నోట్లరద్దుతో డిజిటల్ ప్రయోజనం కూడా లేదు

bribe-cash_87bce4c6-12cf-11e6-8267-dc0f985e6284
Spread the love

నోట్లరద్దును సమర్థించుకుంటూ మోడీ ప్రభుత్వం మొదటి నుంచీ భిన్న వ్యాఖ్యలు చేస్తూనే వుంది. మొదట్లో నోట్లరద్దుతో నల్లధన కుబేరులు గజగజలాడిపోతున్నారంటూ గొప్పలు చెప్పుకున్న కేంద్రం…తాజాగా 99 శాతం నోట్లు వెనక్కి వచ్చాయంటూ ఆర్‌బిఐ ప్రకటించిన తరువాత మాటమార్చింది. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగానే నోట్లురద్దు చేశామని, డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇటీవల వివరణ ఇచ్చారు. అయితే డిజిటల్‌ చెల్లింపులపై నోట్లరద్దు ప్రభావం తాత్కాలికంగానే ఉందని, తరువాత అందరూ నగదు చెల్లింపులపైనే ఆధారపడుతున్నారని తాజా గణాంకాల ప్రకారం వెల్లడైంది.

గతేడాది నవంబరు 8న రూ.500, రూ.వెయ్యి నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో డిసెంబరులో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. ఆ ఒక్క నెలలోనే రూ.1044 లక్షల కోట్ల విలువైన డిజిటల్‌ చెల్లింపులు జరిగాయి. తరువాతి కాలంలో రూ.500, రూ.వెయ్యి కొత్త నోట్లు చలామణీలోకి రావడంతో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది జూలైలో రూ.107 లక్షల కోట్లకు పడిపోయాయి. నోట్లరద్దుకు ముందు జరిగిన లావాదేవీల కంటే ఇది తక్కువని గణాంకాలు వెల్లడించాయి. గతేడాది నవంబరులో 67.1 కోట్లగావున్న డిజిటల్‌ లావాదేవీలు డిసెంబరు నాటికి 95.7 కోట్లకు చేరుకున్నాయి. అయితే అదే ఏడాది సెప్టెంబరులో వాటి సంఖ్య 145.2 కోట్లుగా ఉండటం విశేషం. ఈ-కామర్స్‌ కంపెనీలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఆన్‌లైన్‌ దుస్తుల వ్యాపార దిగ్గజం మింత్ర సిఇఒ మాట్లాడుతూ ”నోట్లరద్దుకు ముందు 40 శాతం వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేసేవారు. నోట్లరద్దు అనంతరం ఆ సంఖ్య 55 శాతానికి పెరిగింది. మళ్లీ ఇప్పుడు 45-46 శాతానికి పడిపోయింది” అని చెప్పారు.


Related News

gold

పడిపోయిన బంగారం ధరలు

Spread the loveఅంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో దేశీయంగా ఓవైపు సెన్సెక్స్ పతనం అవుతోంది. బడ్జెట్ తర్వాత రోజురోజుకీ దిగువకు పడిపోతుంది.Read More

MODI

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the loveఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టుRead More

 • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
 • వోడాఫోన్ బంపరాఫర్
 • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
 • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
 • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
 • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
 • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
 • భారీగా పెరిగిన బంగారం ధరలు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *