ఆఫర్ పొడిగించిన జియో

reliance-jio
Spread the love

పండగ నేపథ్యంలో 4జీ వైఫై పరికరం ాజియోఫై్ణపై ఆ సంస్థ ఆఫర్‌ను పొడిగించింది. పండగ సీజన్‌ దృష్ట్యా దీనిపై వెయ్యి రూపాయల తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌ గత నెల 20 నుంచి 30 వరకు మాత్రమే అని తొలుత జియో ప్రకటించింది. తాజాగా ఆ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. వాస్తవానికి దీని ధర రూ.1999 కాగా పండగ సీజన్‌ నేపథ్యంలో రూ.1000 తగ్గింపుపై రూ.999కే జియో అందిస్తోంది. తాజాగా పొడిగించిన ఆఫర్‌ ఎప్పటి వరకు అనేది జియో పేర్కోలేదు.
జియోఫై ద్వారా అటు 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్లపైనా 4జీ వీవోఎల్‌టీఈ సేవలను పొందొచ్చు. జియో 4జీ వాయిస్‌యాప్‌ ద్వారా హెచ్‌డీ వాయిస్‌ కాల్స్‌తో పాటు, ఎస్సెమ్సెస్‌లు కూడా పంపుకోవచ్చు. పది వరకు స్మార్ట్‌ఫోన్లను, స్మార్ట్‌ టీవీలను అనుసంధానం చేసుకోవచ్చని జియో పేర్కొంది. ఇందులో ఉండే 2,300 ఎంఏహెచ్‌ బ్యాటరీతో సుమారు ఆరుగంటల వరకు పనిచేస్తుంది.






Related News

No-Annual-Fee-Credit-Cards

క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు

Spread the loveగతంలో బ్యాంకుల నుంచి ఖాతాదారుల ప్రత్యేక అభ్యర్థనపై అవసరాలకు రుణాలు తీసుకునే పద్ధతి మాత్రమే ఉండేది. ఖాతాదారుడిRead More

black money

లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..

Spread the loveపెద్ద నోట్ల రద్దు తర్వాత అ‍త్యధిక మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి, పన్ను రిటర్నులు దాఖలు చేయనిRead More

 • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
 • భారీగా పెరిగిన బంగారం ధరలు
 • కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…
 • 99రూ.లకే విమానయానం
 • జీఎస్టీ తగ్గింపు గుజరాత్ కోసమేనా?
 • పెట్రో వడ్డింపు సిద్ధం
 • బీఎస్ఎన్ఎల్ నయా ఆఫర్
 • SBI నుంచి గుడ్ న్యూస్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *