Main Menu

Monday, July 17th, 2017

 

వెంక‌య్యకు క‌లిసి రాని కేంద్ర ప‌ద‌వి..!

వెంక‌య్య‌నాయుడు తొలుత ఆర్ఎస్ఎస్ లోనూ, ఆత‌ర్వాత జ‌నతా మీదుగా బీజేపీలోనూ చ‌క్రం తిప్పిన నాయ‌కుడు. ఏపీ అసెంబ్లీ నుంచి పార్ల‌మెంట్ లో ఎగువ స‌భ వ‌ర‌కూ ప‌లు ప‌ద‌వులు కూడా నిర్వ‌హించారు. పార్టీలో కూడా కిందిస్థాయి నేత నుంచి జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి కూడా ఆయ‌న అనుభ‌వించారు. అలాంటి నేత‌కు అనూహ్యంగా కొన్ని ప‌ద‌వులు క‌లిసొస్తున్న‌ట్టుగా లేదు. ముఖ్యంగా కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఆయ‌న‌కు ఏమాత్రం క‌లిసిరాలేదు. సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో రెండు సార్లు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 45 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న వెంక‌య్య తొలుత 2000వ సంవ‌త్స‌రంలో కేంద్ర మంత్రి అయ్యారు. అప్ప‌ట్లో స‌మాచార‌, ప్ర‌చారాల శాఖ‌తో పాటు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ కూడా నిర్వ‌హించారు. కానీ అనూహ్యంగా ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌విని మ‌ధ్య‌లోనే వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. రెండేళ్ల‌కే ఆయ‌నRead More


అనూహ్య మార్పుల దిశ‌గా ఏపీ బీజేపీ

ఏపీలో బీజేపీ ప‌రిస్థితి అనూహ్యంగా మార‌బోతోంది. పెను మార్పులు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇన్నాళ్లుగా బీజేపీ అంటే వెంక‌య్య‌..వెంక‌య్య అంటే బీజేపీ అని చెప్పుకునే ప‌రిస్థితి వైదొలిగిపోయింది. కొంద‌రికి ఖేదం, ప‌లువురికి మోదంగా ఉన్న ఈ ప‌రిణామం త‌ర్వాత బీజేపీలో మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న పెరుగుతోంది. ఇన్నాళ్లుగా సౌత్ లో బీజేపీకి పెద్ద దిక్కుగా, తెలుగు రాజ‌కీయాల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన వెంక‌య్య నాయుడు ఇక తెర‌మ‌రుగ‌య్యారు. దాంతో బీజేపీలో కీల‌క ప‌రిణామాలు క‌న్ఫ‌ర్మ్ గా క‌నిపిస్తోంది. వెంక‌య్య‌కు ఇష్టం లేకున్నా మోడీ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక పెద్ద వ్యూహామే ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో వెంక‌య్య ముద్ర‌ను చెరిపేస్తే త‌ప్ప బీజేపీ పుంజుకునే అవ‌కాశం లేద‌ని మోడీ అండ్ కో అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు కొంద‌రు భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే అయిష్టంగానైనా వెంక‌య్య అడ్డు తొల‌గాల్సిRead More


ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ప్ర‌శంసింది..కాంగ్రెస్ మాత్రం

తెలంగాణకు నెం.1 శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటుందని నిప్పులు చెరిగారు మంత్రి. తెలంగాణకు మేలు చేయాలనుకున్న ఏ నేతను కాంగ్రెస్ నెగలనీయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణను దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదు.. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతుందనే భయంతోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్వీ సైన్యంగా పని చేసిందన్నారు. ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్వీ పని చేయాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టారనిRead More


ఆ సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చిన ఎన్టీఆర్

న‌ట‌ర‌త్న ఎన్టీఆర్ వార‌సుడిగా కెరీర్ ప్రారంభించినా ఇప్పుడు సొంత ఇమేజ్ తో దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ టీవీ తెర‌మీద ఆరంగేట్రం చేసేశాడు. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫ్యాన్స్ కి మ‌రింత చేరువ‌య్యే ప్ర‌య‌త్నం ప్రారంభించాడు. ఓవైపు వ‌రుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో ‘జైలవకుశ’ సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా చేస్తున్న బిగ్ బాస్ షో ఘనంగా ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్ లో షో పార్టిసిపెంట్స్ ను ఎన్టీఆర్ ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా క‌త్తి కార్తిక కూడా పార్టిసిపెంట్ గా పాల్గొన్న స‌మ‌యంలో ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘నాన్నకు ప్రేమ’తో సినిమాను కుటుంబం మొత్తం చూశామని, తన కుమారుడు ఆ సినిమా చూసి చాలా ఎమోషన్ అయ్యాడని ఆమె చెప్పుకొచ్చారు . ‘నాన్నకు ప్రేమతో సినిమా తీసిన మీరేRead More


నోకియా నుంచి ఖ‌రీదైన ఫోన్

నోకియా బ్రాండులో హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేస్తున్న అత్యంత ఖరీదైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ త్వరలో మార్కెట్లోకి వచ్చేస్తోంది. నోకియా 8 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 40వేల రూపాయలకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ నెల 31న గ్లోబల్‌గా లాంచ్‌ చేయబోతుందట. హెచ్‌ఎండీ కొత్తగా లాంచ్‌ చేయబోతున్న ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌ల గురించి ఇప్పటికే మార్కెట్లో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నోకియా 8 లేదా నోకియా 9 ఫ్లాగ్‌షిప్‌ను కంపెనీ లాంచ్‌ చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తాజాగా జర్మన్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసిన రిపోర్టులో నో​కియా బ్రాండులో తర్వాత రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8గా తెలిసింది. ఈ డివైజ్‌ మోడల్‌ నెంబర్‌ టీఏ-1004గా జర్మన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అదనంగా ఈ ఫోన్‌ జూలై 31 నుంచి విక్రయానికి రానుందని కూడా చెప్పింది. ఇదే సమయంలో నోకియాRead More


షేమ్ ఫీల‌వుతున్న చంద్ర‌బాబు..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సిగ్గుప‌డుతున్నాన‌న్నారు. ఇలాంటి ప‌నులు చేయ‌డం షేమ్ అంటూ ఆయ‌న త‌న పార్టీ ఎమ్మెల్యేల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు చేసిన ప‌నిని ఆయ‌న వేలెత్తిచూపుతున్న‌ప్ప‌టికీ దానికి కార‌ణం మ‌న తీరే అంటూ ప‌లువురు ఎమ్మెల్యేలు బాబుకి స‌మాధానం ఇవ్వ‌డం విశేషం. దాంతో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ లో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన త‌ప్పిదం ఆపార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంద‌ని, మోడీ దృష్టికి కూడా వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ బృందం క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసింది. అయినా త‌ప్పిదం దొర్ల‌డం విశేష‌మే. దానికి ప్రధాన కార‌ణం మాత్రం మాక్ పోలింగ్ అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మాక్ పోలింగ్ లో ఎవ‌రు ఎలా ఓటేశార‌న్న‌ది తెలుసుకోవ‌డం కోస‌మంటూ తొలుత ఎవ‌రి ఓటు మీద వారిRead More


ర‌వితేజ త‌ల్లి కీల‌క ప్ర‌క‌ట‌న‌


మ‌రో వివాదంలో రోజా, నోటీసులు సిద్ధం

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్ప‌టికే గ‌తంలో అసెంబ్లీ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం ఇంకా చ‌ల్లారలేదు. ఇటీవ‌లే సుప్రీంకోర్ట్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కానీ ఇప్పుడు మ‌రోసారి ఆమెకు నోటీసులు జారీ చేసే ప‌రిస్థితి రావ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అప్ప‌ట్లో మ‌హిళా ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్య‌ల‌తో దుమారం రేగింది. అనిత ఫిర్యాదుతో మొద‌ల‌యిన క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా స్పీక‌ర్ మీద చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆమెకు నోటీసులు ఖాయంగా మారాయి. రోజాకు మరోసారి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయాల‌ని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఆదేశాలు జారీచేయ‌డంతో అసెంబ్లీ కార్య‌ద‌ర్శి దానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తాజాగా స్పీకర్‌పై రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌కుRead More


ఉషాప‌తికి మింగుడుప‌డ‌ని ఉప ప‌ద‌వి

ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న‌ప్పుడు పెళ్లికొడుకు ప‌రిస్థితి ఎలా ఉంటుందో స‌రిగ్గా ఇప్పుడు వెంక‌య్య‌నాయుడి ప‌రిస్థితి అలానే ఉంది. పాపం ఆయ‌న‌కు క్రియాశీల రాజ‌కీయాల‌పై మోజు త‌గ్గ‌లేదు. ఇంకొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పాల‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. కానీ ఆయ‌న ఆశ‌ల‌కు గండికొట్టేలా మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వెంక‌య్య ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. నోరున్న నాయకుడిగా పేరుపొందిన వెంక‌య్య‌ను క‌ట్ట‌డిచేసే నిర్ణ‌యం తీసుకున్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌నాయుడుని ఖరారు చేయ‌డం ద్వారా మోడీ గ‌ట్టి సంకేతాలే పంపారు. న‌రేంద్ర‌మోడీ గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు అక్క‌డ వేసిన ఎత్తుల‌నే ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రిగానూ వేస్తున్నారు. గుజ‌రాత్ లో కూడా త‌న‌క‌న్నా సీనియ‌ర్లంద‌రినీ క్ర‌మేణా బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం, లేదా ప‌రిమితం చేసే ప్ర‌య‌త్నాన్ని ఆయ‌న విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. త‌ద్వారా గుజ‌రాత్ లో మోడీ నాయ‌క‌త్వానికి తిరుగులేని ప‌రిస్థితి వ‌చ్చేసింది. ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ ఆయ‌న మాటే వేద‌వాక్కు. ఇకRead More


ఆనం బ్ర‌ద‌ర్స్ ని మోసం చేసిందెవ‌రు..?

అయ్యో..అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. రాజ‌కీయాల్లో అంతెత్తుకు ఎదిగిన వాళ్ల‌కు అన్యాయం జ‌రుగుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ప‌డిపోవ‌డం అనూహ్య‌మే అనిపిస్తోంది. అయినా పోలిటిక్స్ లో ఇలాంటి సీన్లు త‌ప్ప‌వేమో అని స‌రిపెట్టుకోవాలి. బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అంటే ఏమిటో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే అంతా తామై అన్నింటా పెత్త‌నం చెలాయించిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు మోస‌పోయామ‌ని వాపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. స్వ‌యంగా ఆనం వివేకానంద‌రెడ్డి తాము మోస‌పోయామ‌ని చెప్పిన నేప‌థ్యంలో అస‌లు ఇంత‌కీ వాళ్ల‌ని మోస‌గించిందెవ‌రనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ‘మోసపోయాం బ్రదర్‌.. ఎన్ని అవమానాలను భరిస్తాం. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా.. అది కూడా చేజారింది. సొంత కళాశాల వీఆర్సీలో జూనియర్‌ కళాశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు. భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడు. ఇక ఇప్పట్లో నెల్లూరుకు రాలేను’… ఇవీRead More