బీఎస్ఎన్ఎల్ బంప‌రాఫ‌ర్

BSNL20Rs2014920plan
Spread the love

రాఖీ పండుగ సందర్భంగా ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ జీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్ ప్రకటించింది. ‘రాఖీ పే సౌగాత్’ పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్‌తో వినియోగదారులకు ముందే పండుగ తీసుకొచ్చింది. ‘రాఖీ పే సౌగాత్’ ఆఫర్ కింద ప్రిపెయిడ్ వినియోగదారులు రూ.74తో కాంబో వోచర్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 1 జీబీ డేటా ఉచితంగా అందుకోవడంతో పాటు బీఎస్ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చునని కంపెనీ ప్రకటించింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకునేందుకు వీలుగా రూ.74 మేర టాక్‌టైం లభిస్తుంది. అయితే ఈ టాక్‌టైమ్ వ్యాలిడిటీ ఐదు రోజులు మాత్రమే ఉండడం కాస్త నిరాశ కలిగించే విషయం.. కాగా రాఖీ ఆఫర్‌ ఆగస్టు 3 గురువారం మొదలు 12 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రిపెయిడ్ కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ మరికొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది.

ట్రిపుల్ ఏస్ ఎస్‌టీవీ 333 ఆఫర్ : అపరిమిత డేటా. రోజుకు 3 జీబీ వరకు ఎఫ్‌యూపీ పరిమితి ఉంది. 3జీబీ మించితే డేటా స్పీడ్ 80 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 90 రోజులు.

దిల్ కోల్ కే బోల్ ఎస్‌టీవీ 349 ఆఫర్: లోకల్ సర్వీస్ ఏరియా పరిథిలో అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ)తో పాటు రోజుకు 2జీబీ డేటా అందుకోవచ్చు. 2జీబీ డేటా మించితే స్పీడ్ 80 కేబీపీఎస్‌కు పరిమితమవుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు.

నెహ్లే పే దెహ్లా ఎస్‌టీవీ 395 ఆఫర్ : 3000 నిమిషాల ఆన్ నెట్ వాయిస్ (లోకల్, ఎస్టీడీ)తో పాటు 1800 నిమిషాల ఆఫ్‌నెట్ వాయిస్ (లోకల్, ఎస్టీడీ) కాల్స్ ఉచితంగా అందుకోవచ్చు. ఉచిత కాల్స్ పరిమితి అయిపోయాక కాల్‌కు 20 పైసలు చార్జి పడుతుంది. వీటితో పాటు రోజుకు 2జీబీ డేటా అందుకోవచ్చు. వ్యాలిడిటీ 71 రోజులు.






Related News

MODI

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the loveఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టుRead More

mobile

పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…

Spread the loveమొబైల్‌ వినియోగదారుల అభిరుచి మారుతోంది. మొదట్లో పోస్ట్ పెయిడ్ ని ఓ ప్రతిష్టకు కూడా చిహ్నంగా భావించినRead More

  • వోడాఫోన్ బంపరాఫర్
  • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
  • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
  • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
  • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
  • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *