Main Menu

Sunday, February 4th, 2018

 

టీమిండియా సంచలన విజయం

టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. చివరి టెస్టులో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్న కోహ్లీ సేన వన్డేలలో మాత్రం సత్తా చాటుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా సంచలన విజయం సాధించింది. డర్బన్ లో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మీద కింగ్స్ మీడ్ లో తొలిసారిగా విజయకేతనం ఎగురవేసిన టీమిండియా తాజాగా సెంచూరియన్ లో చరిత్ర తిరగరాసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగారు. దాంతో ఆ స్టేడియంలో అతి స్వల్ప స్కోర్ కే దక్షిణాఫ్రికా జట్టు ఆలౌట్ అయ్యింది. గతంలో జింబాబ్వే సాధించిన 119 రన్స్ అతి స్వల్ప స్కోర్ కాగా, తాజాగా దక్షిణాఫ్రికా జట్టు 32.2 ఓవర్లలో కేవలం 118 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో జేపీ డుమినీ చేసిన 25 పరుగులే అత్యధికRead More


ఆంధ్రజ్యోతి అవస్థలు అన్నీఇన్నీ కావు…

ఏపీ రాజకీయాల్లో ఆంధ్రజ్యోతి పాత్ర గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు కాల్లో ముళ్లు గుచ్చుకుంటే ఏబీఎన్ యాజమాన్యం నొప్పి అనుభవిస్తుంది. అంతలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధాలున్న వారికి తాజా పరిణామాలు అంతగా రుచించడం లేదు. ఓవైపు కమలనాధులు చంద్రబాబుని దాదాపుగా దూరం పెట్టేశారు. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. చివరకు ఏడాదికి పైగా కాలం పాటు పీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఆశ్చర్యపరిచారు. అయినా చంద్రబాబు ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు.కొందరు ఎంపీలు, మంత్రులు రాజీనామాల ప్రస్తావని తెచ్చినా వద్దు అనే వారిస్తున్నారు. కనీసం నిరసన తెలపడానికి కూడా ఆయన సాహించించడం లేదు. ఇది బీజేపీ నేతలకు మరింత అలుసుగా మారింది. తెలుగుదేశం ఎంపీలకు ఇన్నాళ్లుగా ఢిల్లీలో గౌరవం లేదని బాధపడితే, తాజాగా తమను విపక్షం కన్నా దూరం పెడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలRead More


బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు

బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెలరేగిపోయారు. మరోసారి ఆయన చంద్రబాబు మీద గురిపెట్టారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్ష నేత అవినీతి, అక్రమాలను ప్రస్తావించారు. రెండెకరాల నేతకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించి సంచలనం రేపారు. గతంలో ప్రత్యర్థులుగా ఉన్నకాలంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల కన్నా తీవ్రంగా తాజాగా సోము వీర్రాజు విరుచుకుపడడం గమనిస్తే వారి బంధం పూర్తిగా బీటలు వారడం ఖాయంగా కనిపిస్తోంది. తాము నిప్పులాంటి వాళ్ళమని, మీరు అవినీతికి వారసులంటూ చంద్రబాబునుద్దేశించి సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ‘‘మీరు మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడివి? కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థపరులకు ఆదాయ వనరులుగా మారాయి. సీఎం నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా? అంటూRead More


వీధికెక్కిన జనసేన విబేధాలు

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా తయారయ్యింది జనసేన పరిస్థితి. కమిటీ లేదు, నాయకత్వం లేదు గానీ ఆధిపత్య పోరు మాత్రం షురూ అయ్యింది. దాంతో ఆ పార్టీ పరువు గోదావరి పాలవుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళా నేతను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో సాగిస్తున్న వ్యవహారం చివరకు పోలీసులకు చేరింది. జనసేన అభిమానులుగా చెప్పుకుంటూ గతంలో పలువురిని బ్లాక్ మెయిల్ చేసిన నేతల భాగోతం మరచిపోకముందే ఇప్పుడు పార్టీలో పదవులు కోసం రాజమహేంద్రవరం నాయకురాలిని బద్నాం చేసే ఎత్తులు వేయడం చివరకు కేసులకు దారితీసింది. రాజమహేంద్రవరానికి చెందిన మహిళా నాయకురాలు జనసేన సేవాదళ్ పేరుతో చాలాకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంటా స్వరూప చేస్తున్న కార్యక్రమాలు ఆపార్టీ అధినేత ద్రుష్టికి చేరాయి. త్వరలో ఆమెకు రాష్ట్రస్థాయిలో పదవి కట్టబెట్టడం ఖాయమనేRead More


ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు..

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పేలా లేదు. బాహుబలి పేరుతో గడిచిన ఐదేేళ్లలో కేవలం రెండే సినిమాలలో ఈ హీరో దర్శనమిచ్చాడు. అయితే ఆ రెండూ ప్రపంచస్థాయిలో సంచలనం కావడంతో ఫ్యాన్స్ సంత్రుప్తి చెందారు. అయితే ఆ తర్వాత సిద్దమయిన సాహో ద్వారా వీలయినంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తాడని ఆశిస్తే అది కూడా జాప్యం జరుగుతోంది. దాంతో వచ్చే ఏడాది వరకూ ప్రభాస్ తెరమీద కనిపించే అవకాశం లేదనే సమచాారం చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న ‘సాహో’ టీజర్‌ను విడుదల చేశారు. కానీ ఆ తర్వాత అప్‌డేట్స్‌ లేవు. ప్రస్తుతం దుబాయ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలో శ్రద్ధా కపూర్‌ కూడా షూటింగ్‌లో జాయిన్‌ కానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా హలీవుడ్‌Read More