బ్యాంకులను ముంచిన డిజిటల్ ఇండియా

pos bank syping
Spread the love

కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ పేమెంట్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని తీసుకున్న చర్యలతో బ్యాంకులు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా పిఒఎస్‌ మిషన్ల ద్వారా కార్డు చెల్లింపుల వల్ల భారత బ్యాంకులు రూ.3,800 కోట్లు కోల్పోతున్నాయని ఒక నివేదికలో వెల్లడయ్యింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో నోట్ల రద్దు చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించింది. ఇందులో భాగంగా లక్షలాది పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పిఒఎస్‌) మిషన్లు మార్కెట్లలోకి వచ్చాయి. అప్పటి నుంచి బ్యాంకులు దాదాపుగా రెట్టింపు పిఒఎస్‌ మిషన్లను జారీ చేశాయి.

దేశంలో నోట్ల రద్దుకు ముందు 2016 మార్చి నాటికి 13.8 లక్షల పిఒఎస్‌ టర్మినల్స్‌ ఉండగా, 2017 జులై నాటికి ఈ సంఖ్య 28.4 లక్షలకు చేరింది. రోజుకు ప్రతీ బ్యాంకు సగటున 5,000 చొప్పున ఈ మిషన్లను జారీ చేసింది. పిఒఎస్‌లతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా 2016 అక్టోబర్‌లో ఈ చెల్లింపులు రూ.51,900 కోట్లుగా ఉన్నాయి. అదే జులై 2017లో ఈ చెల్లింపులు రూ.68,500 కోట్లుగా నమోదయ్యాయి. కాగా 2016 డిసెంబర్‌లో ఇవి ఏకంగా రూ.89,200 కోట్లకు ఎగిశాయి. ఈ పిఒఎస్‌ ‘ఆఫ్‌-అస్‌’ లావాదేవీల వల్ల దాదాపుగా రూ.4,700 కోట్ల వార్షిక నష్టాలు రావొచ్చని ఎస్‌బిఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. అయితే ఇందులో రూ.900 కోట్ల నికర రెవెన్యూ సమకూరనుందని పేర్కొంది. మిగితా రూ.3,800 కోట్లు బ్యాంకింగ్‌ పరిశ్రమ నష్టపోతుందని విశ్లేషించింది. పిఒఎస్‌ జారీ చేసిన బ్యాంకు, అదే బ్యాంకు కార్డు లావాదేవీ అయితే ‘ఆన్‌-అస్‌ ట్రాన్స్‌క్షన్‌’గా పేర్కొంటారు. అదే వేరే బ్యాంకు ఇచ్చిన పిఒఎస్‌, కార్డు స్వైప్‌ చేసిన బ్యాంకు వేరు అయితే ‘ఆఫ్‌-అస్‌’ లావాదేవీగా పేర్కొంటారు. పేమెంట్‌ కార్డు పరిశ్రమ నాలుగో పార్టీ పద్దతిలో ఉంటుందని పేర్కొంది. ఒక్క లావాదేవీలో జారీ బ్యాంకు, స్వాధీన బ్యాంకు, వ్యాపారస్తుడు, ఖాతాదారుడు నలుగురుంటారని తెలిపింది.

పిఒఎస్‌ టర్మినల్స్‌కు కావాల్సిన వ్యయం, మౌలిక వసతుల కల్పన, క్లియరింగ్‌, సెటిల్‌మెంట్‌ తదితర వ్యయాలు పూర్తిగా బ్యాంకుపైనే భారం పడుతుంది. కార్డుల జారీ, కార్డుదారుల సంబంధిత రిస్కులు, మోసాలను కూడా బ్యాంకరే భరించాల్సి ఉంటుంది. కాగా బ్యాంకులకు కేవలం నెలవారి అద్దెలు, ఎండిఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు) మాత్రమే వస్తాయి. డెబిట్‌ కార్డులపై ఎండిఆర్‌ 1 శాతంగా ఉండగా, క్రెడిట్‌ కార్డులపై ఇంతా అంటూ ఏమి లేదు. ఇవన్నిటితో స్థూలంగా ప్రతి ఏడాది బ్యాంకు పరిశ్రమకు రూ.3,800 కోట్ల నష్టాలు వస్తాయని ఎస్‌బిఐ రీసెర్చ్‌లో పేర్కొంది. డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించడానికి ముఖ్యంగా మెరుగైన టెలికం మౌలిక వసతులు అవసరమని పేర్కొంది. దీర్ఘకాలంలో పిఒఎస్‌ మిషన్ల లావాదేవీలకు ప్రభుత్వం మద్దతునివాల్సిన అవసరం ఉందని ఈ రిపోర్టు పేర్కొంది.


Related News

Airtel-4G

టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం

Spread the loveదేశీయ టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో కంపెనీల ఏకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోRead More

amazon

అమెజాన్ కే టోకరా..

Spread the loveఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌కు ఓ 21 ఏళ్ల యువకుడు భారీ మొత్తంలో కన్నం పెట్టాడు. ఏకంగాRead More

 • ఎఫ్ బీకి ఎండీ రాజీనామా
 • మళ్లీ టాప్ లోనే ముఖేష్ అంబానీ
 • SBI కొత్త బాస్ ఖాయం చేశారు
 • ఆఫర్ పొడిగించిన జియో
 • బ్యాంకులను ముంచిన డిజిటల్ ఇండియా
 • షాకిచ్చిన జియో మొబైల్
 • మూడేళ్లలో 5జీ
 • ఫోర్బ్ లిస్టులో ముగ్గురు దిగ్గజ భారతీయులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *