Thursday, January 4th, 2018

 

గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని

03-1514975776-03-1514955546-gazal-srinivas-video-654

తెలుగు మీడియా చానెల్స్ యజమానుల వ్యవహారం ఓ అడుగు ముందుకేసింది. ఇప్పటికే అనేక వ్యవహారాలను చక్కదిద్దుకున్న పెద్దలు ఇప్పుడు ఏకంగా ఓ ప్రతిష్టాత్మక అవార్డ్ విషయంలో పోటీదారుడిని ఇరుకున పెట్టడంలో ఎంతకైనా తెగిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే గజల్స్ శ్రీనివాస్ వ్యవహారం తెరమీదకు వచ్చినట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను త్వరలో ప్రకటించబోతున్నారు. దాంతో వాటి కోసం లాబీయింగ్ నడుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే తెలుగు గడ్డ మీద ఆధ్యాత్మకి సేవ కోటాలో ఇద్దరు ప్రముఖులు పోటీ పడడం వివాదానికి మూలంగా భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ సేవలతో గజల్స్ శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నిస్తుండగా, అదే తరహాలో కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో పెద్ద స్థాయిలో హంగామా చేసే టీవీ చానెల్స్ యజమాని పోటీకి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. న్యూస్ చానెల్ ద్వారాRead More


ధోనీ గ్రేడ్ పడిపోతోంది..

dhoni

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ‘ఎ’ గ్రేడ్‌కు బీసీసీఐ ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన ధోనీని బీసీసీఐ అగ్రశ్రేణి కాంట్రాక్టులో ఉంచడంపై ఇప్పటికే పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా కాంట్రాక్టులో అతడి పేరును అగ్రశ్రేణి నుంచి తప్పించాలని బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్‌ కమిటీ(సీవోఏ) భావిస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గత ఏడాది నవంబరు 30న సారథి విరాట్‌ కోహ్లీ, ధోనీతో పాటు కోచ్‌ రవిశాస్త్రి బీసీసీఐ సీవోఏను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై కసరత్తులు చేపట్టిన సీవోఏ కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పటికే తుది నివేదిక తయారు చేసిందట. దీన్ని త్వరలో బీసీసీ ఫైనాన్స్‌ కమిటీకి అందజేయనుంది. ఏ ప్లస్‌, ఏ, బీ, సీ ఇలా నాలుగు శ్రేణుల ద్వారా ఆటగాళ్లకు జీతాలు అందజేయాలనుకుంటుంది. ఈRead More


ధావన్ ఫిట్, జడేజా డౌట్

jadeja

కీలక సమరానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. సఫారీల సొంత గడ్డ మీద సవారీ చేయాలని ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రాక్టీస్ లేకపోవడంతో కొంత సతమతం కావాల్సిన స్థితిలో ఉంది. దానికి తోడు ఆటగాళ్ల ఫిట్ నెస్ పెద్ద సమస్యగా మారుతోంది. కీలక ఓపెనర్ శిఖర్ ధావన్ స్వల్ప గాయం నుంచి కోలుకోవడం కొంత ఊరట. వాస్తవానికి తొలి టెస్టుకి అందుబాటులో ఉండడని భావించినప్పటికీ ధావన్ వేగంగా కోలుకుని, ఫిట్ నెస్ సాధించడం విశేషం. తొలి టెస్టులో అతను మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. అయితే ఆల్ రౌండర్ జడేజా మాత్రం జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన్ని స్థానిక ఆస్పత్రికి కూడా తరలించారు. దాంతో ఈ టూర్‌కు వచ్చేముందు చీలమండకు స్వల్ప గాయంతో ఇబ్బంది పడ్డ ధవన్‌ పూర్తిగా కోలుకున్నట్టు బీసీసీఐ ప్రకటించగానే సంత్రుప్తి చెందిన టీమిండియాRead More


కాంగ్రెస్ తో చేతులు కలిపి మోడీకి షాకిచ్చిన టీడీపీ

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766

తెలుగుదేశం పార్టీ షాకిచ్చింది. మోడీకి గట్టి ఝలక్ ఇచ్చింది. దాంతో కమలదళం కుతకుతలాడుతోంది. కాంగ్రెస్ తో చేతులు కలిపిన టీడీపీ తీరుతో తీవ్రంగా స్పందించే అవకాశాలున్నాయని సమాచారం. దాంతో ఈ పరిణామం హస్తినలో హీటు రాజేస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు తెరలేపడం ఖాయంగా ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు సాక్షిగా రాజ్యసభలో జరిగిన పరిణామాలతో టీడీపీకి తలాక్ చెప్పేయడానికి కూడా బీజేపీ వెనుకాడదనే వాదన మొదలయ్యింది. తెలుగుదేశం పార్టీ నేరుగా కాంగ్రెస్ తో చేతులు కలిపడం సంచలనంగా మారింది. అది కూడా ఏకంగా పార్లమెంట్ లో కావడంతో చర్చనీయాంశంగా మారింది. మోడీ అభీష్టానికి భిన్నంగా విపక్షంతో చేతులు కలపడం ద్వారా మిత్రపక్షానికి ఝలక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న పార్టీ, ఏకంగా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రిపుల్Read More


రోడ్డెక్కిన అనంత టీడీపీ

tdp dharna

తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ అందించిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఆపార్టీకి బలమైన జిల్లాగా భావిస్తున్న చోట వర్గవిబేధాలతో కొంపు మునిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న అధికార పార్టీలో తాజాగా విబేధాలతో రోడ్డెక్కే పరిస్థితి రావడం కలకలం రేపుతోంది. అనంతపురంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల వైరం పెరుగుతోంది. అదే సమయంలో జేసీ బ్రదర్స్ వైఖరితో తాడిపత్రి తెలుగుదేశం నేతలు తల్లడిల్లిపోతున్నారు. సొంత పార్టీ నేతలపైనే దాడికి పాల్పడడంతో ధర్నాలకు దిగే వరకూ పరిస్థితి వచ్చింది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ రాకముందు నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ పచ్చదండుతో జూనియర్ తమ్ముళ్ల తగాదా తారస్థాయికి చేరింది. మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ వర్గం హవా చెల్లుతుండడంతో చాలాకాలంగా జెండా మోస్తున్న నేతలంతా కలత చెందుతున్నారు. చివరకు జేసీ బ్రదర్స్ తోRead More


పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…

mobile

మొబైల్‌ వినియోగదారుల అభిరుచి మారుతోంది. మొదట్లో పోస్ట్ పెయిడ్ ని ఓ ప్రతిష్టకు కూడా చిహ్నంగా భావించిన వాళ్లు ఇప్పుడు మారిపోతున్నారు. పోస్ట్ పెయిడ్ ని వదులుకుంటున్నారు. దాంతో ప్రీ పెయిడ్ కస్టమర్లు అనూహ్యంగా పెరుగుతున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పోస్టు పెయిడ్‌ ఖాతాదారులు మరో 2 శాతం తగ్గారని అంచనా. దీంతో కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలికం రంగంలో ప్రీపెయిడ్‌ ఖాతాదారుల సంఖ్య 95.6 శాతానికి చేరింది. అదే ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఈ వాటా 95.52 శాతంగా ఉంది. ఇదే కాలంలో 5.17 కోట్ల మంది పోస్టుపెయిడ్‌ వినియోగదారులున్నారని టెలికం రెగ్యూలేటరీ ఈ మధ్యRead More


అయ్యో..రకుల్ కి కష్టమొచ్చింది..!

rakul

2017 ఆరంభంలో ఆమెకు ఎదురులేదు. చేతినిండా సినిమాలతో కనిపించింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా సందడి చేసింది. వ్యాపారం కూడా ముందుకు సాగుతుండడంతో అంతా రకుల్ టాప్ హీరోయిన్ గా లెక్కించారు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో పెద్ద హీరోలతో సందడి చేస్తుండడంతో ఆమె అగ్రపీఠానికి చేరుతుందని అంచనా వేశారు. కానీ గత ఏడాది ఆమెకు జయజానకి నాయకి, వేడుక చూద్దాం రండి వంటి ఓ మాదిరి సినిమాలే తప్ప బంపర్ హిట్లు దక్కలేదు. అది కొంత నిరాశపరిచినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఈ మధ్య అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుండడం రకుల్ ని కలవరపరుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు అలా జరిగడంతో అయ్యో..రకుల్ కి ఎంత కష్టమొచ్చిందోననే ప్రచారం జరుగుతోంది. పైగా ఆమె కాల్షీట్లు దాదాపు ఖాళీ అయిపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. త్వరలోRead More