Main Menu

Tuesday, January 10th, 2017

 

కొత్త విధానాలకు.. కేరాఫ్‌

Chandrababu_Naidu_Close_Up_3x2 (Facebook - Andhra Pradesh CM)

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం డిజిధన్‌ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో కేంద్ర మంత్రి వెంకయ్యతో కలిసి సీఎం పాల్గొన్నారు.దేశంలో ఏ కొత్త విధానానికి నాంది పలికినా దానికి కేరాఫ్‌ అడ్ర్‌సగా అమరావతి, విజయవాడ నిలుస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సుమారు 80కుపైగా బ్యాంకులు, మొబైల్‌ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. పెద్ద నోట్ల రద్దును దేశంలో ప్రోత్సహించిన మొట్టమొదటి సీఎంని తానేనని చంద్రబాబు అన్నారు. నవంబర్‌ 8 నాటికి రాష్ట్రంలో కేవలం 8 శాతం డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తుండగా, ఈ రోజు 34% మంది డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారన్నారు. మార్చి నాటికి దీన్ని 70 శాతానికి తీసుకెళుతామన్నారు.డిజిటల్‌ లావాదేవీల నిర్వహణలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో నగదురహిత లావాదేవీల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో నిలవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడుRead More


కోడి పందేలా ‘ఎ..క్క..డా’….అంటున్న కేంద్రమంత్రి

cock

కోడి పందేలా ‘ఎ..క్క..డా’అంటున్నారు ఒక కేంద్ర మంత్రి.ఇక వివరాల్లోకి వెళితే, తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో బుల్‌ఫైట్‌పై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉన్నామని కేంద్రమంత్రి అనిల్‌ దవే తెలిపారు. ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హింస లేని సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంలో తప్పు లేదన్నారు. ఇదే సమయంలో ఏపీలో కోడిపందేల నిషేధంపై ప్రశ్నించగా.. ఏపీలో కోడిపందాల నిర్వహణ అంశం తమ దృష్టికి రాలేదన్నారు.


పవన్ ఇప్పడు హై సెక్యురిటీ పర్సన్…

chiranjeevi-wants-to-see-that-step-of-pawan-kalyan_b_2103160645

మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో తమ్ముడు పవన్ గురించి మాట్లాడుతూ, అతనెప్పుడూ మితభాషి అని, నలుగురితో కలిసి ఉండలేడని అన్నారు. తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని అన్నారు. బయటి ప్రపంచమే పవన్‌ను కొత్తగా చూస్తోందని కాని అతడు తనకెప్పుడు పాతేనని అన్నారు. అంతే కాకుండా పవన్ ప్రవర్తనలో ఇప్పటికీ ఎలాంటి మార్పులు రాలేదని అన్నారు. ఇప్పటికీ అవే లక్షణాలని, దానికి చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాంచరణ్ ఫంక్షన్‌ను పవన్‌ను ఆహ్వానించారని కాని తనకు బాధ్యతలు ఎక్కువై రాలేక పోయాడు. తను రాకపోయినా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడని గుర్తు చేశారు.


బాబు మనసులో మాట అదేనా?

babu

చెన్నైలో ఇండియాటుడే నిర్వహించిన సదస్సులో ఏపీ సిఎం చంద్రబాబునాయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ప్రధాని అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చిందని, అయితే తాను రాష్ట్ర ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యతనిస్తూ, ఆ అవకాశాలను తిరస్కరించానని చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతిని వల్డ్ క్లాస్ సిటీగా, భారత్‌లోనే ఉత్తమ నగరంగా, హైదరాబాద్‌ కన్నా పెద్ద నగరాన్ని నిర్మించబోతున్నామన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజధాని కోసం భూములు ఇవ్వడం గొప్పవిషయమని చంద్రబాబు తెలిపారు. నోట్ల రద్దును చంద్రబాబు మరోమారు సమర్థించారు. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు నోట్ల రద్దును సమర్ధించారని బాబు చెప్పారు. వ్యతిరేకిస్తున్న ఐదు శాతం మంది ప్రతిపక్ష నేతలేనన్నారు. మోదీతో సత్సంబంధాలున్నాయని చెప్పారు. వాజ్‌పేయితో మోదీని పోల్చవద్దని కోరారు.


ఎన్టీఆర్ కన్నా వెనుకంజలో చిరు…

Jr-NTR-Chiranjeevi

టాలీవుడ్లో ఎన్టీఆర్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జనతాగ్యారేజ్. ఈ సినిమాతో ఎన్టీఆర్ పలు రికార్డులను తన ఒరలో చేర్చుకున్నాడు. ఇక, చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బుధవారం విడుదలకు సిద్ధమైంది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఎందుకూ అంటే.. ఓ విషయంలో చిరు ఖైదీ నంబర్ 150 సినిమా తారక్‌ను దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ సినిమా విడుదల కాబోతోంది. దానికన్నా ముందు స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు కర్ణాటకలో. ఆ ప్రీమియర్ షోల విషయంలో జనతాగ్యారేజ్‌ను దాటలేకపోయింది చిరు ఖైదీ నంబర్ 150. కన్నడ నాట జనతాగ్యారేజ్‌కు 24 ప్రీమియర్ షోలు వేస్తే.. ఖైదీ నంబర్ 150కి మాత్రం 18 స్పెషల్ షోలే వేస్తున్నారట. వాస్తవానికి ధృవ సినిమాతోనే జనతాగ్యారేజ్Read More


జియో మరో సంచలనం..

mukesh ambani jio reliance

రిలయన్స్ జియో మరో సంచలనం నమోదు చేసింది. గతేడాది ఎక్కువమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో వెతికింది దీని కోసమే. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ సంస్థ యూసీ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది హాటెస్ట్ కీవర్డ్‌గా నిలిచిన రిలయన్స్ జియో కోసం 11.60 కోట్ల మంది సెర్చ్ చేశారని పేర్కొంది. హిందీ, ఇంగ్లిష్‌లోనూ ఇదే హాటెస్ట్ కీ వర్డ్ అని తెలిపింది. ఆ తర్వాత మొబైల్ వినియోగదారులు వెతికింది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించే. దీనికి 10.8కోట్ల పేజ్ వ్యూస్ వచ్చాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు హిందీలో 5.6కోట్ల పేజ్ వ్యూస్, ఇంగ్లిష్‌లో 80 లక్షల పేజ్ వ్యూస్ వచ్చాయి. వీరి తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాను ఎక్కువమంది వెతికారు. ఆమెకు ఇంగ్లిష్‌లో 80 లక్షల పేజ్ వ్యూస్ రాగా హిందీRead More


ధోనీ మాస్టర్ మైండ్ స్కెచ్‌కు రాలిపోయిన వికెట్లు..

dhoni1

ప్రస్తుతం ధోనీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి వార్మప్ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన ఐదు వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అయితే తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ దూకుడుగా ఆట మెదలుపెట్టారు. 95 పరుగుల వరకూ ఒక్క వికెట్ పడలేదు. నెహ్రా, హార్ధిక్ పాండ్యా, మోహిత్ శర్మలు 15 ఓవర్లపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.దీంతో కూల్ కెప్టెన్ ధోనీ తన స్కెచ్ మార్చి కుల్దీప్ యాదవ్, చహల్‌లను రంగంలోకి దించాడు. అంతే వెంట వెంటనే వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ అదుపు తప్పుతున్న పరిస్థితి భారత్ చేతిలోకి మారింది. ఓపెనర్లు జాసన్ రాయ్ 62, అలెక్స్ హేల్స్ ‌40 పరుగుల వద్ద ఉండగా కుల్దీప్ యాదవ్ తన మొదటి రెండు ఓవర్లలోనే ఔట్Read More


మరో రెండు సినిమాలు మాత్రమే…

chiru

మెగాస్టార్ చిరంజీవి తన భవిష్యత్ కార్యాచరణ ముందే ప్రకటించేసారు. రానున్న రోజుల్లో మరో రెండు సినిమాలు చెయ్యగలనని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ‘ఖైదీ నంబరు 150’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘పరుచూరి బ్రదర్స్‌ చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను స్టాండ్‌బైగా పెట్టుకున్నాం. అలాగే డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి నాతో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. నా 152వ సినిమాను గీతా ఆర్ట్స్‌లో చెయ్యడానికి బోయపాటి శ్రీను సిద్ధంగా ఉన్నారు. ’’ అని చిరంజీవి పేర్కొన్నారు.