Main Menu

Friday, January 6th, 2017

 

మళ్ళీ కెప్టెన్‌గా కొనసాగుతున్న ధోనీ..

భారత మేటి క్రికెటర్ ధోనీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు కోహ్లీనే సారధిగా ప్రకటించారు సెలక్టర్లు. ధోనీ మాత్రం ఈ రెండు ఫార్మెట్లలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా కొనగనున్నాడు. అయితే ధోనికి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు సెలక్టర్లు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇరుదేశాల ‘ఏ’ జట్ల మధ్య రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో మొదటి మ్యాచ్‌కు ధోనీనే కెప్టెన్‌గా జట్టును నడిపంచనున్నాడరి సెలక్షన్ కమిటీ తెలిపింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రహానే సారధిగా ఉండనున్నాడు. జనవరి 15న ఇంగ్లండ్‌తో జరగబోయే మొదటి వన్డే నుంచి కోహ్లీ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తాడు. మొదటి వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టు ధోనీ(కెప్టెన్), మన్దీప్ సింగ్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, హర్ధిక్ పాండ్యా, సంజూRead More


కిలో పచ్చిమిర్చి రూ.2900.

ఇది మనకు కొంచెం ఊరటనిచ్చేదే.అదేంటి కిలో పచ్చిమిర్చి రూ.2900, అయితే ఊరట నివ్వడమేమిటి అనుకుంతున్నారా.మరేంలేదండి. కేజీ పచ్చిమిరపకాయులు ధర రూ.2,900. అయితే అది మన దేశంలో కాకపోవడం మనకు ఊరటనిచ్చే విషయం.నిజంగానే కేజీ పచ్చిమిరపకాయులు ధర రూ.2,900. మనకు పొరుగుదేశమైన భూటాన్‌లో ఇప్పుడీ పరిస్థితి ఉంది. కొత్తసంవత్సరానికి గుర్తుగా భూటాన్ ప్రజలు జరుపుకునే పండుగలో పచ్చిమిరపకాయలను విపరీతంగా వినియోగిస్తారు. డిసెంబరు,జనవరి, ఫిబ్రవరిలో పచ్చిమిరపకాయలకు ఇక్కడ భలే గిరాకీ. వారు జరపుకునే ‘లోంబా’ పండుగ సందర్భంగా చేసే వంటల్లో పచ్చిమిరపకాయలను విపరీతంగా ఉపయోగిస్తారు. ‘హొయెంటో’ అనే కూరనైతే అచ్చంగా పెరుగు, పచ్చిమిరపకాయలతోనే వండుతారు. ఈ కారణంగానే ఈ మూడునెలల్లో ఇక్కడ పచ్చిమిర్చికి అంతటి డిమాండ్.అయితే గతంతో పోలిస్తే ఈసారి భూటాన్‌లో మిరపకాయల ధర మోతెక్కిపోతోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల మిరపకాయలను గత జూన్‌లో భూటాన్Read More


కార్పొరేటర్ కూ జరిమానా విధించిన జీహెచ్ఎంసీ…

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ (బన్సీలాల్‌పేట) హేమలతకు గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ – జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెకు ఏకంగా రూ. 10 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. బన్సీలాల్ పేటలో ఓ ప్రారంభోత్సవానికి పలువురు మంత్రులు వస్తున్నారు. అయితే మంత్రుల రాక సందర్భంగా స్వాగతం పలుకుతూ తమ పేరుతో కార్పొరేటర్ హేమలత నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆమెకు జరిమానా విధించారు.


కోడి పుంజుకూ ‘నాలుగు వారాల’ గడువు…

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి కి ఉన్నంత హడావిడి మరే పండగకు లెదంటే అతిసయోక్తి కాదేమో.మాటల్లో చెప్పలేనంత సందడి ఈ పండుగ సొంతం.అందులోనూ కోడి పందాలకుండే క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. కోడి పందాలు లేకుండా ఈ పండుగని కనీసం ఊహించుకోలేము కూడా.అయితే ఇటీవల కోడి పందాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.అయితే, కోడిపందాలపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. కోడిపందాలకు ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలి గానీ కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.


పవన్ ఎఫెక్ట్ తో .. స్పందించిన చంద్రబాబు

ఉద్దానంలో కిడ్నీ భాదితులను కలిసి పరామర్శించి వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన విజ్ఞప్తితో… సీఎం చంద్రబాబు స్పందించారు. కుప్పం తరహాలో ఉద్దానంలో కూడా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని అధికారులను బాబు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 26వ తేది నాటికి బాధిత గ్రామాలకు తాగునీటిని అందించాలని డెడ్‌లైన్ పెట్టారు. కిడ్నీ సమస్య ఉన్న అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద రూ. 2కు 20 లీటర్లు నీరు ఇస్తామన్నారు. కిడ్నీ సమస్య ఎందుకు వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారన్నారు. ఆక్సిన్‌ లెవల్స్‌ నీటిలో రావడం… సిలికాన్‌ నేలలో ఉండటం వల్ల వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారని సీఎం తెలిపారు. దీనిపై రెండు నిపుణులRead More