సీఎం ర‌మేష్ కొడుకు కోసం దుబాయ్ కి 15 ప్ర‌త్యేక విమానాలు

0

సీఎం ర‌మేష్. కాంట్రాక్ట‌ర్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడి వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌స్థానంలో అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లున్నాయి. టీడీపీ నుంచి బీజేపీ వ‌ర‌కూ సాగిన రాజ‌కీయ ప‌య‌నంలో అనేక కీల‌క మ‌లుపులున్నాయి. అయితే తాజాగా ఆయ‌న ఇంట్లో సాగుతున్న వివాహ నిశ్చితార్థ వేడుక‌ హాట్ టాపిక్ గా మారింది. సీఎం ర‌మేష్ త‌న‌యుడు రిత్విక్ నిశ్చితార్థ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్ లోని ర‌సాల్ ఖైమా కి చెందిన వాల్డ్రాఫ్ ఆస్టోరియా వేదిక‌గా ఈ నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతోంది. రిత్విక్ కి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ‌తో వివాహం జ‌ర‌ప‌బోతున్నారు.

ఈ వివాహ వేడుక‌ను ప్ర‌త్య‌క్షంగా తిల‌కించేందుకు సుమారుగా 60 మంది ఎంపీలు ఇండియా నుంచి దుబాయ్ ప‌య‌నం కాబోతున్నారు. వారి కోసం ప్ర‌త్యేకంగా 15 విమానాల‌ను సీఎం ర‌మేష్ ఏర్పాటు చేయ‌డం విశేషం. శ‌నివారం జ‌ర‌గ‌బోతున్న ఈ వేడుక త‌ర్వాత దుబాయ్ వెళ్లే అతిథుల‌కు మూడు రోజుల పాటు స‌క‌ల స‌దుపాయాల‌తో ఆతిథ్యం ఇచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌లువురు కేంద్ర మంత్రులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. వారితో పాటుగా వైసీపీ లోక్ స‌భాప‌క్ష నేత మిథున్ రెడ్డి స‌హా ప‌లువురు ప్రముఖులు హాజ‌ర‌వుతున్న ఈ వేడుక‌లో పాల్గొనేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు స‌హా అనేక మంది నేత‌లు ఇప్ప‌టికే దుబాయ్ చేరుకున్న‌ట్టు స‌మాచారం.

సీఎం ర‌మేష్ కి కాబోయే కోడ‌లు పూజ తాళ్లూరి, పూజ తండ్రి యూఎస్ లో ప్ర‌ముఖ డాక్ట‌ర్

సీఎం ర‌మేష్ కి కాబోయే వియ్యంకుడు రాజా తాళ్లూరికి ఇటీవ‌ల యూఎస్ లో ఓ భారీ డీల్ కుదిరిన‌ట్టు తెలుస్తోంది. దాని ద్వారా వేల కోట్ల ఆదాయం ఆయ‌న‌కు స‌మ‌కూరిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే నిశ్ఛితార్థం క‌నివినీ ఎరుగ‌ని రీతిలోనిర్వ‌హించేందుకు త‌గ్గ‌ట్టుగా దుబాయ్ లో స‌క‌ల స‌దుపాయాలు ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా చివ‌ర‌కు దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ప్ర‌త్యేక అనుమ‌తులు తీసుక‌ని వ‌స్తున్న అతిథుల‌కు రాచ‌మ‌ర్యాద‌లు సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ఇక నిశ్చితార్థ‌మే ఇలా ఉంటే పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుందోన‌నే ఆస‌క్తి క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here