ఎఫ్ బీకి ఎండీ రాజీనామా

Facebook-India-MD
Spread the love

ఫేస్‌బుక్ ఇండియా ఎండీ ఉమంగ్ బేడీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మంగళవారం ఆ సంస్థ వెల్లడించింది. ఆయన స్థానంలో సౌత్ ఏషియా కన్జూమర్ అండ్ మీడియా డైరెక్టర్ సందీప్ భూషణ్‌ను తాత్కాలిక ఎండీగా నియమించినట్లు చెప్పింది. ఈ ఏడాది చివర్లో ఉమంగ్ బేడీ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. తన హయాంలో ఆయన బలమైన టీమ్‌ను, వ్యాపారాన్ని విస్తరించగలిగారు. ఆయనకు ఆల్ ద బెస్ట్ అంటూ ఫేస్‌బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫేస్‌బుక్ ఇండియా ఎండీగా గతేడాది ఉమంగ్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అడోబ్ సౌత్ ఏషియా ఎండీగా పనిచేశారు. ఫేస్‌బుక్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత సొంతంగా ఓ సంస్థ ప్రారంభించాలని ఉమంగ్ బేడీ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు ఎక్కువ యూజర్లు ఉన్నది ఇండియాలోనే ఉన్నారు


Related News

Airtel-4G

టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం

Spread the loveదేశీయ టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో కంపెనీల ఏకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోRead More

amazon

అమెజాన్ కే టోకరా..

Spread the loveఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌కు ఓ 21 ఏళ్ల యువకుడు భారీ మొత్తంలో కన్నం పెట్టాడు. ఏకంగాRead More

 • ఎఫ్ బీకి ఎండీ రాజీనామా
 • మళ్లీ టాప్ లోనే ముఖేష్ అంబానీ
 • SBI కొత్త బాస్ ఖాయం చేశారు
 • ఆఫర్ పొడిగించిన జియో
 • బ్యాంకులను ముంచిన డిజిటల్ ఇండియా
 • షాకిచ్చిన జియో మొబైల్
 • మూడేళ్లలో 5జీ
 • ఫోర్బ్ లిస్టులో ముగ్గురు దిగ్గజ భారతీయులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *