Main Menu

మీ కార్డులు మార్చుకోవాల్సిందే..!!

Spread the love

ఆర్బీఐ కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. వ‌చ్చే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ నుంచి ప్రారంభించ‌బోతోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల విష‌యంలో నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని వెల్ల‌డించింది. భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నూతన నిబంధనల ప్రకారం కొత్త ఏడాది జనవరి నుంచి చిప్‌ లేని డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు చెల్లుబాటు కావని బ్యాంకులు వినియోగదారులకు సందేశాల్ని పంపుతున్నాయి. డిసెంబర్‌ 31 నాటికి బ్యాంకు ఖాతాదారులు చిప్‌ ఆధారిత ఈఎంవీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు అప్‌గ్రేడ్‌ కావాలని బ్యాంకులు తమ వినియోగదారులను కోరుతున్నాయి. ఈలోగా పాత డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల స్ధానంలో చిప్‌ ఆధారిత కార్డులు పొందాలని సూచిస్తున్నాయి.

చిప్‌ రహిత కార్డులను హ్యాకర్లు సులభంగా హ్యాక్‌ చేయడం, క్లోనింగ్‌ చేయడం ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో చిప్‌ ఆధారిత కార్డులను మాత్రమే అనుమతించాలని ఆర్‌బిఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మాగెటిక్‌ స్ట్రిప్‌ కార్డులతో పోలిస్తే ఈఎంవీ చిప్‌ ఆధారిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు భద్రత కలిగి ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంటోంది.






Related News

రికార్డ్ రేటులో బంగారం

Spread the loveదేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి,Read More

జీ కోసం క‌న్నేసిన జియో

Spread the loveఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కన్నేసింది. చౌక చార్జీలతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *