Main Menu

మూడో పెళ్లికి మాల్యా రెడీ..

Spread the love

దేశంలో బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టి లండ‌న్ లో కులాశాగా గ‌డుపుతున్న విలాస‌పురుషుడు విజ‌య్ మాల్యా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లో ఆయ‌న మూడో పెళ్లికి స‌న్నాహాలు చేసుకున్నారు. గత ఏడేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న పింకీ లాల్వానీ అనే సుందరిని ఆయన మనువాడబోతున్నట్లు తెలిసింది. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ తో ప‌లువురు భామ‌ల‌తో ఫోజులిచ్చిన మాల్యా త‌న మూడో పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. 2011లో ఆయ‌న సంస్థ‌ల్లో ఎయిర్ హోస్టెస్ గా చేరిన పింకీ నాటి నుంచి ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌య్యింది. సింధీ కుటుంబానికి చెందిన పింకీ వయసు 27 ఏళ్లు కాగా- మాల్యాకు ప్రస్తుతం 62 సంవత్సరాలు.

ఇప్పటికే ఆయనకు రెండు సార్లు వివాహం జరిగింది. తొలిభార్య సమీరా త్యాబ్జీ కూడా ఎయిర్‌హోస్టెసే. ఆమెతో కేవలం ఏడాది మాత్రమే (1986-87) ఆయన కలిసి ఉన్నారు. అనంతరం చిన్ననాటి స్నేహితురాలు రేఖను పెళ్లాడారు. ఈమెకు విడాకులివ్వకుండానే మాల్యా మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయనకు ముగ్గురు పిల్లలు… కొడుకు సిద్ధార్థ్‌, కూతుళ్లు- లీనా, తాన్యా. బ్రిటిష్‌ కోర్టులో మాల్యా అభియోగాలు ఎదుర్కొన్నపుడు కూడా పింకీ- ఆయన వెంట ఉన్నారు. చాలా విషయాలకు ఆమెపై ఆయన ఆధారపడతారని అంటారు. మాల్యా ఎక్కడికి వెళ్లినా పక్కన కనబడేది పింకీయే. దాంతో ఆమెను జీవిత‌భాగ‌స్వామిగా ఎంపిక చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.






Related News

మీ కార్డులు మార్చుకోవాల్సిందే..!!

Spread the loveఆర్బీఐ కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. వ‌చ్చే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ నుంచి ప్రారంభించ‌బోతోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల విష‌యంలోRead More

పాతాళానికి ప‌త‌నం దిశ‌లో రూపాయి..

Spread the loveఇండియ‌న్ రూపాయి ప‌త‌నం పాతాళానికి ప‌డిపోతున్న‌ట్టుగా ఉంది. రూపాయి విలువ రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనమతున్న తీరుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *