Main Menu

Sunday, December 11th, 2016

 

పిచ్చోళ్ల స్వ‌ర్గంలో ప్ర‌ధాని..!

ఇదే అనుమానం క‌లుగుతోంది. ఓ వైపు దేశ‌మంతా క్యూలో నిల‌బ‌డుతోంది. తెల్ల‌వారు జాము, అర్థ‌రాత్రి, మిట్ట‌మ‌ధ్య‌హ్నాం అన్న తేడా లు లేవు..ఏటీఎంల‌లో డ‌బ్బులు వేశార‌ని తెలిస్తే వెంట‌నే జ‌నం వాలిపోతున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూసి రెండు వేల నోటు కోసం ఎగ‌బ‌డుతున్నారు. అయినా స‌ర్కారులో చ‌ల‌నం లేదు. 50 రోజుల్లో దేశంలో పెను మార్పులు వ‌స్తాయ‌ని చెప్పిన ప్ర‌ధాని ఇప్ప‌టికే 34 రోజులు గ‌డిచిపోయినా మూడో వంతు ఏటీఎంలు ప‌నిచేయ‌డం లేద‌న్న విష‌యాన్ని అంగీక‌రించ‌డం లేదు. న‌ల్ల‌ధ‌నం కోసం మొద‌ట చెప్పి, టెర్రిరిస్టుల‌కు చెక్ పడుతుందంటూ కూడా చెప్పుకొచ్చి..చివ‌ర‌కు న‌గ‌దు ర‌హిత భార‌తం అనిచెబుతున్న ప్ర‌భుత్వం వాస్త‌వాలు విస్మ‌రించిన‌ట్టు దేశ‌మంతా గ‌గ్గోలు పెడుతోంది. అయినా ప్ర‌ధానికి క‌నీసం చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదు. తాను ప‌ట్టిన కుందేటిక‌న్న చందంగా పీఎం తీరు ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇంకాRead More


ధృవ యూనిట్ కి షాక్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ లేటెస్ట్ మువీ ధృవ డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మంచి ఓపెనింగ్స్ సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతోంది. తొలి రెండు రోజుల్లోనే 22.5 కోట్లు సాధించింది. తొలిరోజు క‌లెక్ష‌న్లు 15కోట్ల షేర్ ఉండ‌డం విశేషం. ఈ రిజ‌ల్ట్స్ యూనిట్ కాస్త ఖుషీగా ఉంది. పాజిటివ్ వ‌సూళ్లు వ‌స్తాయ‌న్న ఆశ‌తో ఉంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ధృవ యూనిట్ కి షాక్ త‌గిలింది. సోష‌ల్ మీడియాలో పైర‌సీ వీరులు చెల‌రేగిపోవ‌డంతో చెర్రీ స‌హా నిర్మాత అల్లు అర‌వింద్ కూడా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. గత రాత్రి యూట్యూబ్‌లో గుర్తుతెలియని పైరసీ నేరగాళ్లు ధృవ సినిమాను పోస్ట్ చేయ‌డంతో క‌ల‌వ‌ర‌ప‌డ్డారు. దాంతో అవాక్క‌యిన యూనిట్ వెంట‌నే యాంటీ పైర‌సీ స్క్వాడ్ ను ఆశ్ర‌యించ‌డంతో ఆ సినిమాను యూట్యూబ్ ను తొల‌గించారు. దాంతో కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. ఇంత‌కుముందుRead More


కొత్త చ‌రిత్ర‌కు రెండ‌డుగ‌ల దూరంలో నిలిచిపోయిన కోహ్లీ, జ‌యంత్

ముంబై: వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు 400 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అందుకు బదులుగా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. విజయ్(136), కోహ్లీ(235), జయంత్ యాదవ్(104)ల అద్భుత బ్యాటింగ్‌తో 631 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో ఎనిమిదో వికెట్‌కు కోహ్లీ, జయంత్‌లు 241 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మరో రెండు పరుగులు చేసిం ఉంటే ప్రపంచ రికార్డ్ సాధించేవారు. అంతకుముందు 1908లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హార్టింగన్, హిల్స్‌లు 8వ వికెట్‌కు చేసిన 243 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. వీరి తర్వాత 241 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన ప్రస్తుత కోహ్లీ, జయంత్‌ల భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది.


బాహుబ‌లికి విముక్తి..!

బాహుబ‌లికి విముక్తి ల‌భించింది. నాలుగేళ్లుగా అదే క‌థ‌లో లీన‌మ‌యిపోయిన ప్ర‌భాస్ కి రిలీఫ్ ద‌క్కింది. ఎట్ట‌కేల‌కు బాహుబ‌లి నుంచి ప్ర‌భాస్ కి ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. రెండు భాగాల సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన ప్ర‌భాస్ పాత్ర దాదాపు పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ రెబ‌ల్ స్టార్ రోల్ షూటింగ్ కి ముగింపు ప‌ల‌క‌బోతున్న‌రు. మొత్తం బాహుబ‌లి సినిమా డిసెంబర్ 27తో షూటింగ్ వర్క్ పూర్తి చేసుకోనుందని స‌మాచారం. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో సీక్వల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా మరింత ప్రతిష్టాత్మకంగా బాహుబలి ద కంక్లూజన్ను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి షూటింగ్కు ప్యాకప్ చెప్పేసి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టనున్నారు. ప్రభాస్ కూడా కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాRead More


సీఎం ర‌మేష్ ఒత్తిడి తెస్తున్నారు..!

క‌డ‌ప ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. అందులో బాగంగానే రాయ‌ల‌సీమ అభివృద్ధి వేదిక క‌న్వీన‌ర్ ర‌మ‌ణారెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. నేరుగా టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ త‌న‌ను ఒత్తిడి చేస్తున్నార‌ని అయిన‌ప్ప‌టికీ తాను వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి వివేకానంద‌రెడ్డికే మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ర‌మ‌ణా రెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీదే విజ‌యం అని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ అన‌వ‌స‌రంగా ఇలాంటి ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని సూచించారు.


ఎస్‌బీఐ నుంచి రూ.25వేల పరిమితి కార్డులు..

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అల్పాదాయ వర్గాలకు ఉపయుక్తంగా,ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రూ.25,000 పరిమితి గల క్రెడిట్‌ కార్డులు జారీ చేయనుంది. ఖాతాదారులకు ఎలాంటి క్రెడిట్‌ చరిత్ర లేకున్నా కార్డులు జారీ చేస్తామని తెలిపింది. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న కొంత నగదు నిల్వను గ్యారంటీగా ఉంచుకొంటామని ఎస్‌బీఐ కార్డ్స్‌, పేమెంట్‌ సేవల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ్‌ జసుజా పేర్కొన్నారు.ప్రజల సమస్య డబ్బు లేకపోవడం కాదని కొనుగోలు చేయడానికి కార్డులు లేకపోవడమే అసలు సమస్యన్నారు. రెండు మూడు నెలల్లో ఇది కార్యరూపం దాలుస్తుందని తెలిపారు. నోట్ల రద్దుతో కార్డుల వినియోగం, లావాదేవీల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ఏడాదిలో 9-10 లక్షల కార్డుల వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు, వీరిలో కనీసం 25% కొత్త వినియోగదారులు ఉంటారన్నారు. ప్రస్తుతం 9-11 రోజుల్లో క్రెడిట్‌ కార్డులు ఇస్తుండగా దీనిని కనీసంRead More


“అతి తీవ్ర” తుపానుగా ‘వర్ద’ ..

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వర్ధ’ తుపాను క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి దిశను ఆనుకుని కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం తీవ్ర తుఫాను నుంచి అతి తీవ్ర తుఫానుగా వర్ధ మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వర్ద’ తుపాను తీరానికి ముంచుకొస్తోంది. శనివారం పెను తుపానుగా మారిన ‘వర్ద’ ఆదివారం బలహీనపడి అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది రేపు సాయంత్రం చెన్నై-పులికాట్‌ సరస్సు మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 480 కి.మీ దూరంలో, నెల్లూరు తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ దూరంలో కేందీకృతమై ఉంది. ‘వర్ద’ గంటకు దాదాపు 11 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 40 కిలోమీటర్లRead More


స్వైప్ చేస్తే రూ.కోటి మీదే..కేంద్రం బంపరాఫర్..

కోటీశ్వరుల జాబితాలో మీరూ ఉండాలనుకుంటున్నారా?ఎవ్వరనుకోరు చెప్పండి.ఒకవేళ ఉండాలనుకుంటే, ప్రస్తుతం కరెన్సీ కష్టాల గురించి ఆలోచించకుండా మీ లావాదేవీలను డిజిటల్‌ బాట పట్టించండి. మీ అదృష్టం బాగుంటే కనీసం రూ.10 లక్షలు, అత్యధికంగా రూ.1 కోటి గెలుచుకోవచ్చు.అవును నిజమేనండి.. పేద, మధ్యతరగతి వర్గాలను డిజిటల్ లావాదేవీలవైపు మళ్లించేందుకు ప్రోత్సాహక పథకాన్ని నీతి ఆయోగ్ రచించింది. డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించినవారికి భారీ నగదు బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)ని కోరింది. దీనికోసం జాతీయ ఆర్థిక సమ్మిళిత నిధి నుంచి నుంచి రూ.125 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.ఎన్‌పీసీఐ పరిథిలో రిటెయిల్ పేమెంట్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా,Read More


శశికళ హెచ్చరిక దేనికి సంకేతం?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తీవ్రంగా హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, తన బంధువులెవరూ అధికారవర్గంలో, పాలనాపరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదని శశికళ ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ అధినేత్రి జయ ఆకస్మిక మృతితో తన కుటుంబీకుల జోక్యం అధికంగా వుంటుందని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఆమె ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేయడం విశేషం. అంతే కాకుండా తన బంధువులు ఎవరైనా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా వాటిని పట్టించుకోవద్దని, వెంటనే ఆ విషయాన్ని తన దృష్టికి తేవాలని అధికారులకు శశికళ మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. పోయెస్‌గార్డెనలో ప్రస్తుతం శశికళతో పాటు ఆమె కుటుంబీకులందరూ బసచేస్తుండడంతో వారంతా శశికళతో వున్న బంధుత్వాన్ని తెలియజేస్తూ పాలనాపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని ఇటీవల కాలంలో ఆరోపణలు రేగుతున్నాయి.


అరెస్ట్‌కు అంతా సిద్ధం..

గాలి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.అదేనండి, మైనింగ్ డాన్ గాలి జనార్ధనరెడ్డి కూతురు పెళ్లి కోసం బ్లాక్‌మనీని వైట్‌గా మార్చేందుకు ప్రయత్నించారని ఈ మధ్య వెలుగులోకొచ్చిన డ్రైవర్ రమేష్ గౌడ సూసైడ్‌తో స్పష్టమైంది. గాలి నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారి నాయక్‌ను గుల్బర్గాలో ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్‌లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాయక్ నిజానిజాలను బయటపెడితే గాలి జనార్ధనరెడ్డిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి. 20శాతం కమీషన్‌తో గాలి జనార్థనరెడ్డి 100 కోట్ల డబ్బును వైట్‌గా మార్చినట్లు రమేష్ గౌడ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.