Main Menu

Sunday, January 7th, 2018

 

‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?

ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదలయిన వార్ మరింత ముదరడంలో మీడియాదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. అందులో టీవీ9ది అగ్రస్థానం. ఏబీఎన్ వంటి వాళ్లు కూడా అగ్నికి ఆజ్యం పోస్టున్నట్టు స్పష్టం అవుతోంది. అనేక సమస్యలుండగా, ఇలాంటి వివాదాస్పద అంశాలు మాత్రమే విస్త్రుతంగా ప్రసారం సాగించడం ద్వారా తమ రేటింగ్ పెంచుకోవడానికి టీవీ చానెళ్లు ప్రయత్నిస్తాయి. అందులో సందేహం లేదు. వ్యాపారం కాబట్టి చేసినా తప్పుబట్టకూడదు. కానీ అదే సమయంలో మీడియా కొంత మితిమీరి ప్రచారం చేయడం ద్వారా సమాజాని చేస్తున్న చేటు గురించి కూడా ఆలోచించాలి. మెరుగైన సమాజం, ప్రతి అక్షరం ప్రజల కోసమేనని చెప్పుకుంటూ ఇలాంటి వ్యవహారాలలో అతి చేయడం అనర్థదాయకం అన్నది గమనించాలి. గడిచిన వారం రోజులుగా 2018 క్యాలెండర్ ఇయర్ లోRead More


కత్తి మహేష్ దే పై చేయి

తాజాగా కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో పవర్ స్టార్ పై సినీ క్రిటిక్ పై చేయిగా కనిపిస్తున్నారు. దానికి కారణం ఆయన ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పలేకపోవడమే. 6 ప్రశ్నలకు పవన్ శిబిరం నుంచి సమాధానం వస్తే కథ కొత్త మలుపు తిరుగుతుందనడంలో సందేహం లేదు. లేకుంటే మాత్రం ప్రజల్లో పూనమ్ తో పవన్ సంబంధంపై సవాలక్ష అనుమానాలు పెరుగుతాయనే చెప్పవచ్చు. అందుకే వీలయినంత త్వరగా ఈ విషయంలో ఓ కొలిక్కి వచ్చేలా చూసుకోవడం రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్ కి అత్యవసరంగా మారింది. ఒకవేళ కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలు అవాస్తవాలయితే పరువు తీసినందుకు తక్షణం కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిరాధార వ్యవహారాలకు అడ్డుకట్టే వేసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా మౌనమే సమాధానం అనుకుంటే మాత్రం పవన్ తీరుRead More


పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు

ఇదే చర్చ మొదలయ్యింది. తాజాగా కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ తగాదాలో పూనమ్ కౌర్ ప్రస్తావన కలకలం రేపుతోంది. అది ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో ముడిపడిన విషయం కావడంతో రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. పవన్ చెబితే చంద్రబాబు పదవి ఇచ్చారనే రీతిలో కత్తి ప్రశ్న సంధించారు. ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడార్ గా పూనమ్ కౌర్ కి పదవి ఎవరు చెబితే ఇచ్చారంటూ కత్తి మహేష్ విసిరిన ప్రశ్నకు తెలుగుదేశం పెద్దలు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి పూనమ్ తెలుగమ్మాయి కాదు. పైగా పాపులారిటీ కూడా లేదు. ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్. అంతేగాకుండా వ్యక్తిగత వ్యవహారంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, సమస్యలతో ఉన్న నటి. అలాంటి పూనమ్ కౌర్ ని ఏరికోరి పదవి కట్టబెట్టడం వెనుక కారణాల గురించి కత్తి మహేష్ సంధించిన ప్రశ్నకు కొనసాగింపుగా,Read More


కత్తి కథతో ఇరకాటంలో కాటమరాయుడు

ఓ సినిమా క్రిటిక్ విమర్శలకు పవన్ ఫ్యాన్స్ స్పందించిన తీరు చివరకు చినికి చినికి గాలివానలా మారింది. ఏకంగా పవన్ వ్యక్తిగత సంబంధాలు తెరమీదకు రావడానికి కారణంగా మారింది. పూనమ్ కౌర్ , పవన్ కళ్యాణ్ మధ్య వ్యవహారం కొత్త వివాదంగా మారుతోంది. దానికి ప్రధాన కారణం నియంత్రణ లేని పవన్ ఫ్యాన్స్ తీరే అని చెప్పవచ్చు. వాస్తవానికి కత్తి మహేష్ ఓ మంచి విమర్శకుడు. అనేక అంశాలలో ఆయన తన వైఖరిని సోషల్ మీడియా ద్వారా చాటుతున్నారు. అయితే అతడిని ఏకంగా తెలుగు న్యూస్ చానెళ్లలో లైవ్ డిస్కషన్స్ కి ఓ హాట్ టాపిక్ గా మార్చడానికి పవన్ ఫ్యాన్స్ చాలా క్రుషి చేసినట్టే భావించవచ్చు. నేరుగా వ్యక్తిగతంగా ఆయన్ని కెలికి చివరకు జనసేనలో కుదుపు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. తాాజగా తన పార్టీ శ్రేణులందరికీRead More


ఆ లేఖ ఫేక్

ఏపీలో ఐఏఎస్ ల సంఘం పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ ఫేక్ అని పలువురు భావిస్తున్నారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు పక్కన పెడితే అధికారికంగా ఐఏఎస్ ల సంఘం సీఎం కి లేఖ రాసిన దాఖలాలు లేవని తేలింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, టీడీపీ కార్యకర్తలే అడ్డగోలుగా సర్కారీ సొమ్ము మింగేస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించిన అంశాల విషయం పక్కన పెడితే కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై అసోసియేషన్ తరపున లేఖలు రాయలేదని సమాచారం. అదే సమయంలో సదరు లేఖ మీద సంతకం కూడా లేకపోవడంతో సందేహాలు పెరిగాయి. చివరకు లేఖ వాస్తవం కాదని తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. అంత ఘాటుగా లేఖరాస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. పాలనలో వచ్చిన విబేధాలకు సాక్ష్యంRead More


మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

ఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణనశాఖ సీఎస్‌వో తేల్చి చెప్పడంతో మోడీ సర్కార్‌ ఇరకాటంలో పడినట్టేనని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచీ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్నట్టు వారు విశ్లేషించారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు సమర్పించనున్న బడ్జెట్‌పై గణనశాఖ వెల్లడించిన వాస్తవాలు ప్రభావం చూపనున్నట్టు వారు చెబుతున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.5 శాతం ఉండనున్నట్టు ముంబయిలోని నిర్మల్‌బ్యాంగ్‌ ఈక్విటీస్‌ ప్రయివేట్‌కు చెందిన ఆర్థికవేత్త తెరిసాజాన్‌ తెలిపారు. ఇది అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన అంచనా 3.2 శాతంకన్నా అధికం కావడం గమనార్హం. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాలుRead More


మళ్లీ సైకిలెక్కుతాడా..వర్మా!


దీనస్థితిలో సనత్ జయసూర్య

జయసూర్య. క్రికెట్ లో ఆ పేరే ఓ సంచలనం.. శ్రీలంక క్రికెట్ చరిత్రలో పెను ప్రకంపనం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన ఆటగాడు. ఎడం చేతి వాటం బ్యాటింగ్, బౌలింగ్ తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆటగాడు. అలాంటి ప్రఖ్యాత ఆటగాడు. 1990 దశకం చివరిలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో పట్టపగ్గాలు లేకుండా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చివరకు నడవలేని స్థితిలో నానా ఇక్కట్లు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ లో బౌలర్లకు చుక్కలు చూపించి బ్యాటింగ్‌తో అదరగొట్టే జయసూర్య ప్రస్తుతం నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. స్ట్రెచర్స్‌లేనిదే అడుగులు ముందుకు వేయని పరిస్థితికి చేరుకున్నాడు. మోకాలి సమస్యతో దయనీయంగా కనిపిస్తున్నాడు. అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నాడు. ప్రధానంగా మోకాలి సమస్య నుంచి బయటపడేందుకు త్వరలోనే ఆస్ట్రేలియాRead More