పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…

mobile
Spread the love

మొబైల్‌ వినియోగదారుల అభిరుచి మారుతోంది. మొదట్లో పోస్ట్ పెయిడ్ ని ఓ ప్రతిష్టకు కూడా చిహ్నంగా భావించిన వాళ్లు ఇప్పుడు మారిపోతున్నారు. పోస్ట్ పెయిడ్ ని వదులుకుంటున్నారు. దాంతో ప్రీ పెయిడ్ కస్టమర్లు అనూహ్యంగా పెరుగుతున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.

గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పోస్టు పెయిడ్‌ ఖాతాదారులు మరో 2 శాతం తగ్గారని అంచనా. దీంతో కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలికం రంగంలో ప్రీపెయిడ్‌ ఖాతాదారుల సంఖ్య 95.6 శాతానికి చేరింది. అదే ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఈ వాటా 95.52 శాతంగా ఉంది. ఇదే కాలంలో 5.17 కోట్ల మంది పోస్టుపెయిడ్‌ వినియోగదారులున్నారని టెలికం రెగ్యూలేటరీ ఈ మధ్య కాలంలో ఒక నివేదికలో తెలిపింది. ఇంతక్రితం వినియోగదారులతో పోల్చితే 1.84 శాతం తగ్గారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లోని కేటగిరి ఎ, బి సర్కిళ్లలో పోస్టుపెయిడ్‌ ఖాతాదారులు క్రమంగా తగ్గిపోతున్నారు.

కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పోస్టు పెయిడ్‌ సెగ్మెంట్‌ రెవెన్యూ 10 శాతం క్షీణించి రూ.5,900 కోట్లకు పరిమితమయ్యిందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ కొటాక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇదే సమయంలో ప్రీపెయిడ్‌ రెవెన్యూ 9 శాతం పెరిగి రూ.24,000 కోట్లకు చేరింది. 2015-16లో పోస్టుపెయిడ్‌ రెవెన్యూ 30-40 శాతం పడిపోతే, ప్రస్తుతం మరో 20 శాతం మేర క్షీణించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా టెలికం కంపెనీలు పోస్టు పెయిడ్‌ ఖాతాదారులను ఆకర్షించి రెవెన్యూ పెంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే ప్రీపెయిడ్‌ విభాగంలో ఆకర్షణీయ ఆఫర్లు రావడంతో ఖాతాదారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై మరింత ఆర్ధిక ఒత్తిడి నెలకొననుందని విశ్లేషిస్తున్నారు.


Related News

MODI

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the loveఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టుRead More

mobile

పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…

Spread the loveమొబైల్‌ వినియోగదారుల అభిరుచి మారుతోంది. మొదట్లో పోస్ట్ పెయిడ్ ని ఓ ప్రతిష్టకు కూడా చిహ్నంగా భావించినRead More

 • వోడాఫోన్ బంపరాఫర్
 • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
 • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
 • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
 • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
 • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
 • భారీగా పెరిగిన బంగారం ధరలు
 • కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *