Main Menu

Tuesday, January 9th, 2018

 

అజ్ణాతవాసి మువీ రివ్యూ

మువీ: అజ్ణాతవాసి న‌టీన‌టులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యేల్, రావు ర‌మేష్ త‌దిత‌రులు సంగీతం: అనిరుద్ సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్ నిర్మాత‌: ఎస్ రాధాకృష్ణ‌ ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మువీ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనూ సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి పరాజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా ఊరట దక్కుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే టీజర్ మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక సినిమాల నుంచి పొలిటికల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో వచ్చిన అజ్ణాతవాసి చాలా హంగామా చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కి తగ్గట్టుగా సినిమా ఉందా…ఈ రివ్యూలో చూద్దాం. కథ: గోవింద్ భార్గవ్ సాధారణ స్థాయి నుంచి ఎదిగిన ఓRead More


చిరుకి కాదని, పీకేకి ఓకే చెప్పిన చంద్రబాబు

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి. ఆయన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150కి విశేషమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూసిన సమయంలో చిరంజీవి నేరుగా ప్రయత్నించినా చంద్రబాబు ససేమీరా అన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అదనపు షోలకు గానీ, టిక్కెట్ రేట్ల పెంపుదల విషయంలో గానీ చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం కూడా ఆ సినిమా యూటిన్ చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. విజయవాడలో తగిన గ్రౌండ్ అనుమతులు ఇవ్వకుండా ఆడ్డంకులు పెట్టడంతో చిరంజీవి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం అలాంటి సమస్యలు లేవు. సినిమా యధేశ్ఛగా 8 రోజుల పాటు రోజూ ఏడెనిమిది షోలు వేసుకోవడానికి తగ్గట్టుగా ప్రభుత్వం 21 గంటల అనుమతినిచ్చింది. టిక్కెట్ల రేట్లుRead More


సెలవులు ముగించుకున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్న సంగతి విధితమే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన మహేష్ కొద్దిరోజుల క్రితం బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ ట్రిప్ ను ముగించుకున్న అయన షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టనున్నారు. హైదారాబాద్లో షూట్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్లోనే మహేష్, హీరోయిన్ కైరా అద్వానీపై కొన్ని కెలక సన్నివేశాలతో పాటు పాటల్ని కూడా చిత్రీకరించనున్నారు. మహేష్ తో ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ ను తీసిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు


వైసీపీలో మాజీ ఎమ్మెల్యే

అరకు సహజంగా చల్లని ప్రాంతం. అందులోనూ శీతాకాలంలో అయితే మరింత చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు అరకు వైసీపీలో మాత్రం రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, బొత్సా అనుచరుడు కంభా రవిబాబు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అనూహ్యంగా రాజకీయాలు మారిపోయాయి. గతంలో అరకు సీటు విషయంలోనే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోయినట్టు ప్రచారం జరిగింది. ఆమె తన అనుచరుడు శెట్టి లత్సాలు కోసం ప్రయత్నం చేశారు. కానీ తాజాగా రవిబాబుకి కండువా కప్పేసిన జగన్ , ఆయనకే టికెట్ ఖాయం చేసినట్టు ప్రచారం సాగుతోంది. గతంలో రవిబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి గెలిచి టీడీపలో చేరిపోయారు. అసెంబ్లీలో విప్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కిడారికే టీడీపీ టికెట్ అనేRead More