Main Menu

Thursday, January 5th, 2017

 

వ్యభిచార గృహంలో విద్యాబాలన్‌…

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ గత రెండేళ్ళ కాలంలో సాదించిన అనూహ్య విజయాలగురించి మనకు తెలిసిందె.ఆమె వినూత్న తరహాలో కథల్ని ఎంచుకుని వీటికి జీవం పోస్తూ విజయాల దిసగా సాగుతోంది.ఈ క్రమంలో ‘డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’, ‘కహానీ-2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న తర్వాతి చిత్రం ‘బేగం జాన్‌’. ఇందులో ఆమె వ్యభిచార గృహ నిర్వాహకురాలి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ స్టిల్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో విద్యా హుక్కా తాగుతూ కనిపించిన తీరు చిత్రంపై అంచనాలు పెంచుతోంది. బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇది. బెంగాలీలో ‘రాజ్‌కహిని’ పేరుతో శ్రీజిత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్‌ షా, రాజేశ్‌ శర్మ, గౌహర్‌ఖాన్‌, పల్లవీRead More


షారుక్‌ అల్లుడు ఇలా…

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ హీరోగా ఎలాఉన్నా, తన పిల్లల విషయంలో మాత్రం అందరు తండ్రుల్లాగే వ్యవహరిస్తాడు. ఎంత సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా షారుక్‌కి తన ముగ్గురు పిల్లలు ఆర్యన్‌, సుహానా, అబ్రామ్‌లకు మించింది ఏమీ లేదు. తాజాగా షారుక్‌ తన కుమార్తె సుహానాతో డేటింగ్‌ చేసే కుర్రాడికి ఉండాల్సిన లక్షణాలేంటో ఫెమీనా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇలా వివరించాడు. * ఉద్యోగం ఉండాలి * నాకు ‘నువ్వంటే ఇష్టం లేదు’ అన్న విషయం అర్థంచేసుకోవాలి. * నేను సుహానా ఎక్కడుంటే అక్కడుంటాను. * తను నా ఇంటి యువరాణి. ‘నీ సొంతం’ అనుకుంటే నేనూరుకోను. * నువ్వు తన పట్ల ఎలా ఉంటే.. నేను నీతో అలాగే వ్యవహరిస్తా. .. అంటూ తన కుమార్తెపై ఎంతప్రేముందో నాలుగు ముక్కల్లో వివరించి చెప్పారు బాద్‌షా. షారుక్‌ నటించిన రయీస్‌Read More


రూ.2వేలకే స్మార్ట్‌ఫోను ఎలాగంటే…

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గూగుల్‌ అధిపతి, భారత్‌కు చెందిన సుందర్‌ పిచాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కీలక పాత్ర పోషించాలంటే అంతర్జాలం వేదికగా ప్రాంతీయ భాషల్లో అనుసంధానం పెరగాలన్నారు.ఆయన మాటల్లోనే.. ‘తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లు రావడమంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ధరలు ఇంకా దిగిరావాలి. రూ.2వేలకే స్మార్ట్‌ఫోను అందుబాటులోకి రావాలి’ అని అన్నారు. 2014లో గూగుల్‌.. భారతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుల కోసం ‘ఆండ్రాయిడ్‌ వన్‌’ ప్రోగ్రాం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అత్యంత నాణ్యమైన, సరసమైన ధరలకు ఆండ్రాయిడ్‌ డివైజ్‌లను అందిస్తోంది. మైక్రోమాక్స్‌, కార్బన్‌, స్పైస్‌ సంస్థలు ఈ మేరకు గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నాయి. అనంతరం రూ.6,399కి స్మార్‌ఫోన్‌ను ఆ సంస్థలు విడుదల చేశాయి. డిజిటల్‌ ఇండియా కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గూగుల్‌ మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కృషిRead More


నాని కూడా అది మొదలెట్టేశాడు..

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియో విడుదలకు సంబందించి,ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది.సినిమా లోని అన్ని పాటలూ ఒకేసారి విడుదల చేస్తే సినిమాకు సరిగ్గా ప్రమోషన్ జరగదనో ఏమో ఒక్కో పాటను విడుదల చేస్తూ సరికొత్త పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపారు టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు. ఈ ఒక్కో పాట సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారో కానీ చాలామంది హీరోలు ఈ మధ్య ఇదే ఫాలో అవుతున్నారు. నేచులర్ స్టార్ నాని కూడా దీన్నే మార్గంగా ఎంచుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను లోకల్’. దిల్‌రాజు నిర్మాతగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘నెక్ట్స్ ఏంటి’ అనే బాణీలో సాగుతుందట. ఈ పాటను జనవరి 6న సాయంత్రం 6గంటలకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు నాని తనRead More


అర్హత పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే…

మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ,ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌ పరీక్షా విధానం గురించి తేల్చి చెప్పారు.వివరాల్లోకి వెళితే, 2017లో అన్ని ప్రవేశ అర్హత పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. వివిధ సెట్ల నిర్వహణకు సంబంధించి చైర్మన్‌లు, కన్వీనర్‌లను మంత్రి గంటా ప్రకటించారు. పరీక్షల నిర్వహణకు కమిటీ వేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షల గురించి అవగాహన తెచ్చుకోవాలన్నారు.


శాతకర్ణికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే…

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌‌‌ను సెన్సార్‌ బోర్డు జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన అనంతరం చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మీడియాతో మాట్లాడుతూ.. “మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది.. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అభినందనలు తెలపారు. అయితే ఈ సినిమా సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై నిర్మాతలు మాత్రం స్పందించలేదు.ఈ చారిత్రాత్మక సినిమాను దర్శకుడు జాగర్లముడి రాధాకృష్ణ (క్రిష్) ఎంతో ఘనంగా తెరకెక్కించాడు. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య చేసిన యుద్ధ విన్యాసాలు, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలయ్య సరసన వైశిష్ఠి దేవిగా శ్రియ శరణ్ నటిస్తోంది. బాలయ్యకు తల్లిగా బాలీవుడ్ నటి హేమా మాలిని ముఖ్య పాత్రలో నటిస్తోంది.Read More


కెప్టెన్సీని వదులుకోవడానికి కారణమదే!

ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ రాణిస్తున్న తరుణంలో విరాట్‌నే అన్ని ఫార్మెట్‌లకు కెప్టెన్‌గా చేయాలని సెలక్టర్లపై ఒత్తిడి ఉంది. జనవరి 15 నుంచి ఇంగ్లండ్‌తో మొదలు కానున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు కోహ్లీని సారధిగా చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.2007లో ద్రావిడ్‌ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన ధోనీ.. భారతకు ఎన్నో ఘన విజయాలు అందించాడు. 2007లో ఐసీసీ వరల్డ్‌ టీ-20, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీలను మహీ నేతృత్వంలో టీమిండియా సాధించింది. ధోనీ హయాంలో 2009లో టెస్టుల్లో టాప్‌ ర్యాంకును భారత జట్టు కైవసం చేసుకుంది. ధోనీ నాయకత్వంలో భారత 199 వన్డేలు ఆడితే.. 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 72 టీ-20ల్లో 41 నెగ్గి.. 28 మ్యాచ్‌ల్లో ఓడింది. కెప్టెన్‌గా వన్డేల్లో 54 సగటుతో 6,633 పరుగులు చేశాడు. సారథిగా టీ-20ల్లో 122.60Read More