Main Menu

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the love

ఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణనశాఖ సీఎస్‌వో తేల్చి చెప్పడంతో మోడీ సర్కార్‌ ఇరకాటంలో పడినట్టేనని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచీ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్నట్టు వారు విశ్లేషించారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు సమర్పించనున్న బడ్జెట్‌పై గణనశాఖ వెల్లడించిన వాస్తవాలు ప్రభావం చూపనున్నట్టు వారు చెబుతున్నారు.

2017-18 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.5 శాతం ఉండనున్నట్టు ముంబయిలోని నిర్మల్‌బ్యాంగ్‌ ఈక్విటీస్‌ ప్రయివేట్‌కు చెందిన ఆర్థికవేత్త తెరిసాజాన్‌ తెలిపారు. ఇది అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన అంచనా 3.2 శాతంకన్నా అధికం కావడం గమనార్హం. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాలు పరిశీలించినా ఈ అంచనా సరైందిగానే భావించకతప్పదు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ చివరికల్లా ఏడాది కాలానికి బడ్జెట్‌లో చెప్పిన ద్రవ్యలోటులో 96శాతానికి చేరుకున్నది. అక్టోబర్‌ చివరికల్లా ద్రవ్యలోటు రూ. 5.25 లక్షల కోట్లు. అదే కాలానికి రెవెన్యూ ఆదాయం రూ.7.29 లక్షల కోట్లు. పభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.12.92 లక్షల కోట్లు. నవంబర్‌ చివరికల్లా ద్రవ్యలోటు బడ్జెట్‌లో చెప్పినదానికి 12 శాతం(3.2 శాతం+3.2లో 12 శాతం) అధిగమించింది. మిగతా(డిసెంబర్‌ నుంచి) నాలుగు నెలల్లో అంచనాకన్నా రవెన్యూ రాబడి పెరిగితే తప్ప ద్రవ్యలోటు మరింత భారంగా మారే అవకాశమూ లేకపోలేదు.

బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలకన్నా ఖర్చు ఎక్కువ, రెవిన్యూ రాబడి తక్కువ కావడమే ఈ పరిస్థితికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
విధానపరమైన అనిశ్చితి వల్ల ప్రయివేట్‌ పెట్టుబడులు తగ్గినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉత్పాదక రంగాల్లో నూతన పెట్టుబడులకు అనుకూలత లేకపోవడమే ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని కేంద్ర ప్రభుత్వ మేధోమథన సంస్థ సీఎంఐఈ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మహేశ్‌వ్యాస్‌ అన్నారు. వచ్చే ఏడాది(2019)లో సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాదిలో 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా ఆర్థికవృద్ధి క్షీణించడంపై సీఎస్‌వో వెల్లడించిన వాస్తవాలు మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Related News

మీ కార్డులు మార్చుకోవాల్సిందే..!!

Spread the love1Shareఆర్బీఐ కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. వ‌చ్చే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ నుంచి ప్రారంభించ‌బోతోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల విష‌యంలోRead More

పాతాళానికి ప‌త‌నం దిశ‌లో రూపాయి..

Spread the loveఇండియ‌న్ రూపాయి ప‌త‌నం పాతాళానికి ప‌డిపోతున్న‌ట్టుగా ఉంది. రూపాయి విలువ రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనమతున్న తీరుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *