకు కారణంగా డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం కలకలం రేపుతోంది. విజయ రాజు అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన దుమారం రేపుతోంది. అట్టడుగు వర్గానికి చెందిన తనను అన్నిరకాలుగానూ వేధించారని బాధితుడు వాపోతున్నారు. నిద్ర మాత్రలు మింగిన విజయరాజును గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. టీడీపీ ఎంపీ కుమారుడు తనను వేధిస్తున్నట్లు సుసైడ్ నోట్‌లో బాధితుడు పేర్కొన్నాడు. ఎంపీ కుమారుడుతో మరో ముగ్గురు ఆఫీస్ సిబ్బంది పేర్లు లేఖలో ప్రస్తావించారు. తాను తీసుకున్న రూ. 15 వేలు అడ్వాన్స్ వెంటనే చెల్లించపోతే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దాంతో ఈ వ్యవహారంRead More


సైరా సినిమా నుంచి బిగ్ వికెట్ డౌన్

chiranjeevi

చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదొక ప్రచారం జరుగుతూనే ఉంది. అది నిజమవుతూనే ఉంది. సంగీత దర్శకుడు రెహమాన్‌, బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ ఈ సినిమా నుంచి తప్పుకుంటారని మొదట ప్రచారం జరిగింది. అది నిజమైంది. ఇప్పుడు బాలీవుడ్‌ బిగ్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఆయన స్థానంలో మరో నటుడి కోసం చిత్రబృందం అన్వేషిస్తుందని ఈ రూమర్‌ సారాంశం. ఎప్పుడూ లేనిది ఈ సారి మాత్రం రూమర్‌పై చిత్రబృందం స్పందించింది.’సైరా’ టీమ్‌లో ఎలాంటి మార్పులూ లేవని, అమితాబ్‌ బచ్చన్‌ టీమ్‌లో ఉన్నారని, ఆయన తప్పుకున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చింది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. సంక్రాంతికి తీసుకున్న సుదీర్ఘ సెలవుRead More