Main Menu

జీ కోసం క‌న్నేసిన జియో

Spread the love

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కన్నేసింది. చౌక చార్జీలతో టెలికం రంగాన్ని కుదిపేసిన జియో… తాజాగా మీడియా కంటెంట్‌ విషయంలోనూ ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీన్లో భాగంగా జీల్‌లో వాటాలు దక్కించుకోవడంపై దృష్టి సారిస్తోంది. ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర వాటాల్లో సగభాగాన్ని కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగాలని జియో యోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటిదాకా అంతర్జాతీయ సంస్థలతోనే జట్టు కడతామంటూ వచిన జీల్‌ ప్రమోటర్లు… తాజాగా దేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశాలూ పరిశీలిస్తామని చెప్పడంతో జియో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే అమెజాన్, యాపిల్, టెన్సెంట్, ఆలీబాబా వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) అంతర్జాతీయ దిగ్గజాలు రేసులో ఉన్నాయి. వీటితో పాటు ఏటీఅండ్‌టీ, సింగ్‌టెల్, కామ్‌కాస్ట్, సోనీ పిక్చర్స్‌ పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇప్పటికే పలు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేశారు. నెట్‌వర్క్‌18లో 75 శాతం వాటాలు కొనుగోలు చేశారు. న్యూస్‌కి సంబంధించి సీఎన్‌ఎన్‌–న్యూస్‌18, సీఎన్‌బీసీ–టీవీ18, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి వయాకామ్‌ 18తో పాటు సినిమాల నిర్మాణ సంస్థ వయాకామ్‌18 మోషన్‌ పిక్చర్స్‌ వంటివి ఇందులో భాగమే. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్‌ సహా పలు భారతీయ భాషల్లో డిజిటల్, పబ్లిషింగ్‌ సంస్థలూ ఇందులో ఉన్నాయి. రామోజీరావుకు చెందిన ఈటీవీ వివిధ భాషల్లో ఆరంభించిన న్యూస్‌ ఛానెళ్లు కూడా ప్రస్తుతం నెట్‌వర్క్‌–18 చేతిలోనే ఉన్నాయి. 2017 జూలైలో కంటెంట్‌ ప్రొడక్షన్‌ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్‌లో రిలయన్స్‌ 24.9 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ సంస్థకి ఆల్ట్‌బాలాజీ పేరుతో ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) యాప్‌ కూడా ఉంది. ఇక ఇప్పుడు జీల్‌లో కూడా వాటాలు కొనుగోలు చేస్తే ఓటీటీ, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగంలో రిలయన్స్‌ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, దేశీయ నెట్‌ఫ్లిక్స్‌గా ఎదిగేందుకు రిలయన్స్‌ చేస్తున్న ప్రయత్నాలకు మరింత దన్ను లభిస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.






Related News

రికార్డ్ రేటులో బంగారం

Spread the loveదేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి,Read More

జీ కోసం క‌న్నేసిన జియో

Spread the loveఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కన్నేసింది. చౌక చార్జీలతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *