మార్కెట్లో 200..

200 note
Spread the love

కొత్త నోటు మార్కెట్లోకి వస్తోంది. ఇటీవలే 2000 నోటు ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా 200 నోటును రంగంలోకి తెచ్చింది. శుక్రవారం నుంచి కొత్త రూ.200 నోటు చ‌లామణీలోకి రానున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. నవంబరు 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల కానున్న మూడో నోటు ఇది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. ఈ నోటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులు, ఆర్బీఐ కార్యాల‌యాల్లో రేప‌టి నుంచి అందుబాటులోకి రానుంది.

పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల తర్వాత ఎదురవుతున్న చిల్లర సమస్యలను కూడా రూ.200 నోటు కారణంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అక్రమ నగదు చెలామణీ.. నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రూ.200నోటును ముద్రిస్తున్నట్లు గతంలోనే ఆర్బీఐ ప్రకటించింది.


Related News

gold

భారీగా పెరిగిన బంగారం ధరలు

Spread the loveబంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో, బంగారానికి డిమాండ్‌ పెరిగింది. దీంతోRead More

black money

కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…

Spread the loveభారత్‌లో మొత్తం 2.45 లక్షల మంది కోటీశ్వరులున్నారు. వారి సంపద విలువ 5 లక్షల కోట్ల డాలర్లుRead More

 • 99రూ.లకే విమానయానం
 • జీఎస్టీ తగ్గింపు గుజరాత్ కోసమేనా?
 • పెట్రో వడ్డింపు సిద్ధం
 • బీఎస్ఎన్ఎల్ నయా ఆఫర్
 • SBI నుంచి గుడ్ న్యూస్
 • అమెజాన్ లో శ్యామ్ సంగ్ ఆఫర్ల వెల్లువ
 • వొడాఫోన్‌ సూపర్‌ ప్లాన్‌
 • టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *