Main Menu

ముకేష్ అంబానీ గంట సంపాద‌న ఎంత‌?

Spread the love

దేశంలోని ధ‌న‌వంతుల జాబితాలో మ‌ళ్లీ ఆయ‌నే మొద‌టి స్థానంలో నిలిచారు.తాజాగా ఫోర్బ్స్ విడుద‌ల జాబితాలో అత్యంత సంప‌న్నులైన భార‌తీయ లిస్టులో రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అంబానీకే ఆధిక్యం కొన‌సాగింది. వరుసగా 11వ ఏడాది ముకేశ్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ఈయన సంపద రూ. 3.49లక్షల కోట్లు. ఈ ఒక్క ఏడాదే ముకేశ్‌ సంపద రూ. 68వేల కోట్లు పెరిగడం విశేషంగా మారింది. అంటే ప్ర‌తీ నెలా ఆయ‌న ఆస్తి సుమారుగా 6 కోట్ల రూపాయలు చొప్పున పెరుగుతోంది. ఈ లెక్క‌న చూస్తే రోజుకి 20ల‌క్ష‌ల చొప్పున ముఖేష్ అంబానీ ఆదాయం పెరుగుతున్న‌ట్టు ఫోర్భ్ వివ‌రించింది. నిద్ర‌పోయే స‌మ‌యం మిన‌హాయిస్తే సుమారుగా గంట‌కు ల‌క్ష రూపాయ‌ల ఆదాయం ముఖేష్ కి పెరిగిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

ఇక ఈ ఏడాది మిలియ‌నీర్ల లిస్టులో విప్రో ఛైర్మన్‌ అజిమ్‌ ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ రూ. 1.55లక్షల కోట్లు. దాంతో రెండో స్థానంలో అజీమ్ ప్రేమ్ జీకి రెట్టింపు ఆస్తి ముఖేష్ అంబానీకి ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత రూ. 1.35లక్షల కోట్లతో ఏర్సెలార్ మిట్ట‌ల్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిట్ట‌ల్‌ మూడో స్థానంలో నిలిచారు.

మొత్తం 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్‌ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది వీరి మొత్తం సంపద 492 బిలియన్‌ డాలర్లు. టాప్ 11మందికే ఈ ఏడాది 1బిలియ‌న్ ఆదాయం అద‌నంగా ద‌క్కింద‌ని ఫోర్బ్ పేర్కొన‌డం విశేషం. అదే స‌మ‌యంలో టాప్ 100లో కేవ‌లం న‌లుగురు మాత్ర‌మే మహిళ‌లున్నారు. వీరిలో బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా రూ. 26వేల కోట్లతో 39వ స్థానంలో నిలిచారు.

టాప్‌ 10 సంపన్నులు వీరే..

1. ముకేశ్‌ అంబానీ(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌)

2. అజిమ్‌ ప్రేమ్‌జీ(విప్రో)

3. లక్ష్మీ మిత్తల్‌(ఏర్సెలార్‌ మిత్తల్‌)

4. హిందుజా బ్రదర్స్‌(అశోక్‌ లేల్యాండ్‌)

5. పల్లోంజీ మిస్త్రీ(షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌)

6. శివ్‌ నాడార్‌(హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌)

7. గోద్రేజ్‌ కుటుంబం(గోద్రేజ్‌ గ్రూప్‌)

8. దిలీప్‌ సంఘ్వీ(సన్‌ఫార్మా ఇండస్ట్రీస్‌)

9. కుమార్‌ బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్‌)

10. గౌతమ్‌ అదానీ(అదానీ పోర్ట్స్‌)






Related News

ఢ‌మాల్ అంటున్న పెట్రో ధ‌ర‌లు

Spread the loveప్ర‌పంచ‌వ్యాప్తంగా పెట్రో ధ‌ర‌లు వేగంగా ప‌డిపోతున్నాయి. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ దిగివ‌చ్చాయి. తాజాగా బ్యారెల్ ధ‌ర ఏకంగాRead More

ఫేస్ బుక్ చుట్టూ రాజ‌కీయ‌ ప్ర‌కంప‌న‌లు

Spread the loveఫేస్ బుక్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. అధికార పార్టీకి అండ‌గా ఉంటూ, అనేక స‌మ‌స్య‌ల‌కు ఫేస్ బుక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *