Main Menu

రూ. 99కే బంప‌రాఫ‌ర్ నోకియా

Spread the love

దసరా..దీపావళి..పండుగల నేపథ్యంలో పలు కంపెనీలు పోటా పోటీ పడుతున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్‌‌లో కొనుగోళ్లు దుమ్ము రేపుతున్నాయి. అమెజాన్..ఫ్లిప్ కార్డులు పోటా పోటీ పడుతున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకొనేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

నోకియా కూడా వినియోగదారులను ఆకట్టుకొనే పనిలో పడింది. ఏకంగా కేవలం రూ. 99 డౌన్ పేమెంట్ చెల్లించి సులభ వాయిదా పద్దతుల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ తీసుకెళ్లవచ్చని పేర్కొంటోంది. ఈ ఆఫర్ కావాలంటే మాత్రం దగ్గరలోని జియో డిజిటల్ లైఫ్, క్రోమా స్టోర్స్‌లో సంప్రదించాలని కంపెనీ పేర్కొంటోంది. నవంబర్ 10వ తేదీ వరకు ఈ ఆపర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉన్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ పేర్కొంది. నోకాస్ట్‌ ఈఎంఐలో నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్‌ను ఇటీవలే లాంచ్‌ చేసింది.






Related News

మారుతీ కార్ల ధ‌ర‌ త‌గ్గింపు

Spread the loveమారుతీ సుజుకీ ఎంపిక చేసిన కొన్ని కార్లపై భారీ తగ్గింపును అందిస్తున్నట్టుగా ప్రకటించింది. మారుతీ సుజుకీ ప్రధానRead More

ఏప్రిల్‌ చివరికి శాంసంగ్‌ న్యూ మోడ‌ల్ ఫోన్

Spread the loveశాంసంగ్‌ త్వరలోనే భారత్‌లో ఫోల్డబుల్‌ (మడతపెట్టే) స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. అయితే ఎక్కువసార్లు మడతబెడితే ఈ ఫోన్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *