Main Menu

Saturday, December 30th, 2017

 

హీరోయిన్ దొరికిపోయింది…

tiger-disha-mos_050516013518

వరుణ్ తేజ్ హీరోయిన్ దొరికిపోయింది. చాటుమాటుగా చక్కబెడుతున్న వ్యవహారాలు బట్టబయలయ్యాయి. దాంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ టు బాలీవుడ్, బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మ‌డి ప‌య‌నం గురించి తెలిసిందే. తెలుగులో లోఫ‌ర్ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం కెరీర్ ప‌రంగా సంతృప్తిగానే ఉంది. బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టేయ‌క‌పోయినా అవ‌కాశాల‌కేం కొద‌వ లేద‌క్క‌డ‌. ఇక సినిమాల‌తో కంటే దిశా ప‌టానీ పేరు ఎఫైర్ల‌తోనే మార్మోగిపోతోంది. అక్క‌డ మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమాయ‌ణం సాగిస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట ఎవ‌రికీ అంతుచిక్క‌కుండా షికార్లు చేస్తోంది. తాజాగా వేరొక సంద‌ర్భంలో ఇలా సీక్రెట్‌గా విదేశాల‌కు వెళ్లిపోతూ విమానాశ్ర‌యంలో దొరికిపోయారు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు విదేశాలు వెళుతున్న‌ట్టు, కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల కోస‌మేRead More


బాలయ్యతో బంధంపై నయనతార సంచలనం

nayan

నందమూరి నటసింహం బాలకృష్ణ, బ్యూటీ క్వీన్ నయనతారల కాంబినేషన్‌ కి మంచి క్రేజ్ ఉంది. వారిద్దరూ ఇప్పటికే రెండు హిట్స్ కొట్టారు. మూడో సినిమా ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జై సింహా సిద్ధమయ్యింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సింహా, శ్రీరామరాజ్యం’ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ ఫెయిర్ గా గుర్తింపు పొందిన బాలయ్య, నయన్ లు మరో హిట్ కొట్టేస్తారని ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో నయనతార కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి… బాలకృష్ణకి, తనకి మధ్య ఉన్న బంధం గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణగారిని అందరూ హీరోగా, కోస్టార్‌గా చూస్తారు. నేను మాత్రం ఆయనని తండ్రిలా భావిస్తాను. ఆయనని చూడగానేRead More


మహేష్ హీరోయిన్ తో చెర్రీ నెక్స్ట్

Ram Charan Kaira advani

మెగా పవర్ స్టార్ నెక్ట్స్ మువీకి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి కైరా అద్వాని కనిపించనుందట. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న కైరా నెక్ట్స్ చరణ్ తో జోడి కట్టేందుకు ఓకె చెప్పిందని తెలుస్తోంది. దాంతో ఈ బాలీవుడ్ భామRead More


తొలి టెస్టుకి ముందే టీమిండియా ఓపెనర్ అవుట్

shikhar dhavan pujara

ప్రతిష్టాత్మక దక్షిణాఫ్రికా టూర్ లో టీమిండియాకు చుక్కెదురయ్యింది. పర్యటనలో అడుగు పెట్టిన తోలిరోజే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ కి గాయం అయ్యింది. దాంతో తొలిటెస్టుకి శిఖర్ ధావన్ దూరం కావాల్సి వస్తోంది. ధావన్ స్థానంలో మురళీ విజయ్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. స‌ఫారీ గ‌డ్డ‌పై టీమిండియా చాలాకాలం తర్వాత అడుగుపెట్టింది. ఇటీవల స్వదేశంలో సాధించిన విజయాలతో సరిపెట్టకుండా విదేశీ గడ్డ మీద కూడా సత్తా చాటాలని చూస్తోంది. కానీ హంట్ ప్రారంభించ‌క ముందే ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి టెస్టుకు దూరం కావడం జట్టుకి పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. కాలి గాయంతోనే ధావన్ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అయితే, ఈ గాయం నుంచి ధావన్ పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో ధావన్ ను తొలి టెస్టుకు దూరంగా ఉంచుతున్నట్టు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.Read More


వైసీపీ విఫలమవుతోంది..

ysrcp

ఏపీలో ప్రభుత్వ తీరుతో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. అనేక చోట్ల సామాన్యులు తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. కీలక ప్రాజెక్టులు పడకేయడం, ప్రజా సంక్షేమం గాలికొదిలేయడంతో చంద్రబాబు తీరు మీద సా మాన్యుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మధ్యతరగతిలో మంట రాజుకుంటోంది. రైతాంగం రగిలిపోతోంది. మొత్తంగా ఏపీ పాలకపక్షం తీరు ప్రజలను తీవ్రంగా నిరాశపరుస్తోంది. అయితే అదే సమయంలో విపక్షం కూడా ప్రభుత్వ వైఫల్యాలను సొమ్ము చేసుకోలేని స్థితిలో ఉండడం విస్మయం కలిగిస్తోంది. మీడియా సహకారం లోకపోవడం కొంత లోటుగానే భావించాల్సి ఉన్నప్పటికీ ప్రజల సమస్యల మీద నిలబడి పోరాడితే సహజంగా సామాన్యుల్లో ఆదరణ లభిస్తుంది. నెల్లూరు ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ నిర్వహించిన ఇళ్ల స్థలాల పోరాటం, మరోఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాలకు లభిస్తున్న ఆదరణ దానికి నిదర్శనం. అయితే మిగిలిన ప్రాంతాల్లో ఆRead More


తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్

Telugu Channels

తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్ లో టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2017 ముగింపులో ముందంజలో కనిపిస్తోంది. ఓవరాల్ రేటింగ్ లో అగ్రపీఠంలో కొనసాగుతోంది. అదే సమయంలో టీవీ5 రెండో స్థానం దక్కించుకోగా ఎన్టీవీని అధిగమించి ఏబీఎన్ మూడో స్థానంలో నిలిచింది. ఎన్టీవీ, వీ6, 10టీవీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాక్షి టీవీ ఏడో స్థానం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్,, తెలంగాణా రాష్ట్రాలు Total MKT WK: 51 / 50 1st-TV9: 62 / 67 2nd-TV5: 61 / 55 3rd-ABN: 60 / 54 4th-NTV: 58 / 56 5th-V6: 44 / 42 6th-10TV: 40 / 35 7th-Sakshi: 30 / 31 8th-T News: 21 / 20 9th-ETV AP: 14 / 12 10th-I News:Read More


ఒంటరయిపోయిన గంటా

ganta

ఏపీ మంత్రి గంటా ఒంటరిగా మారిపోయారు. సొంత గడ్డ విశాఖలో ఆయనకు సహకరించే వారే లేకుండా పోయారు. దాంతో విశాఖ రాజకీయాల్లో చాలాకాలంగా చక్రం తిప్పుతున్న గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా ఒంటరిగా మిగిలిపోయిన వ్యవహారం ఆశ్చర్యంగా మారింది. చర్చనీయాంశం అవుతోంది. చివరకు ఆయన అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఆయన నిర్వహించిన కార్యక్రమానికి మొఖం చాటేయడం చర్చనీయాంశం అవుతోంది. రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విశాఖ ఉత్సవ్ తెచ్చిన చిచ్చుతో తెలుగుదేశం రాజకీయాల్లో కొత్త హీటు రాజుకుంది. మూడు రోజుల ఉత్సవ్ లో మొదటి రోజుల కార్యక్రమానికి కేవలం ఒక్క అనకాపల్లి ఎమ్మెల్యే మిగిలిన నేతలంతా ఢుమ్మా కొట్టేశారు. వాస్తవానికి ఉత్సవ్ పేరుతో విశాఖలో భారీగా వసూళ్ల ప్రక్రియ సాగిందనే ఆరోపణలున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన సంస్థల నుంచి సాగించిన వసూళ్ల వ్యవహారంలో వాటాల విషయంలో వచ్చిన విబేధాలతోRead More


సీఎంకి ఛాన్స్ లేదు: విజయసాయికి ఎలా?

vijayasai

ఏపీ రాజకీయాల్లో ఇది ఆసక్తికర పరిణామంగానే బావించాలి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ మధ్య దూరం పెరుగుతున్న దశలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రధాని మోడీతో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకి అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న మోడీ అదే సమయంలో వైసీపీ నేతలతో మాత్రం ముఖాముఖీ సమావేశం నిర్వహించడం విశేషంగా మారింది. త్వరలోనే టీడీపీకి తలాక్ తప్పదనే వాదన బలపడుతోంది. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మోడీతో సమావేశం అయిన తర్వాత ఈ చర్చ మరింత జోరందుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురించి చర్చ జరిగినట్టు సమాచారం. యాత్రకు ఆదరణ లబిస్తోందని విజయసాయి రెడ్డి పీఎం ద్రుష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏపీ రాజకీయాలకుRead More


పోలవరంలో కొత్త తగాదా

polavaram project_0_0_0_0

పోలవరం ప్రాజెక్ట్ కి మరో సమస్య ముందుకొచ్చింది. వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతుంటే కాంట్రాక్ట్ సంస్థ కష్టాలు మాత్రం రెట్టింపవుతున్నాయి. తాజాగా ట్రాన్స్ ట్రాయ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అవుతోంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నట్టు కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌పై కెనరా బ్యాంకు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతోో వ్యవహారం కొత్త దిశగా మళ్లుతున్నట్టు కనిపిస్తోంది.. ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని కెనరా బ్యాంక్ కోరింది. దీంతో ట్రాన్‌స్ట్రాయ్‌ భవితవ్యంతోపాటు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్‌ కూడా డోలాయమానంలో పడింది. ట్రాన్‌స్ట్రాయ్‌ తమకు రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకు గ్యారంటీ కింద రూ.379 కోట్లే ఉంచిందని కెనరా బ్యాంకు పేర్కొంది.Read More