హోం మంత్రి ఇంటిని ముట్ట‌డించిన అధికార పార్టీ శ్రేణులు

0

ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల వేడి అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత ఇంటిని ముట్ట‌డించే వ‌ర‌కూ వ‌చ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జ‌రిగిందంటూ గుంటూరులోని మంత్రి ఇంటిని వైఎస్సార్సీపీ శ్రేణులు ముట్ట‌డించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీషీటర్‌, కబ్జాదారుడికి 27వ డివిజన్‌ టికెట్‌ ఇచ్చారని కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త‌క్ష‌ణం అది మార్చాల‌ని డిమాండ్ చేశారు. అభ్య‌ర్థిని మార్చ‌క‌పోతే పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తామ‌ని నేత‌లు , కార్య‌క‌ర్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here