Main Menu

Tuesday, September 19th, 2017

 

బాబుకి ఆ ఇద్దరిలో ఒక్కరే..!

ఏపీ రాజకీయాలు ఆసక్తిగానే ఉంటాయి. దానికి కారణం ఆ రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా విపక్షాల బలం ఉండడమే. ప్రధాన ప్రతిపక్షం కూడా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో సాగడమే. గడిచిన ఎన్నికలకు ముందు కూడా విపక్ష వైసీపీ ఊపు మీద కనిపించింది. ఆపార్టీదే అధికారం అని చాలామంది అంచనాలు వేశారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు అటు మోడీని , ఇటు పవన్ కల్యాణ్ ని వెంటపెట్టుకుని అనుకున్న ఫలితాలు సాధించారు. మోడీ పుణ్యాన పట్టణ ఓటర్లను, పవన్ పుణ్యాన యువత, కాపు సామాజికవర్గ ఓట్లను కొల్లగొట్టి కుర్చీని దక్కించుకున్నారు. ఇక గడిచిన మూడున్నరేళ్ల కాలంలో జరిగిన పరిణామాలను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పక్షాలు కలిసి పోటీ చేయాలని ఆశించేవాళ్లు కొందరున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దానికి కారణం మోడీ, పవన్Read More


లవర్ తో జాయ్ చేస్తున్న నయనతార

ఓ వైపు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా సాగుతోంది. అత్యధిక రెమ్యూనేషన్ అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో నయన తార రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలిసి షికార్లు చేస్తోంది. ఏకంగా న్యూయార్క్ సిటీలో సందడి చేస్తోంది.ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్ప టికీ, మరోవైపు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయన తార విదేశాల్లో చెట్టాపట్టాలే సుకుని తిరగడం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమించుకుం టున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఊతమిస్తూ ఇద్దరూ పబ్లిక్‌గానే తిరుగుతున్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు జరుపుకోవడం కోసం విఘ్నేష్‌ శివన్‌ ఇటీవలే న్యూయార్క్‌ వెళ్లాడు. అతనితోపాటు నయన తార కూడాRead More


జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్

ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చౌక ధరల ఫీచర్‌ ఫోన్‌ యుద్ధంలోకి దిగింది. జియోతో పాటు ఇతర టెల్కోలు తక్కువ ధరకే ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో తాను కూడా ఏమి తక్కువ కాదంటూ బిఎస్‌ఎన్‌ఎల్‌ తనదైన శైలిలో పోటీకి సిద్ధమయ్యింది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో రూ.2000కే బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానుంది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ టెల్కోలు దీపావళి కల్లా చౌక ధరలో 4జి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. ఇదే బాటలో బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా కసరత్తు ప్రారంభించింది. తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానున్నామని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందుకోసం తాము లావా, మైక్రోమాక్స్‌ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. రెండు మొబైల్‌ తయారీ కంపెనీల భాగస్వామ్యంతో అక్టోబర్‌లోRead More


దసరా ఛాంప్ ఎన్టీఆరా? మహేషా??

టాలీవుడ్ లో పండుగలకు విశేష స్థానం ఉంటుంది. తమ తమ చిత్రాలను ఆయా పండుగల్లో రిలీజ్ చేయాలని హీరోలు అనుకుంటుంటారు. దసరా..సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. దీనితో ఆ సినిమాలపై తెగ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక 2017 దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోస్ ‘మహేష్ బాబు’, ‘ఎన్టీఆర్’ చిత్రాలు కొద్ది రోజుల తేడాతో రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 21న ‘ఎన్టీఆర్’ నటించిన ‘జై లవ కుశ’ వస్తుంటే ‘మహేష్ బాబు’ నటించిన ‘స్పైడర్’ సెప్టెంబర్ 27న విడుదలవుతోంది. దీనితో వీరి సినిమాల్లో ఎవరిది పై చేయి అవుతుందనే చర్చ జరుగుతోంది. వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న యంగ్ టైగర్ బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ లో నటించాడు. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగాRead More


న్యాయం చెప్పాల్సిన జడ్జి..బాబుకి కండువా కప్పేశారు

అవును..నిజం. సదావర్తి భూముల వ్యవహారం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కోర్టుల సాయంతో కోట్ల రూపాయల ఖజానా కాపాడడంలో వైసీపీ ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశం అయ్యింది. న్యాయస్థానాల వ్యవహారాలలో తానే రాజు తానే మంత్రి అనదగ్గ చంద్రబాబు ఎలా బోల్తా పడ్డారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కోర్ట్ తీర్పులతో బాబు పరువు కోల్పోయే పరిస్థితి రావడం విశేషంగా మారింది. అయితే సరిగ్గా సదాావర్తి భూములు రెండో వేలం ద్వారా ఏకంగా 38 కోట్ల ప్రజాధనం బాబు అనుచరులకు కాకుండా ఏపీ ప్రభుత్వానికి చేరుతున్న రోజునే మరో విశేషం కనిపించింది. ఈసారి ఏకంగా ఉన్నతమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ వ్యవహారం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చైర్మన్ స్వతంత్ర్యకుమార్ ఏకంగా పర్యావరణ పరిరక్షణలో చంద్రబాబును ప్రశంసించడం విశేషంగా మారింది. అది కూడా ఏకంగా అమరావతిలో పర్యావరణ నిబంధనలు పాటించడంRead More


పవన్ కల్యాణ్ గుడ్ బై

టాలీవుడ్ పవర్ స్టార్ రియల్ లైఫ్ మరో కీలకమలుపు తీసుకోబోతోంది. పలు సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరయిన పవన్ కల్యాణ్ తన జీవితంలో మరో అడుగు వేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రకటించినట్టుగా పెద్ద టర్న్ తీసుకోబోతున్నారు. దాదాపుగా అన్నయ్య దారిలో నడుస్తున్నారు. అయితే చిరంజీవికి భిన్నంగా సినిమాల్లో ఉంటూ ఇన్నాళ్లుగా పార్టీని నడిపిన ఈ జనసేనాని ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే అన్నయ్య చిరంజీవి తరహాలోనే సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పబోతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత పరిణామాలు మారితే మళ్లీ టాలీవుడ్ వైపు చూడవచ్చు గానీ అప్పటి వరకూ రాబోయే త్రివిక్రమ్ సినిమాతోనే సరి అని సన్నిహితుల అభిప్రాయం. సంప్రదాయ రాజకీయ పార్టీల వ్యవహారాలకు , పవన్ జనసేనకు చాలా వైరుధ్యం ఉంది. ఇప్పటికే అది నిరూపితం అయ్యింది. మూడున్నరేళ్లు దాటిన పార్టీకి ఇప్పటికీRead More


పేటీఎం మాల్ మెగాసేల్

ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు పోటీగా పేటీఎం మాల్‌ కూడా మెగా సేల్‌ ఈవెంట్‌ను ప్రకటించింది. మెరా క్యాష్‌ బ్యాక్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహించే తేదీల్లోనే పేటీఎం మాల్‌ కూడా ఈ మెగా సేల్‌ ఈవెంట్‌కు తెరలేపబోతుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్‌ నిర్వహించనుంది. ఈవెంట్‌లో భాగంగా రూ.501 కోట్ల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను కంపెనీ అందించనున్నట్టు ప్రకటించింది. కొత్తగా 50 లక్షల మంది కొనుగోలుదారులను ఆకర్షించాలనే లక్ష్యంగా ఈ సేల్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ ఫోన్లు, ఫ్యాషన్‌ ప్రొడక్ట్‌లు, ఇతర ఉత్పత్తులపై 15 శాతం నుంచి 100 శాతం వరకు పేటీఎం మాల్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందించనుంది. స్మార్ట్‌ఫోన్లపై రూ.15వేల వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, పెద్ద పెద్దRead More