Main Menu

పడిపోయిన బంగారం ధరలు

gold
Spread the love

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో దేశీయంగా ఓవైపు సెన్సెక్స్ పతనం అవుతోంది. బడ్జెట్ తర్వాత రోజురోజుకీ దిగువకు పడిపోతుంది. తాజాగా బంగారం ధరలు కూడా తగ్గుదల నమోదు చేసుకున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్ లో 10గ్రాముల బంగారం 600 రూ.ల వరకూ తగ్గింది. మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. పది గ్రాముల బంగారం ధర రూ.30,950 వద్ద ట్రేడయింది.

స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా ధరల పతనానికి కారణమని బులియన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధరలు కూడా మరోసారి రూ.39 వేల మార్కుకు దిగువన ట్రేడయ్యాయి. రూ.450 మేర తగ్గడంతో కిలో వెండి ధర రూ.38,900గా ఉంది. పరిశ్రమలు, కాయిన్ తయారీదారులు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు వ్యాపారులు చెబుతున్నారు.






Related News

atm

ఏటీఎంలు మూత‌..

Spread the loveకంగారు ప‌డ‌కండి. మొత్తం ఏటీఎంలు మూత కాదు. రాత్రి పూట నిర్ధిష్ట స‌మ‌యాల్లో ఏటీఎంలు మూత‌వేసే ప్ర‌ణాళికRead More

fb

ఫేస్ బుక్ కి కొత్త చిక్కులు

Spread the loveఫేస్ బుక్ యాజమాన్యం వరుస సమస్యల్లో ఇరుక్కుంటోంది. కేంబ్రిడ్జ్ ఎనలటికా సమస్య నుంచి గట్టెక్కకముందే మరో లీకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *