మళ్లీ టాప్ లోనే ముఖేష్ అంబానీ

భారత్లో అత్యంత సంపన్నుడు ఎవరో తెలుసా? ఇంకెవరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి ముఖేశ్ అంబానీ. 2017 సంవత్సరానికిగానూ దేశంలో 100 మంది అత్యంత సంపన్నుల వార్షిక జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఇందులో 38 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ భారత్ జాబితాలో టాప్లో ఉన్నారు. కాగా.. వరుసగా పదో సారి ముఖేశ్ ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
గతేడాది జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేశ్ అంబానీ ఈ ఏడాది ఆయన సంపదను మరో 15.3 బిలియన్ డాలర్లు పెంచుకున్నారు. అంతేగాక ఆసియాలో మొదటి ఐదుగురు అత్యంత సంపన్నుల్లో ముఖేశ్ అంబానీ కూడా ఉన్నారు. ఇక వరుసగా పదోసారి దేశంలో అత్యంత ధనికుడిగా స్థానం సంపాదించారు. ఇక ఈ జాబితాలో టెక్ మొఘల్, విప్రో ఛైర్మన్ అజిమ్ ప్రేమ్జీ రెండోస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 19 బిలియన్ డాలర్లు.
ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 సంపన్నులు వీరే..
1. ముఖేశ్ అంబానీ(38 బిలియన్ డాలర్లు)
2. అజిమ్ ప్రేమ్జీ(19 బిలియన్ డాలర్లు)
3. హిందుజా బ్రదర్స్(18.4 బిలియన్ డాలర్లు)
4. లక్ష్మీ మిత్తల్(16.5 బిలియన్ డాలర్లు)
5. పల్లోంజి మిస్త్రీ(16 బిలియన్ డాలర్లు)
6. గోద్రేజ్ ఫ్యామిలీ(14.2 బిలియన్ డాలర్లు)
7. శివ నాడార్(13.6 బిలియన్ డాలర్లు)
8. కుమార బిర్లా(12.6 బిలియన్ డాలర్లు)
9. దిలిప్ సంఘ్వీ(12.1 బిలియన్ డాలర్లు)
10. గౌతమ్ అదానీ(11 బిలియన్ డాలర్లు)
Related News

ఇండియాకి రెండో స్థానం
Spread the loveప్రపంచలోనే మన దేశానికి రెండో స్థానం దక్కింది. సెల్యూలార్ ఫోన్ల తయారీలో ఇండియా దూసుకెళ్లింది. చైనా తర్వాతిRead More

మూడో పెళ్లికి మాల్యా రెడీ..
Spread the loveదేశంలో బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్ లో కులాశాగా గడుపుతున్న విలాసపురుషుడు విజయ్ మాల్యా మరో సంచలనRead More