అలెర్ట్: ప్రపంచమంతా ఇంటర్నెట్ బంద్!

ప్రపంచ వ్యాప్తంగా నెట్ షట్ డౌన్ కాబోతోంది. రాబోయే 48 గంటల్లో కలకలం రేగబోతోంది. లోకమంతా ఇంటర్నెట్ నడుస్తున్న సమయంలో సకల సేవలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని రష్యా టుడే వెల్లడించింది. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సహా బ్యాంక్ లావాదేవీల వంటి అన్ని రకాల పనులకు ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారం. అలాంటి కమ్యూనికేషన్ మాధ్యమం హఠాత్తుగా కట్ అయితే ప్రపంచం అతలాకుతలం అయ్యే ప్రమాదం కూడా ఉందని సమాచారం.
దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులంతా నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కోబోతున్నందున దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాలని సదరు సంస్థ సూచిస్తోంది. అప్ డేట్స్, మెయింటెనెన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా మూల సర్వర్లు రిపేర్ల కోసమే తాత్కాలికంగా నెట్ వర్క్ నిలిచిపోబోతున్నట్టు చెబుతున్నారు. అంతేగాకుండా పెరుగుతున్న సైబర్ నేరాల అదుపు కోసం అదనపు భద్రతలో భాగంగా కొన్ని ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినప్పటికీ అప్ డేట్ చేయడానికి పూనుకున్నట్టు సీఆర్ఏ చెబుతోంది.
గ్లోబల్ సర్వీసుల యాక్సెస్ సహా అన్ని కార్యక్రమాలలోనూ పలు ఆటంకాలు తప్పవనే వాదన వినిపిస్తోంది. 48 గంటల పాటు ఈ సేవల్లో పలు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున దానికి తగ్గట్టుగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దాంతో ఇప్పుడీ సమాచారం సంచలనం అవుతోంది.
Related News

రికార్డ్ రేటులో బంగారం
Spread the loveదేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి,Read More

జీ కోసం కన్నేసిన జియో
Spread the loveఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్పై టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కన్నేసింది. చౌక చార్జీలతోRead More