Main Menu

Wednesday, July 5th, 2017

 

నంద్యాల‌లో టీడీపీకి ఝ‌ల‌క్

తెలుగుదేశం పార్టీకి నంద్యాల‌లో మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది. మునిసిపాలిటీని కైవ‌సం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో టీడీపీ క్యాంప్ నుంచి మ‌రో కౌన్సిల‌ర్ చేజారిపోయారు. దాంతో టీడీపీ వ‌ర్గంలో క‌ల‌క‌లం రేగింది. 6వ వార్డ్ కౌన్సిల‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య వైసీపీలో చేరిపోవ‌డంతో టీడీపీ శ్రేణులు ఢీలా ప‌డిన‌ట్టుగా ఉంది. క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో 21మంది కౌన్సిల‌ర్ల‌తో శిల్పా మోహ‌న్ రెడ్డి టీడీపీని వీడిన సంగ‌తి తెలిసిందే. అయితే అలా కీల‌క నేత‌లు వెళ్లిపోవ‌డంతో ఖంగుతిన్న టీడీపీ ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో కొంద‌రు కౌన్సిల‌ర్ల‌ను వెన‌క్కి తీసుకురాగ‌లిగారు. దాంతో చైర్ ప‌ర్స‌న్ సులోచ‌న‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు. ఈలోగా ఇప్పుడు వెంక‌ట‌సుబ్బ‌య్య సైకిల్ కి గుడ్ బై చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆయ‌న‌తో పాటుగా కీల‌క నేత‌లు ప‌లువురు టీడీపీని వీడారు. అంద‌రికీ కండువాలు క‌ప్పిRead More


నంద్యాల‌లో వారి ఓట్లే కీల‌కం..!

నంద్యాల ఉప ఎన్నిక‌ల కోసం అన్ని పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఏక‌గ్రీవం చేయాల‌ని ఆశించిన టీడీపీకి ఇప్ప‌టి ప‌రిణామాలు కొంత చికాకుగా క‌నిపిస్తున్నాయి. టీడీపీలో టికెట్ ఆశించి అది ద‌క్క‌క‌పోవ‌డంతో పార్టీ పిరాయించిన శిల్పా వైసీపీ త‌రుపున రంగంలో ఉండ‌డంతో బాబుకి కొంత క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. శిల్పాతో పాటు ప‌లువురు కిందిస్థాయి నేత‌లంతా పార్టీ మారిపోవ‌డంతో అనేక చోట్ల పార్టీని న‌డిపించే నేత‌లు చేజారిపోవ‌డం స‌మ‌స్య‌గా మారుతోంది. మంత్రి నారాయ‌ణ‌ని ప్ర‌త్యేకంగా నంద్యాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మునిసిప‌ల్ మంత్రి అన్ని ప‌నులు మానుకుని పూర్తిగా అక్క‌డే దృష్టి కేంద్రీక‌రిస్తున్నారు. ప‌లువురు కీల‌క నేత‌ల‌ను సామ‌, దాన , బేధ డండోపాయాల‌తో ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఫ‌లితాలు ఆశించిన‌ట్టుగా లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక వైసీపీ కూడా అతి విశ్వాసంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మైనార్టీలు గుండ‌గుత్తుగాRead More


ప్ర‌శ్నార్థ‌కంగా ప‌వ‌న్ క‌ల్యాణ్…!

ప్ర‌శ్నించ‌డం కోస‌మే పార్టీ పెట్టాన‌ని చెబుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. జ‌న‌సేన అధినేత అస‌లేమ‌య్యార‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప‌లు కీల‌క ప‌రిణామాలు సాగుతున్నా నోరు మెద‌క‌పోవ‌డానికి కార‌ణాలేంట‌నే సందేహం క‌నిపిస్తోంది. జ‌న‌సేన శ్రేణులు కూడా అయోమ‌యంగా మారుతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుస‌గా రెండు నెల‌లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తిస్థాయిలో మౌనం పాటిస్తున్నారు. గ‌తంలో ట్విట్ట‌ర్ లో క‌నిపించిన ఆయ‌న ఇప్పుడు దానికి కూడా దూరంగా ఉన్నారు. దాంతో అస‌లు పీకే ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న అభిమానుల్లో ఉంది. పోనీ సినిమాల‌తో ఆయ‌న బిజీగా ఉన్నారా అంటే అది కూడా లేదు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రావాల్సిన సినిమా ఆల‌శ్యం అవుతోంది. అందుకు కార‌ణం కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ అని టాలీవుడ్ లో ప్రచారం. గ‌డిచిన కొన్నాళ్లుగా ప‌వ‌న్ సినిమా షూటింగ్ కి దూరంగా ఉన్నారు.Read More


ఆనం బ్ర‌దర్స్ కి పెరుగుతున్న ఇంటిపోరు

ఆనం బ్ర‌ద‌ర్స్ చెప్పిందే వేదంగా క‌నిపించేది ఒక‌నాడు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీ మారిన త‌ర్వాత వారి ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టుగా ఉంద‌నే వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి. క‌నుసైగ‌ల‌తో పార్టీని శాసించిన నేత‌లు ఇప్పుడు టీడీపీలో స‌త‌మ‌త‌మ‌వుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు టీడీపీలో ఇంటిపోరు ముదిరిపోతోంది. ముఖ్యంగా ఆత్మ‌కూరు రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారిపోతున్నాయి. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి కొత్త అవ‌స్థ‌లు ఏర్ప‌డుతున్నాయి. ఆత్మ‌కూరు వ్య‌వ‌హారాల‌తో అస‌లుకే మోసం వ‌స్తుందా అనే సందేహం క‌లుగుతోంది. పిట్ట‌పిట్ట‌పోరు పిల్లి తీర్చిన‌ట్టుగా ఈ ప‌రిణామాల‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటుందా అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఒక‌నాడు సీఎం రేసులో కూడా క‌నిపించారు. అలాంటి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. పేరుకి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ సీనియ‌ర్Read More


బాబుకి త‌ల‌నొప్పిగా మారిన ఐదుగురు..!

ఏపీలో ప్ర‌తిప‌క్షం దూకుడు పాల‌క టీడీపీకి చికాకుగా మారుతోంది. చిన్న చిన్న విష‌యాల‌ను కూడా భూత‌ద్దంలో చూపుతున్నార‌నే ఆందోళ‌న క‌లుగుతోంది. గ‌తంలో మీడియా త‌న‌కు అనుకూలంగా ఉండ‌డంతో అనేక అంశాల‌ను మేనేజ్ చేసిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా పుణ్యాన వ్య‌వ‌హారం చేజారిపోతోంది. తాజాగా హెరిటేజ్ వ్యాన్ లో ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ వ్య‌వ‌హారం టీడీపీ మెడ‌కు చుట్టుకుంటుంద‌నే సందేహం క‌నిపిస్తోంది. హెల్త్ డ్రింక్ అంటూ నోరు జారిన మ‌ద్యం మంత్రి వ్య‌వ‌హారం మ‌రింత అభాసుపాలుజేసింది. దాంతో లోకేష్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. హెల్త్ డ్రింక్ కామెంట్స్ ను వైసీపీ వ‌క్రీక‌రించిందంటూ వాపోయారు. అయితే ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకి కేవ‌లం వైసీపీ మాత్ర‌మే కాకుండా మ‌రో ఐదుగురు పెద్ద త‌ల‌నొప్పిగా మారారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎలానూ బాబుకి రాజ‌కీయ విరోధి కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హారిస్తారు. కానీ కొంద‌రుRead More


ముద్ర‌గ‌డ మంట రాజేస్తున్నారు..!

ఏపీలో ఇప్ప‌టికే బ్రాహ్మణుల ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. ఎస్సీల ఉద్య‌మం ఆగ‌లేదు. ఈలోగా కాపుల క‌ల‌క‌లం మొద‌లు కాబోతోంది. ముద్ర‌గ‌డ ఈసారి దీర్ఘ‌కాలం మంట రాజేసే వ్యూహంలో ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా ప‌థ‌క ర‌చ‌న చేస్తున్నారు. గ‌తంలో తుని ఘ‌ట‌న‌లు, ఆత‌ర్వాత రెండు మార్లు పాద‌యాత్ర ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవ‌డం నేప‌థ్యంలో ఈసారి ఛ‌లో అమ‌రావ‌తి అంటున్నారు. అది కూడా నిర‌వ‌ధిక పాద‌యాత్ర అంటూ సిద్ధం కావ‌డం విశేషం. దాంతో ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. పాద‌యాత్ర‌కు బ‌య‌లుదేర‌గానే అడ్డుకోవ‌డం, ఆయ‌న దానిని విర‌మించుకోవ‌డం ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రుగుతున్న ప్ర‌క్రియ‌. కానీ ఈసారి అలా కాకుండా త‌నకు ఎప్పుడు అవ‌కాశం ద‌క్కితే, ఎంత‌దూరం వెళ్ల‌గ‌లిగే అవ‌కాశం వ‌స్తే అంత‌దూరం ముందుకెళుతూ ఉంటాన‌ని అంటున్నారు. అంటే స్వ‌గ్రామం తూర్పు గోదావ‌రి జిల్లా కిర్లంపూడి నుంచి మొద‌లుకుని అమ‌రావ‌తికి ఎప్పుడు చేర‌నిస్తే అప్ప‌టికేRead More


ద్రౌప‌ది న‌య‌న‌తారే..!

భారతీయ చలనచిత్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో వెయ్యి కోట్ల వ్యయంతో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రం మ‌హా భార‌తం. బీ. ఆర్. శెట్టి నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కుమార్ మీనన్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఇక నటీనటుల ఎంపిక ప్రక్రియని కూడా వేగవంతం చేశారు. మోహన్ లాల్ ని ఇప్పటికే ఓ ప్రధాన పాత్రకి ఎంపిక చేయగా ప్రభాస్, నాగార్జున, మహేష్‌ ఇలా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కన్నడలో కూడా అదే మాదిరిగా మహా భారతం నేపథ్యంలో కురుక్షేత్ర అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగాణంతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. మహా భారతంలోని స్త్రీ పాత్రలలో ముఖ్యమైన పాత్ర ద్రౌపది కాగా ,Read More


శాంసంగ్‌ జె సిరీస్‌ అప్‌గ్రేడెడ్‌ స్మార్ట్‌ఫోన్‌

మొబైల్‌మేకర్‌ శాంసంగ్‌ తన జె సిరీస్‌లో అప్‌గ్రేడెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గెలాక్సీ జె 5 ప్రొ 2017 వెర్షన్‌ను విడుదల చేసింది. 2016 మోడల్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఆం‍డ్రాయిడ్‌ 7.0 ఆపరేటింగ్‌సిస్టంతో పాటు ర్యామ్‌, ఇంటర్నల్‌ స్టోరేజ్‌, కెమెరా , మెటల్‌ డిజైన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ తదితర ఫీచర్లను నవీనకరించిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో లాంచ్‌ చేసింది. మన కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.19వేలు. గెలాక్సీ జె 5ప్రొ 2017 5.2అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 720×1280 పిక్సెల్‌ రిజల్యూషన్ ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0 3 జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 256జీబీ ఎక్స్‌పాండబుల్‌ 13 పిక్సెల్‌ రియర్‌ కెమెరా 13ఎంపీ సెల్ఫీకెమెరా 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ అయితే ఇండియాలో ఎపుడు లాంచ్‌ చేస్తుందనేసమాచారం మాత్రం ఇంకా అందుబాటులోరాలేదు. కాగాRead More


మెగాహీరోతో వీ వీ వినాయ‌క్

ఖైదీ నంబర్ 150 సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. అయితే చాలా రోజులుగా మెగా హీరోతోనే వినాయక్ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన మరో అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మెగా హీరోగా సాయిధరమ్ తేజ్ తో వినాయక్ సినిమా చేయనున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా కోసం దుర్గ (వర్కింగ్ టైటిల్) అనే పవర్ ఫుల్ మాస్ కథను వినాయక్ సిద్ధం చేశాడట. కథ, మాటల రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్, ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశంRead More