Main Menu

Friday, January 12th, 2018

 

అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఎన్టీఆర్ కలవరం

అజ్ఞాతవాసి సినిమా ఫలితంతో పవన్ అభిమానులు అంతా షాక్ కి గురయ్యారు. అయితే అజ్ఞాతవాసి ఫలితంతో బుక్ అవడం పవన్ అభిమానుల వంతయితే….అదే టైం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒకింత ఉలికిపడ్డారు. అందుకు కారణం త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ప్లాన్ చేయడమే. అజ్ఞాతవాసిని అడ్డదిడ్డంగా తీసేసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని ఇంకేంతలా చేస్తాడో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం. ఈ ఫీలింగ్ ఎన్టీఆర్ వరకు కూడా చేరింది. దాంతో ఎన్టీఆర్ కూడా డైలమాలో పడ్డాడట. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి స్టొరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. సినిమా లాంచ్ కూడా అయ్యింది. కాకపోతే ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రెడీ అయ్యిందా? లేదా? అనేది ప్రస్తుతానికి అనుమానం. స్క్రీన్ ప్లేతో పాటు స్టొరీ మొత్తం ఎన్టీఆర్ విన్నట్లు అయితే….మరోసారి ఆలోచించుకోవడం బెటర్.Read More


అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్

ఏపీ రాజధానిలో రకరకాల నగరాల నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించారు కూడా. పరిపాలన అంతా ఒక ప్రాంతంలో, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ అన్నట్టుగా వివిధ రంగాల వారీగా పలు సంస్థలు అక్కడికి వస్తాయని చెబుతున్నారు. అందులో భాగంగా పెట్టుబడుల ఆకర్షణ కోసమేనంటూ ప్రపంచమంతా పర్యటనలు సాగిస్తున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా సాగిపోతున్నారు. అదే సమయంలో మీడియా కూడా అమరావతికి తరలిరావాలని అంతా ఆశిస్తున్నారు. మన రాష్ట్రం, మన చానెల్ అంటూ ఏపీ వాసుల్లో చాలామందిలో అలాంటి అభిప్రాయం ఉంది. హైదరాబాద్ వార్తలకే ప్రాధాన్యతనిస్తూ ఏపీ ఆశలకు గండికొట్టేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. కానీ ఆచరణలో అలాంటి ప్రయత్నాలకు చాలామంది దూరంగా ఉన్నారు. విజయవాడ కేంద్రంగా న్యూస్ చానెల్ నడపడం సులువు కాదని భావించి, కొందరు స్టూడియోలతో సరిపెట్టేశారు. కానీ ఏపీ 24*7 పేరుతోRead More


బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

ఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తికాగా,ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతోంది. చిత్తూరు ఏపీ సీఎం సొంత జిల్లా కావడం, ప్రతీ ఏటా సంక్రాంతికి ఆయన కుటుంబంతో కలిసి సొంత ఊరు నారావారి పల్లెలో గడుపుతుండడం తెలిసిందే. అయితే ఈసారి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా పండుగ చేసుకుంటుండడం విశేషంగా మారింది. వాస్తవానికి చంద్రబాబు చాలాకాలంగా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడి నుంచి వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన 1983లో ఓటమి తర్వాత కుప్పం తరలివెళ్లారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మరోసారి కుటుంబ సభ్యులతోRead More


కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

కర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదే పరంపరలో వైసీపీ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ముందుగా అభ్యర్థిని ప్రకటించడం ద్వారా వైెఎస్ జగన్ కొత్త వ్యూహాలను రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కొన్ని నియోజకర్గాల్లో స్పష్టతనివ్వడం ద్వారా పార్టీ పనికి ఆటంకాలు లేకుండా చేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీకి సహజంగానే బలమైన నియోజకవర్గాల్లో కర్నూలు ఒకటి. గడిచిన ఎన్నికల్లో కూడా ఆపార్టీ గెలిచింది. కానీ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించడంతో వైసీపీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం ఏర్పడింది. ఈనేపథ్యంలో జగన్ పాదయాత్ర సందర్బంగా విశేష స్పందన రావడంతో వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో పలు చోట్ల అభ్యర్థులను ఖాయం చేసేRead More


వచ్చే నెలలో టచ్ చేస్తున్న రవితేజ

మాస్ మహారాజ్ మువీ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఉండాలని ఆశించినప్పటికీ ఆయన వచ్చే నెల మొదటి వారానికి మారాల్సి వచ్చింది. చివరకు ఫిబ్రవరి 2న టచ్ చేసి చూడు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రం సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిినమాలో రవితేజ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రవితేజ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం సంగీతాన్ని అందిస్తున్నారు.