Main Menu

ఢ‌మాల్ అంటున్న పెట్రో ధ‌ర‌లు

Spread the love

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెట్రో ధ‌ర‌లు వేగంగా ప‌డిపోతున్నాయి. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ దిగివ‌చ్చాయి. తాజాగా బ్యారెల్ ధ‌ర ఏకంగా 50 డాలర్లకు పడిపోయింది. పెట్రోలియం ఎగుమతి దేశాలు (ఒపెక్‌) మిగులు చమురును మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించడం, ఒపెక్‌తో పాటు రష్యా కూడా ఉత్పత్తిని తగ్గించుకోవడానికి ముందుకు వచ్చిందన్న అంచనాలు చమురు ధర పడిపోవడానికి కారణమయ్యింది. ప్రస్తుత నవంబర్‌లో ఇప్పటి వరకు చమురు ధరలు 22 శాతం పతనమయ్యాయి. 2008 సంక్షోభం తర్వాత ఒకే నెలల ఈ స్థాయిలో చమురు ధరలు పడిపోవడం ఇదే తొలిసారి. వచ్చే వారం వియన్నలో చమురు సరఫరాపై ఒపెక్‌-ఒపెకేతర ఉత్పత్తి దేశాల ప్రతినిధులు భేటీ కానున్నారు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా దిగివస్తున్నప్పటికీ భారత్‌లో ఇంకా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగడం గమనార్హం. ప్రభుత్వానికి ధరలు పెంచడంలో ఉన్న వేగం, తగ్గించడంలో లేదనే విమర్శలు పెరిగాయి. ఇంకా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80 చేరవలోనే ఉండటం గమనార్హం. ఎన్నిక‌ల ముంగిట కూడా ప్ర‌జ‌ల‌కు భారం త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం సిద్ధం కాక‌పోగా, అద‌నంగా ప‌న్నులు వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.






Related News

రికార్డ్ రేటులో బంగారం

Spread the loveదేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి,Read More

జీ కోసం క‌న్నేసిన జియో

Spread the loveఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కన్నేసింది. చౌక చార్జీలతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *