అమాంతంగా పెరిగిన బంగారం ధర

gold
Spread the love

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధరలు తారాస్థాయికి దూసుకెళ్లాయి. పది గ్రాముల బంగారం ధర ఒకేసారి 990 రూపాయలు పెరిగి 31,350 రూపాయలకు చేరుకుంది. గత పది నెలల్లో ఇదే అత్యధిక స్థాయి పెరుగుదల. గత రెండు రోజుల్లో 240 రూపాయలు తగ్గిన బంగారం ధర తాజాగా స్థానిక నగల వర్తకుల నుంచి కొనుగోళ్లు భారీగా పెరగడంతో 10 నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. దీంతో అక్టోబర్‌లో డెలివరీ అయ్యే పసిడి అమ్మకాలు మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజి (ఎంసిఎక్స్)లో 98 రూపాయలు (0.32 శాతం) పెరిగి పది గ్రాములకు 30,380 రూపాయలకు చేరుకుంది.

ఉత్తర కొరియా అణుపరీక్షలతో ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతుండటం, అలాగే అమెరికా ఉపాధి గణాంకాల ఆశించిన దానికంటే బలహీనంగా ఉడి డాలర్ మారకం విలువ పతనమవడంతో శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు అత్యంత గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లాయి. బలహీనంగా ఉన్న ఉపాధి గణాంకాలకు తోడుగా ఇల్మా హరికేన్ (పెను తుపాను) అమెరికాలో తీవ్రమైన బీభత్సాన్ని సృష్టించబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో 2015 తర్వాత డాలర్ విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి పతనమవడంతో మదుపరుల్లో సెంటిమెంట్ భారీగా పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడాది కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి ఎగబాకాయని నిపుణులు చెబుతున్నారు.


Related News

gold

పడిపోయిన బంగారం ధరలు

Spread the loveఅంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో దేశీయంగా ఓవైపు సెన్సెక్స్ పతనం అవుతోంది. బడ్జెట్ తర్వాత రోజురోజుకీ దిగువకు పడిపోతుంది.Read More

MODI

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the loveఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టుRead More

 • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
 • వోడాఫోన్ బంపరాఫర్
 • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
 • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
 • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
 • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
 • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
 • భారీగా పెరిగిన బంగారం ధరలు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *