Tuesday, January 17th, 2017

 

తెలుగుదేశంలో కొప్పులాట‌..!

tdp women

స‌హ‌జంగా అధికారం ఉన్న చోట ఆధిప‌త్యం కోసం ఆరాటం పెరుగుతుంటుంది. అందుకే అధికార పార్టీలో విబేధాలు నిత్యం క‌నిపిస్తూ ఉంటాయి. తాజాగా అదే ప‌రంప‌ర‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీలో కొత్త త‌ల‌నొప్పి తెర‌మీద‌కు వ‌స్తోంది. టీడీపీ మ‌హిళా నేత‌ల విబేధాలు రచ్చ ర‌చ్చ చేస్తూ కార్య‌క‌ర్త‌ల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. శృంగ‌వ‌ర‌పు కోట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల ల‌లిత కుమారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే గ‌తంలో ఈ స్థానం నుంచి ప్ర‌స్తుత టీడీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు శోభా హైమావ‌తి ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. దాంతో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోసం ఆమె పాకులాడుతున్నారు. అది సిట్టింగ్ ఎమ్మెల్యేకు చికాకు క‌లిగిస్తోంది. ఇరువ‌ర్గాల మ‌ధ్య విబేధాల‌కు తావిస్తోంది. శోభా హైమామ‌తి కుమార్తె స్వాతి రాణి ప్ర‌స్తుతం జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ గా ఉన్నారు. దాంతో ఆమె అధికారాన్ని ఉప‌యోగించుకునిRead More


తాడిప‌త్రి టీడీపీలో ర‌చ్చ: 144 సెక్ష‌న్

TDP-flags-AFP

తెలుగుదేశం పార్టీలో విబేధాలు వీధికెక్కుతున్నాయి. ర‌చ్చ‌కు దారితీస్తున్నాయి. తాజాగా అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి టీడీపీ విబేధాలు పెను దుమారం రేపాయి. ఏకంగా ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారితీశాయి. దాంతో ఒక్క‌సారిగా తాడిప‌త్రి రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, టీడీపీ నేత జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య విబేధాలు ఘ‌ర్ష‌ణ‌ల‌కు తెర‌లేప‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ప‌ట్ట‌ణంలో 144 సెక్ష‌న్ విధించారు. ఇరు వ‌ర్గాల‌ను సంయ‌మ‌నం పాటించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. చాలాకాలం త‌ర్వాత తాడిప‌త్రిలో ఒక్క‌సారిగా వ‌ర్గ‌విబేధాలు తెర‌మీద‌కు రావ‌డంతో అంతా ఉలిక్కిప‌డేలా క‌నిపిస్తోంది. పోలీసులు ప‌క్కాగా వ్య‌వ‌హ‌రించి ఈ వ్య‌వ‌హారం మ‌రింత రాజుకోకుండా చూడాల‌ని అంతా కోరుకుంటున్నారు. అయితే టీడీపీలో వ‌ర్గ‌పోరు ఈ స్థాయిలో సాగుతున్న ధోర‌ణి ఆ పార్టీ క్యాడ‌ర్ ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే అనంత‌పురంలో అక్క‌డి ఎమ్మెల్యేతో జేసీ దివాక‌ర్ రెడ్డి త‌గువుRead More


జ్యోతి నుంచి ఈనాడు పాఠాలు నేర్చుకుంటే..!

eenadu andhra jyothy

ప్ర‌స్తుతం తెలుగు మీడియా తీరు అంద‌రికీ ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అందులో ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ రెండు మీడియా సంస్థ‌లు పూర్తిగా చంద్ర‌బాబుకి సానుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తాయి. ఆయ‌న‌కు ఏది ప్ర‌యోజ‌న‌క‌రం అనుకుంటే అదే ఉత్త‌మ‌మ‌ని చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తాయి. అలాంటి ప్ర‌య‌త్నాల‌లో కొన్ని సార్లు అభాసుపాల‌వుతున్నా అతిశ‌యోక్తుల‌కు మాత్రం అంతూపొంతూ ఉండ‌దు. తాజాగా ఆ జాబితాలో మోడీ కూడా చేర‌డంతో బాబు-మోడీ కోసం అటు రామోజీరావు, ఇటు రాధాకృష్ణ నానా ప్ర‌యాస‌లు ప‌డుతున్నారు. పాఠ‌కుల‌ను, వీక్ష‌కుల‌ను పాల‌కుల‌కు అనుగుణంగా, వారి విధానాల స‌మ‌ర్థకులుగా తీర్చిదిద్ద‌డానికి తీవ్రంగా త‌పిస్తున్నాయి. అయినా ఈ విష‌యంలో ఆంధ్ర‌జ్యోతితో పోలిస్తే ఈనాడు మ‌రీ శృతిమించి వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌ది ప‌లువురి వాద‌న‌. ప్ర‌ధానంగా ఈనాడు ప‌త్రిక‌లో ఓ ప‌క్క‌న ప్ర‌భుత్వ విధానాల‌తో పెరుగుతున్న అవ‌స్థ‌ల‌ను రాస్తూనే..దానికి ఆనుకుని స‌ర్కారు నిర్ణ‌యంతోRead More


సునీత… 750 నాటౌట్‌!

singer sunitha3

‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ – ‘గులాబీ’ చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల పాటలు ఆలపించారు. ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలు అంటుంటారు. భక్తి గీతాలు మొదలుకుని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు.. వ్యాఖ్యాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్‌ వలన కథానాయికల నటన మరింత ఎలివేట్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయికలకు గొంతు అరువిచ్చి, సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు. ఈRead More


టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి..!

chandrababu

సుదీర్ఘ‌కాలం త‌ర్వాత అధికారం ద‌క్కింది. ఐదేళ్ల గ‌డువులో ఇప్ప‌టికే స‌గం రోజులు గడిచిపోయింది. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. అయినా అధికార పార్టీలో అనేక‌మందికి ఆశాభంగం త‌ప్ప‌డం లేదు. తెలుగుదేశంతో పాటు చంద్ర‌బాబుని న‌మ్ముకుని పార్టీ ఫిరాయించిన వారి క‌ల‌లు కూడా పండేలా క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు అమాత్యా అనిపించుకోవాల‌ని ఆశించిన చంద్ర‌బాబు త‌న‌యుడికి కూడా ప్ర‌స్తుతానికి తీర‌ని కోరిక‌గా మిగిలిపోతోంది. మంత్రి ప‌ద‌వుల పందేరం ప‌దే ప‌దే వాయిదా వేస్తూ ఆశావాహులంద‌రినీ నిరాశ‌లో ముంచుతున్నారు ఆ పార్టీ అదినేత చంద్ర‌బాబు. ఇక నామినేటెడ్ పోస్టుల వ్య‌వ‌హారం కూడా అదే తంతు. అర‌కొర భ‌ర్తీ మిన‌హా కీల‌క ప‌ద‌వుల‌న్నీ ఇంకా ఖాళీగానే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రో ఏడాది గ‌డిస్తే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తున్న‌ప్ప‌టికీ త‌మ‌కు ఒరిగిందేమీ క‌నిపించ‌క‌పోవ‌డంతో అనేక‌మంది అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. అదిగో ఇదిగో అంటూ ఊరించ‌డం త‌ప్పRead More


హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత

hcu

హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోహిత్ వేముల వర్థంతి సందర్భంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో హెచ్‌సీయూలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డగించారు. ర్యాలీకి పర్మిషన్ లేదని, విద్యార్థులను పోలీసులు నిలువరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. రోహిత్ వేముల మృతికి కార‌కుల‌ను శిక్షించాల‌ని విద్యార్థి నేత‌లు నిన‌దించారు. వీసీ అప్పారావు పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దేశంలో ద‌ళితుల కోసం రోహిత్ వేముల పేరుతో చ‌ట్టం రూపొందించాల‌ని డిమాండ్ చేశారు.


ఎన్టీఆర్ కోసం అత‌న్ని ఎంచుకున్నారు..!

ntr

ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వ‌రుస హిట్స్ తో హుషారుగా క‌నిపిస్తున్నారు. టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ ల త‌ర్వాత సినిమా కోసం చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై వ‌స్తున్న సినిమా కావ‌డంతో దానికి త‌గ్గట్టుగా అన్ని హంగులు సిద్ధం చేస్తున్నారు. యంగ్ టైగ‌ర్ లేటెస్ట్ మువీ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్స్ స్టేజ్ లో ఉంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో రాబోతోంది. తొలిసారిగా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తుండటంతో ఆస‌క్తి క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే గ్రాఫిక్స్, షూటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరమవుతుందని భావిస్తున్నారు. జాతీయ స్థాయి సినిమాటోగ్రాఫర్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన యూనిట్ సభ్యులు ఓ టాప్ టెక్నిషియన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్Read More


గౌతమీపుత్రుడి కోసం ‘బాహుబలి’ టీం…..

BAAHU

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతంగా దూసుకెళుతోంది. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కలెక్షన్ల పరంగా సంతోషంగా ఉన్నారు. దీంతో సినిమాను జనాల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే బాలయ్య, డైరెక్టర్ క్రిష్‌, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌లతో కలిసి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి దర్శక ధీరుడు రాజమౌళి, భల్లాలదేవుడు రానా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పండుగ అనంతరం కలెక్షన్లు పడిపోకుండా బాలకృష్ణతో రానా, క్రిష్‌తో జక్కన్నల ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఓ చానల్ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించిందట. ఈ వీకెండ్‌లోనే ఆ చానల్ సదరు ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుందని టాక్. బాహుబలి ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నRead More


బన్నీకి చెర్రీకీ మద్యలో….

Ram_Charan

ఇటీవల బన్నీకి వరుస హిట్లు రావడం, అభిమానుల లిస్టు పెరుగుతుండడంతో అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య అంతరం పెరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదికపై అల్లు హీరోలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న టాక్ వినిపిస్తోంది.వివరాల్లోకి వెళితే, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో మెగా బ్రదర్ నాగబాబు సంచలన కామెంట్లు చేయడం.. ఆ కామెంట్లకు ఘాటైన రిప్లైలు రావడం గురించి తెలిసిందే. ఆ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. దానిపై పవన్ అభిమానులు నానా యాగీ చేశారు. అల్లు అర్జున్‌ను చుట్టుముట్టారు. పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలు పొడసూపాయని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. కారణం.. ఆ ఫంక్షన్‌లో బన్నీకి కావాల్సినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడమేనని ఫంక్షన్‌కు హాజరైన పలువురు అభిమానులు అనుకుంటున్నారు.


ఉద్యోగులకు బంపరాఫర్….

job

అవును, 2017లో ఉద్యోగులకు బంపరాఫర్ తగిలినట్టే. ఎందుకంటే, నెలకు కనీసం ఒక సుదీర్ఘ వారాంతం వస్తుండడం ఉద్యోగులను ఊరిస్తోంది. ముఖ్యంగా ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 2017 సంవత్సరం బంపర్ ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి. సందట్లో సడేమియాలా పర్యాటకులను ఆకర్షించేందుకు ట్రావెలింగ్ కంపెనీలు పలు రకాల ఆఫర్లతో రెడీ అవుతున్నాయి. విమాన కంపెనీలు మరో అడుగు ముందుకేసి విదేశీ పర్యటనలకు స్పెషల్ డిస్కౌంట్ సేల్స్ మొదలుపెట్టేశాయి. ఈ ఏడాది మొత్తం 12 సుదీర్ఘ వారాంతాలు రానున్నాయి. 2016లో దీపావళి, గాంధీ జయంతి, క్రిస్మస్ సహా తదితర పండుగలు ఆదివారం వచ్చాయి. అయితే 2017లో మాత్రం బ్యాంకు సెలవుకు ఒకరోజు ముందు లేదా తర్వాతే వస్తున్నాయని ఓ ట్రావెలింగ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఇకపోతే ఈ నెలలో సంక్రాంతి సీజన్ అయిపోయింది కదా అనుకున్నవారికి రిపబ్లిక్ డే రూపంలోRead More