SBI కొత్త బాస్ ఖాయం చేశారు

Rajnish-Kumar-SBI
Spread the love

భారతీయ ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో దిగ్గజం లాంటి సంస్థకు కొత్త బాస్ ని ఖాయం చేశారు. ప్రస్తుత చైర్మన్ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త చైర్మన్ ని ఖరారు చేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ సంస్థ అయిన ‘స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా’కు కొత్త చైర్మన్ నియామకం పూర్తయ్యింది. వచ్చే వారంలో కొత్త చీఫ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటివరకూ ఎస్‌బీఐ చైర్మన్‌గా వున్న అరుంధతి భట్టాచార్య పదవీ కాలంలో ఈ వారంలో ముగియనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రజ్‌నీష్‌ కుమార్‌ను కొత్త చైర్మన్‌గా నియమిస్తూ బ్యాంకుల బోర్డు బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 1980లో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరిన రజ్‌నీష్‌ కుమార్‌… అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. అనేక డిపార్ట్‌మెంట్లలో పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉంది.

ఇటీవలే స్టేట్ బ్యాంక్ గ్రూప్ బ్యాంకులన్నీ ఏకీకరణ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఎస్బీఐ సామర్థ్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ రజనీష్ ఎలాంటి సంస్కరణలకు శ్రీకారం చుడతారో చూడాలి.






Related News

MODI

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the loveఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టుRead More

mobile

పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…

Spread the loveమొబైల్‌ వినియోగదారుల అభిరుచి మారుతోంది. మొదట్లో పోస్ట్ పెయిడ్ ని ఓ ప్రతిష్టకు కూడా చిహ్నంగా భావించినRead More

  • వోడాఫోన్ బంపరాఫర్
  • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
  • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
  • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
  • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
  • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *