Main Menu

ఫేస్ బుక్ చుట్టూ రాజ‌కీయ‌ ప్ర‌కంప‌న‌లు

Spread the love

ఫేస్ బుక్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. అధికార పార్టీకి అండ‌గా ఉంటూ, అనేక స‌మ‌స్య‌ల‌కు ఫేస్ బుక్ కార‌ణం అవుతోందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ తీరు మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌తో చివ‌ర‌కు ఆ సంస్థ సీఈవో వైదొల‌గాల‌నే డిమాండ్ ముందుకొస్తోంది. ఈ ప‌రిణామాల‌తో ఫేస్ బుక్ యాజ‌మాన్య వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

అదే స‌మ‌యంలో సుమారు 22 కోట్ల మంది వినియోగ‌దారులున్న ఇండియాలో ఫేస్ బుక్ తీరుపై ది వైర్ సంస్థ స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేసింది. ఫేస్‌బుక్‌ వ్యవహార శైలిపై ది వైర్‌ ఈ ఏడాది జూన్‌ నుంచి ఐదు నివేదికలు తయారు చేసింది. దేశవ్యాప్తంగా 50 మందితో ఫేస్‌బుక్‌ తీరుపై పరిశోధన జరిపించింది. అందులోని మొదటి నివేదికను ది వైర్‌ దేశ ప్రజల ముందుంచింది. ది వైర్‌ పరిశోధనలో తేలిందేమంటే..భారత్‌లో పని చేస్తున్న ఫేస్‌బుక్‌ సీనియర్‌ ఉద్యోగుల్లో చాలామంది అధికార బీజేపీకీ, ప్రధాని మోడీకి 2011 నుంచీ సన్నిహితులని.. అధికారంలో ఉన్నవారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్నవారు ఎన్నికల సందర్భంగా న్యూట్రల్‌గా ఉండగలరా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

ది వైర్‌ మొదటి నివేదిక ప్రకారం ఫేస్‌బుక్‌తోపాటు దాని అనుబంధ సంస్థ వాట్సాప్‌ అధికార పార్టీకీ, హిందూత్వ ఎజెండాకు అనుకూలంగా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే విద్వేష వ్యాఖ్యలను పోస్ట్‌ చేయడం ద్వారా దేశంలోని పలుచోట్ల మూకదాడులకు కారణమయ్యాయని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మోడీపై, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి సోషల్‌ మీడియాలో తగిన ప్రాధాన్యత లభించడంలేదని ది వైర్‌ మొదటి నివేదిక వెల్లడించింది. మోడీ స్నేహితులు, సన్నిహితుల ద్వారా ఫేస్‌బుక్‌కు సమకూరిన లబ్దిని రెండో నివేదికలో వెల్లడించనున్నట్టు ది వైర్‌ తెలిపింది. బీజేపీతో సాన్నిహిత్యం ఉన్నవారికి అధిక ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఆ పార్టీ ఎజెండాకు ప్రచారం ఎలా కల్పిస్తున్నదీ మూడో నివేదికలో వెల్లడించనున్నది. కాంగ్రెస్‌తో ఫేస్‌బుక్‌ సంబంధాలు, ఫేస్‌బుక్‌లోని సీనియర్‌ ఉద్యోగి భారత్‌లో వ్యవహరిస్తున్న తీరుపై నాలుగో నివేదికలో వెల్లడించనున్నది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఐదో నివేదికలో వెల్లడించనున్నట్టు ది వైర్‌ తెలిపింది.

సెప్టెంబర్‌ 22న రాజస్తాన్‌లోని కోటాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలతో మాట్లాడుతూ..ఏ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా మనకు ఆ సామర్థ్యమున్నది. అది తీయటిదైనా, పుల్లటిదైనా.. వాస్తవమైనా, అబద్ధమైనా అంటూ భరోసా ఇచ్చారు. గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మద్దతుదారులు రెండు పెద్ద బృందాలుగా వాట్సాప్‌ను నిర్వహించిన తీరును అమిత్‌షా ఉదహరించారు. మొత్తం 32 లక్షలమందితో ఆ రాష్ట్రంలో వాట్సాప్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి వాట్సాప్‌ సందేశాలను పోస్ట్‌ చేయడం ప్రారంభించేవారట. వివిధ మీడియాల్లో బీజేపీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వచ్చే వార్తలను ఎంపికచేసి పోస్ట్‌లు పెట్టేవారు. కొన్ని ఆసక్తి కలిగించే కల్పితాలు కూడా అందులో కలగలిసి ఉండేవి. అందులో ఒకటి అప్పటి యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, ఆయన తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ మధ్య జరిగినట్టుగా ఓ కట్టు కథను బీజేపీ కార్యకర్త ఒకరు పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయింది. అదేమంటే..ములాయంను అఖిలేశ్‌ చెంపదెబ్బ కొట్టి అవమానించారన్నది. అది అమిత్‌షాకూ చేరిపోయింది. ఇది చెబుతుండగా బీజేపీ కార్యకర్తలు ముసిముసి నవ్వులతో అమిత్‌షా పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఇది కొంత మంచి ఫలితాన్నిచ్చేదే..కానీ, అలా చేయకండి అంటూ అమిత్‌షా తమ కార్యకర్తల్ని సున్నితంగా అనునయించారు. మనకు 32 లక్షలమంది కార్యకర్తలున్నందున మనం ఇలాంటివి వైరల్‌ చేయడం సులభమే అంటూ షా చెప్పుకొచ్చారు.

అయితే, అమిత్‌షా చెప్పినదానికీ ఇటీవల భారత్‌ను సందర్శించిన వాట్సాప్‌ గ్లోబల్‌ చీఫ్‌ క్రిస్‌ డేనియల్స్‌ ఇచ్చిన వివరణకూ తేడా ఉన్నది. భారత్‌లో తమకు 20 కోట్లకుపైగా వినియోగదారులన్నారని ఆయన తెలిపారు. అయితే, 90 శాతం సందేశాలు ఇద్దరు వ్యక్తులకే పరిమితమని, నిక్షిప్తం చేసిన బృందాల్లో ఎక్కువ భాగం పదిమందికి తక్కువేనని డేనియల్స్‌ చెప్పారు. కాగా, అమిత్‌షా చెప్పిందే నిజమనుకుంటే ప్రపంచంలోనే సోషల్‌ మీడియాను ప్రభావశీలంగా వినియోగిస్తున్నది బీజేపీనే అనడంలో అనుమానం లేదు. సోషల్‌మీడియా సామ్రాజ్యాన్నేలుతున్న ఫేస్‌బుక్‌, దాని అనుబంధ సోషల్‌ సైట్స్‌ నిర్వహణ తీరును ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉన్నది. ఎన్నికల వేళ సోషల్‌ మీడియా ఓ పక్షానికి కొమ్ము కాయడాన్ని ప్రశ్నించాల్సి ఉన్నది. దాంతో ఇప్పుడీ ఫేస్ బుక్, వాట్పాప్ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి.


Related News

మారుతీ కార్ల ధ‌ర‌ త‌గ్గింపు

Spread the loveమారుతీ సుజుకీ ఎంపిక చేసిన కొన్ని కార్లపై భారీ తగ్గింపును అందిస్తున్నట్టుగా ప్రకటించింది. మారుతీ సుజుకీ ప్రధానRead More

ఏప్రిల్‌ చివరికి శాంసంగ్‌ న్యూ మోడ‌ల్ ఫోన్

Spread the loveశాంసంగ్‌ త్వరలోనే భారత్‌లో ఫోల్డబుల్‌ (మడతపెట్టే) స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. అయితే ఎక్కువసార్లు మడతబెడితే ఈ ఫోన్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *