పేటీఎం మాల్ మెగాసేల్

Paytm-Mall-Bazaar-Online-Alibaba
Spread the love

ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు పోటీగా పేటీఎం మాల్‌ కూడా మెగా సేల్‌ ఈవెంట్‌ను ప్రకటించింది. మెరా క్యాష్‌ బ్యాక్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహించే తేదీల్లోనే పేటీఎం మాల్‌ కూడా ఈ మెగా సేల్‌ ఈవెంట్‌కు తెరలేపబోతుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్‌ నిర్వహించనుంది. ఈవెంట్‌లో భాగంగా రూ.501 కోట్ల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను కంపెనీ అందించనున్నట్టు ప్రకటించింది. కొత్తగా 50 లక్షల మంది కొనుగోలుదారులను ఆకర్షించాలనే లక్ష్యంగా ఈ సేల్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ ఫోన్లు, ఫ్యాషన్‌ ప్రొడక్ట్‌లు, ఇతర ఉత్పత్తులపై 15 శాతం నుంచి 100 శాతం వరకు పేటీఎం మాల్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందించనుంది. స్మార్ట్‌ఫోన్లపై రూ.15వేల వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, పెద్ద పెద్ద అప్లియెన్స్‌ టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది.
25 మంది ఫోన్‌ కొనుగోలుదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ బహుమతిగా అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా నాలుగు రోజుల సేల్‌లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్‌ను కూడా ప్రకటించింది. పేటీఎం మాల్‌ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్‌ ఇదేనని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ సిన్హా తెలిపారు. తమ భాగస్వామ్య బ్రాండులు, మెర్చంట్లతో కలిసి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించనున్నట్టు చెప్పారు. ఆపిల్‌, జేబీఎల్‌, ఉడ్‌ల్యాండ్‌, టైమెక్స్‌లు ఈ సేల్‌లో టాప్‌ బ్రాండులుగా ఉన్నాయి. తమ విక్రయాలను పెంచుకోవడానికి రిటైలర్లతో కూడా పేటీఎం మాల్‌ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ కంపెనీ ఇటీవలే అలీబాబా, ఎస్‌ఏఐఎఫ్‌ పార్టనర్ల నుంచి ఫండ్స్‌ సేకరించింది.






Related News

No-Annual-Fee-Credit-Cards

క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు

Spread the loveగతంలో బ్యాంకుల నుంచి ఖాతాదారుల ప్రత్యేక అభ్యర్థనపై అవసరాలకు రుణాలు తీసుకునే పద్ధతి మాత్రమే ఉండేది. ఖాతాదారుడిRead More

black money

లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..

Spread the loveపెద్ద నోట్ల రద్దు తర్వాత అ‍త్యధిక మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి, పన్ను రిటర్నులు దాఖలు చేయనిRead More

  • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…
  • 99రూ.లకే విమానయానం
  • జీఎస్టీ తగ్గింపు గుజరాత్ కోసమేనా?
  • పెట్రో వడ్డింపు సిద్ధం
  • బీఎస్ఎన్ఎల్ నయా ఆఫర్
  • SBI నుంచి గుడ్ న్యూస్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *