Main Menu

Sunday, January 1st, 2017

 

రజనీ కొత్త సంవత్సరం కానుక…

రజనీ తన అభిమానులకు కొత్త సంవత్సరం కానుక అందించారు.ఇక వివరాల్లోకి వెళితే, సూపర్‌స్టార్‌ రజనీకాంత్, అభిమానులకు ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కొత్త సంవత్సరం కానుక ఇచ్చారు. పా.రంజిత దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలో నిడివి ఎక్కువైన కారణంగా తొలగించిన సన్నివేశాలను న్యూ ఇయర్‌ కానుకగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే విమానంపైనా సినిమా ప్రకటనతో సంచలనం సృష్టించిన చిత్రం ‘కబాలి’. విడుదలయ్యాక విమర్శకులు పెదవి విరిచినా రజనీకాంత్ స్టైల్‌ని అభిమానులు ఆస్వాదించారు. ఆ స్పందనతోనే రజనీకాంత్ మరోసారి రంజిత్‌కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2.ఓ’ తరువాత రజనీకాంత్ – పా.రంజిత్ కాంబినేషనలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.


తండ్రిని తప్పించి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనయుడు..

తన తండ్రిని తప్పించి పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబోతున్న తనయుడి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి. సమాజ్ వాదీ పార్టీలో తండ్రీతనయుల వైరం మరింత ముదురుపాకాన పడింది. పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు చేశారు. జాతీయ అధ్యక్ష పదవి నుంచి ములాయం సింగ్ యాదవ్‌‌ను తొలగించి అఖిలేశ్ యాదవ్‌కు ఆ పదవిని కట్టబెట్టాలని, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగించాలని, పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను నియమించాలని ప్రతిపాదించారు. పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఈ ప్రతిపాదనలను చేస్తుండగా సభకు హాజరైనవారంతా చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. పార్టీRead More


చెత్తకు ‘బంగారం’ : జీహెచ్‌ఎంసీ

అవునండి మీరు చదివింది నిజమే. స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనండి.. బంగారం, నగదు గెలుచుకోండి.. అంటూ జీహెచ్‌ఎంసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పారిశుధ్య నిర్వహణలో మెరుగ్గా పనిచేసే కార్మికులు, బాధ్యతాయుతంగా వ్యవహరించే పౌరులకు ఈ నజరానాలు అందించాలని నిర్ణయించారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించే ట్రాలీ కార్మికులు, చెత్తను బహిరంగంగా వేయకుండా ఇళ్లలో వేరు చేసే గృహిణులకు బహుమతులు ఇస్తామని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు.


అరవింద్‌స్వామి హవా…

నిన్నటితరం అందాలనటుడు అరవింద్‌స్వామి లేటు వయసులో ఒకే ఒక్క చిత్రంతో స్టార్‌డమ్‌ సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జయంరవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో వచ్చిన ‘తనీ ఒరువన్’లో అరవింద్‌స్వామి ప్రదర్శించిన విలక్షణ విలనిజం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ తరువాత తెలుగులో వచ్చిన ధృవలో కూడా అదే మేజిక్‌ రిపీట్‌ చేసి దక్షిణాది లేటెస్ట్‌ ఫేవరెట్‌ విలన్‌గా మారారు. దీంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరోకొద్ది రోజుల్లో తమిళ చిత్రం ‘బోగన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయనకు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ‘తారాతప్పట్టై’ తరువాత ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో కీలకపాత్రకు అరవింద్‌స్వామిని ఎంపిక చేశారు. బాలా చిత్రంలో రోల్‌ కోసం తనతో సంప్రదింపులు జరిపినట్టు అరవింద్‌స్వామి కూడా స్పష్టం చేశారు. అయితే బాలా ప్రాజెక్టుకు గ్రీనసిగ్నల్‌ ఇచ్చిందీ లేనిదీ ఆయన వెల్లడించలేదు.