ప్లాస్టిక్ నోట్లు వ‌స్తున్నాయ్…

10_rupee_notes-1
Spread the love

కేంద్రం మ‌రో అడుగు వేస్తోంది. ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దు త‌ర్వాత 2వేల నోటు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్లాస్టిక్ నోట్లు ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌య‌త్నం ప్రారంభించింది. త్వ‌ర‌లోనే మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్టు చెబుతోంది. తొలుత ప్లాస్టిక్ ప‌ది రూపాయాల నోట్లు రంగంలోకి రాబోతున్నాయి. ప్రయోగాత్మకంగా ఐదు నగరాల్లో వీటిని తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి రాధా కష్ణన్‌ లోక్‌ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ‘రూ.10 విలువ గల ప్లాస్టిక్‌ నోట్లను ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా తీసుకు రావా లని నిర్ణయించాం. కోచి, మైసూర్‌, జయపుర, సిమ్లా, భువనేశ్వర్‌ నగరాల్లో వీటిని ప్రయోగాత్మకంగా చలామణీ లోకి తీసుకొస్తాం’ అని రాధాక ష్ణన్‌ తెలిపారు. అయితే ఎప్పుడు తీసుకురానున్నది మాత్రం వెల్లడించలేదు.

ఇక రూ.2000 నోట్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రూ.2వేల నోట్ల చలామణీని నిలిపివేయా లనే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పారు. 2016 నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ. 2000 నోటును ప్రవేశ పెట్టారు. దీంతో చిల్లర సమ స్యలు ఏర్పడ టంతో రూ.500 కొత్త నోట్లను కూడా విడుదల చేశారు. అయితే రూ.2వేల నోట్లను మళ్లీ వెనక్కి తీసుకుంటా రని, వాటి ముద్రణను కూడా నిలిపివేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్రభుత్వం అనేకసార్లు తోసిపుచ్చింది. రూ.2వేల నోట్ల చలామణీని నిలిపివేయడం లేదని పలుమార్లు స్పష్టం చేసింది. దాంతో ఊహాగానాల‌కు చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది.


Related News

mobile ivomi 5

ఇండియాకి రెండో స్థానం

Spread the loveప్ర‌పంచ‌లోనే మ‌న దేశానికి రెండో స్థానం ద‌క్కింది. సెల్యూలార్ ఫోన్ల త‌యారీలో ఇండియా దూసుకెళ్లింది. చైనా త‌ర్వాతిRead More

pinky-lalwani-vijaya-mallya

మూడో పెళ్లికి మాల్యా రెడీ..

Spread the loveదేశంలో బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టి లండ‌న్ లో కులాశాగా గ‌డుపుతున్న విలాస‌పురుషుడు విజ‌య్ మాల్యా మ‌రో సంచ‌ల‌నRead More

 • ఫేస్ బుక్ కి పెరుగుతున్న క‌ష్టాలు
 • ప్లాస్టిక్ నోట్లు వ‌స్తున్నాయ్…
 • పోర్బ్స్ లిస్టులో ఆయ‌నే టాప్
 • పడిపోయిన బంగారం ధరలు
 • మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు
 • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
 • వోడాఫోన్ బంపరాఫర్
 • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *