షాకిచ్చిన జియో మొబైల్

mukesh ambani jio reliance
Spread the love

ఫ్రీ డేటాతో చాలామందిని తనవైపు తిప్పుకుని ఇండియన్ టెలికాం రంగంలో దూసుకువచ్చిన రిలయోన్స్ ఇప్పుడు మొబైల్ ఫోన్ విషయంలో మాత్రం ఖాతాదారులకు చుక్కలు చూపించే ప్రయత్నం ప్రారంభించింది. ఒక్కసారి రిలయెన్స్ ఫోన్ కొంటే ఆ తర్వాత ముక్కు పిండి మూడేళ్ల పాటు వసూళ్ల పర్వం సాగించడానికి రిలయెన్స్ రంగం సిద్ధం చేసింది. దాంతో జియో కోసం ఎదురు చూస్తున్న వారికి షాక్ తగింది.

కస్టమర్లపై ఆశలపై నీళ్లు చల్లుతూ కొన్ని షాకింగ్‌ నిబంధనలు, తప్పనిసరి రీచార్జ్‌ల బాదుడుకు శ్రీకారం చుట్టింది. కనీస రీఛార్జిలు, ఫోన్‌ రిటర్న్ విధానాన్ని కంపెనీ తన వెబ్‌సైట్‌ లో పేర్కొంది.
ముఖ్యంగా జియో 4 జీ ఫీచర్‌ ఫోన్‌ కొనుగోలు సందర్భంగా కస్టమర్‌ డిపాజిట్‌ చేసిన రూ.1500 సొమ్ము తిరిగి పొందాలంటే మూడు సంవత్సరాల్లో కనీసం రూ.4500 విలువైన రీచార్జ్‌ చేసుకోవాలి. ఇది తప‍్పనిసరి. లేదంటే .. వినియోగదారుడికి భారీ నష్టం తప్పదు.

అంతేకాదు, వినియోగదారులు మూడు నెలల పాటు ఎలాంటి రీచార్జ్‌లు చేసుకోకుండా ఉంటే రావాల్సిన రిఫండ్‌ మనీ రూ.1500 వెనక్కి రాదు. అలాగే మూడేళ్ల పాటు సంవత్సరానికి కచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్‌ కచ్చితంగా చేసుకోవాలి.

ఒకవేళ మధ్యలోనే జియో ఫోన్‌ వెనక్కి ఇచ్చేయాలని ప్రయత్నిస్తే మరో బాదుడు భరించాల్సిందే. ఎందుకంటే ఫోన్ వెనక్కి ఇచ్చేయాలనుకున్న వారు అదనంగా పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఫోన్ కొన్నప్పటి నుంచి 12 నెలల లోపు దాన్ని వెనక్కి ఇచ్చేయాలనుకుంటే రూ.1500 , ప్లస్ జీఎస్‌టీ పెనాల్టీగా చెల్లించాలి. ఒకవేళ మొదటి సంవత్సరం వాడుకుని రెండో సంవత్సరం దాన్ని రిటర్న్ చెయ్యాలనుకుంటే రూ.1000 రూపాయలు ఫైన్‌‌ ప్లస్ జీఎస్‌టీ పెనాల్టీగా చెల్లించాలి.

ఇక మూడో సంవత్సరంలో 36 నెలలు పూర్తయ్యే లోపు జియో ఫోన్ ను వెనక్కి ఇచ్చేయాలనుకున్నట్లయితే.. రూ.500 ఫైన్ కట్టాలి. దీనికి కూడా జీఎస్టీ అదనం. ఈ నిబంధనలకు లోబడి మాత్రమే వినియోగదారుడు చెల్లించిన రూ.1500 తిరిగి వస్తాయి. ఈ వివరాలన్నీ జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.






Related News

mobile ivomi 5

ఇండియాకి రెండో స్థానం

Spread the loveప్ర‌పంచ‌లోనే మ‌న దేశానికి రెండో స్థానం ద‌క్కింది. సెల్యూలార్ ఫోన్ల త‌యారీలో ఇండియా దూసుకెళ్లింది. చైనా త‌ర్వాతిRead More

pinky-lalwani-vijaya-mallya

మూడో పెళ్లికి మాల్యా రెడీ..

Spread the loveదేశంలో బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టి లండ‌న్ లో కులాశాగా గ‌డుపుతున్న విలాస‌పురుషుడు విజ‌య్ మాల్యా మ‌రో సంచ‌ల‌నRead More

  • ఫేస్ బుక్ కి పెరుగుతున్న క‌ష్టాలు
  • ప్లాస్టిక్ నోట్లు వ‌స్తున్నాయ్…
  • పోర్బ్స్ లిస్టులో ఆయ‌నే టాప్
  • పడిపోయిన బంగారం ధరలు
  • మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు
  • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
  • వోడాఫోన్ బంపరాఫర్
  • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *