Main Menu

Thursday, January 11th, 2018

 

టీడీపీలో కలకలం కేసులో మేయర్

టీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలంగాణాలో ఏకంగా జైలు పాలయ్యారు. మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సీబీఐ కేసుల్లో ఇరుకున్నారు. వారికితోడుగా ఉదయగిరి ఎమ్మెల్యే పై మహారాష్ట్రలో కేసు నమోదయ్యింది. వెంకటగిరి ఎమ్మెల్యే వ్యవహారం కూడా దుమారం రేపింది. ఇక తాజాగా నెల్లూరు నగర మేయర్ కూడా కేసుల్లో ఇరుకున్నారు. నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలుగుదేశంలో ఉన్నారు. ఆయనపై చెన్నైలో కేసు నమోదయ్యింది. అగ్రిటెక్ పేరుతో మోసం చేశారంటూ ఛీటింగ్ కేసు నమోదయ్యింది. ఆయనతో పాటు మేయర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దాంతో మేయర్ ప్రస్తుతం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ భారీ మోసాలకు పాల్పడిన వ్యవహారం కావడంంతో కోర్ట్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి.


హెబ్బా పటేల్ 24 ముద్దులు

అబ్బా..హెబ్బా అన్నారు ఆడియెన్స్. కుమారి సినిమాతో కుర్రకారులో హీటు రాజేసింది. దాంతో హఠాత్తుగా క్రేజ్ వచ్చినా తగినట్టుగా వ్యవహరించకపోవడంతో మళ్లీ కొంత వెనకడింది. అయితే ఇప్పుడు ఏకంగా ఒకటీ..రెండూ కాదు ఏకంగా 24 ముద్దులతో మళ్లీ హల్ చల్ చేయబోతోంది. మరోసారి హాట్ హాట్ సన్నివేశాలతో కుర్రకారు మది దోచేందుకు సిద్ధమైపోతోంది. ఈసారి ముద్దులతో పిచ్చెక్కిస్తా అంటూ వస్తున్న హెబ్బా… ఒకటి కాదు రెండు కాదు ‘24 కిస్’లు ఇచ్చేస్తుందట. అందుకే ఆ సినిమా టైటిల్‌ను కూడా అలాగే ఫిక్స్ చేసేశారు. ‘మిణుగురులు’ సినిమా దర్శకుడు అయోధ్య కుమార్.. వెరైటీ కాన్సెప్ట్‌తో ముందుకొస్తున్నాడు. ఈ సినిమాకు ‘శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీలక్ష్మీగా కనిపించే హెబ్బాకు.. 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని దర్శకుడు అయోధ్య కుమార్Read More


ప్రభాస్ కష్టం గురించి అనుష్క..

భాగమతి మరోసారి బాహుబలిని గుర్తు చేశారు. ప్రభాస్ కష్టం గురించి అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరోసారి తెరమీద రొమాన్స్ కి సిద్దమవుతున్న ఈ జంట ఒకరి గురించి ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా భాగమతి సినిమాకి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా అనుష్క చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికి్ అవుతున్నాయి. భాగమతి సినిమాలో అనుష్క స్లిమ్ గా కనిపిస్తోంది. అంతగా సన్నబడడానికి కారణాల గురించి ఆమెను ప్రశ్నించగానే ప్రభాస్ ప్రస్తావన వచ్చేసింది. ప్రముఖ హీరోలు విక్రమ్, అమీర్ ఖాన్, బాహుబలి కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డారో తెలుసుకదా అంటూ ఆమె స్పందించారు. ఇక, ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాల్లో విక్రమ్‌ కష్టాన్ని కళ్లారా చూశారంటూ వ్యాఖ్యానించారు. హిందీలో ఆమిర్‌ కూడా అంతేనని తెలిపారు. ‘గజని’, ‘దంగల్‌’ సినిమాల కోసం బాడీని బాగా కష్టపెట్టేశారంటూRead More


పరువు కాపాడుకోవడానికి బాబు…

అడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయన చిటపటలాడారు. తాటతీస్తానంటూ బెదిరించారు. దాంతో ఆ సామాజికవర్గంలో మంటలు చెలరేగాయి. మత్స్యకార నాయకుల మీద చంద్రబాబు బెదిరింపులతో కలకలం రేగింది. పలు చోట్ల ఆందోళనలు సాగాయి. ఆ తాకిడితో చంద్రబాబు దిగివచ్చారు. విశాఖపట్నంలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వారిపై చిందులు వేసిన చంద్రబాబు తీరు మారిపోయింది. తూర్పు గోదావరి జిల్లా జన్మభూమి సభలో మాట మార్చేశారు. మత్స్యకారులను ఎస్టీలలో చేర్చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. రెండు రోజుల ముందు కూడదన్నది..ఇప్పుడు ఖాయం చేసి చాలామందిని ఆశ్చర్యపరిచారు. చంద్రబాబు పరువు కాపాడుకునే ప్రయత్నంలోనే ఇలాంటి మాటలు ఉపయోగించి ఉండవచ్చని అంతా భావిస్తున్నారు. బోయలను ఎస్టీలలో చేర్చడానికి ప్రక్రియ ప్రారంభించిన చంద్రబాబు మత్స్యకారులను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తున్నారు. తమ గోడు చెప్పుకుందామనిRead More