Main Menu

ఆర్థిక సంక్షోభంలో జెట్ ఎయిర్ లైన్స్!

Spread the love

కింగ్ ఫిషర్ ఆర్థిక సంక్షోభంలో పడింది. దేశంలోనే రెండో పెద్ద విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్ వేస్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బాటలోనే సాగుతోందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇంధనం ధరలు పెరగడం, విమానయాన రంగంలో తక్కువ చార్జీలతో విమానాలు నడుపుతున్న ఇండిగో వంటి సంస్థలతో పోటీ పడలేకపోతున్న జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ 110 కోట్ల డాలర్ల మేర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. భారత కరెన్సీ ప్రకారం జెట్ ఎయిర్ వేస్ అప్పులు 7.85లక్షల కోట్ల మేర ఉన్నాయి. దీంతో జెట్ ఎయిర్ వేస్ అప్పులకు వడ్డీలే కాదు, సంస్థలో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఒకవేళ సంస్థ దివాలా తీస్తే..అందులో పని చేసే 23 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారడం ఖాయం. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ పరిస్థితి గమనిస్తే 2011 కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఎదుర్కొన్న పరిస్థితి గుర్తుకు వస్తున్నదని ఆ కథనం పేర్కొంది. అప్పట్లో మన్మోహన్ సింగ్ సర్కార్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. అవి ముందుకు వచ్చినా కింగ్ ఫిషర్ పతనాన్ని నిలువరించలేకపోయాయి. అలాగే ప్రస్తుత మోడీ సర్కార్ కూడా జెట్ ఎయిర్ వేస్ ను ఆదుకోవలసిందిగా టాటా సంస్థను కోరినప్పటికీ ఫలితం లేకపోయింది.






Related News

రికార్డ్ రేటులో బంగారం

Spread the loveదేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి,Read More

జీ కోసం క‌న్నేసిన జియో

Spread the loveఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కన్నేసింది. చౌక చార్జీలతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *