Main Menu

కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…

Spread the love

భారత్‌లో మొత్తం 2.45 లక్షల మంది కోటీశ్వరులున్నారు. వారి సంపద విలువ 5 లక్షల కోట్ల డాలర్లు (రూ.3.25 లక్షల కోట్లు). 2022 నాటికి వారి సంఖ్య 3.72 లక్షలకు చేరుతుందని అంచనా. క్రెడిట్‌ స్విస్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ సంపద నివేదికలో ఈ విషయం తెలిపింది. గృహస్థుల ఆదాయాల్లో ఏటా 7.5 శాతం వృద్ధి నమోదవుతున్న నేపథ్యంలో 2022 నాటికి కోటీశ్వరుల సంఖ్య 3.72 లక్షలకు చేరుతుందని, వారి సంపద విలువ 7.1 లక్షల కోట్ల డాలర్లకు (రూ.4.61 లక్షల కోట్లు) పెరుగుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. 2000 సంవత్సరం నుంచి భారత్‌లో సంపద ఏటా సగటున 9.9 శాతం పెరిగినట్టు పేర్కొంది.

అంతర్జాతీయ సగటు 6 శాతంతో పోల్చితే ఇది చాలా అధికం. ఇదే సమయంలో భారత జనాభా వృద్ధి 2.2 శాతం ఉంది. సంపద వృద్ధిలో భారత్‌ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలో ప్రజల సంపద పెరుగుతున్నప్పటికీ దానిలో అందరికీ వాటా ఉండడంలేదని, పేదల సంఖ్య కూడా భారీగానే ఉన్నదని ఆ నివేదిక తేల్చింది. 10 వేల డాలర్ల (రూ.6.5 లక్షలు) కన్నా తక్కువ సంపద ఉన్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు పేర్కొంది. ఈ స్థాయి కన్నా పైబడిన నికర విలువ ఉన్న వారి సంఖ్య కేవలం 0.5 శాతం అంటే 42 లక్షలున్నట్టు తేల్చి చెప్పింది. 5 కోట్ల డాలర్ల కన్నా పైన సంపద గల వారు 1820 మంది, 10 కోట్ల డాలర్లకు పైబడిన సంపన్నులు 760 మంది ఉన్నారని అంచనాగా తెలిపింది. భారత్‌లో వ్యక్తిగత సంపదలో ప్రాపర్టీలు, ఇతర స్థిరాస్తులే అధికమని ఆ నివేదిక తెలియచేసింది. భారత ప్రజల రుణభారం వారి ఆస్తుల విలువలో 9 శాతం మేరకు ఉన్నదంటూ ఇది పలు సంపన్న దేశాల్లో వ్యక్తిగత రుణభారంతో పోల్చితే చాలా తక్కువ అని తేల్చి చెప్పింది.






Related News

పాతాళానికి ప‌త‌నం దిశ‌లో రూపాయి..

Spread the loveఇండియ‌న్ రూపాయి ప‌త‌నం పాతాళానికి ప‌డిపోతున్న‌ట్టుగా ఉంది. రూపాయి విలువ రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనమతున్న తీరుRead More

పడిపోతున్న పసిడిధరలు

Spread the loveసీన్ మారుతోంది. శ్రావణంలో కూడా బంగారు వ్యాపారం బేర్ మంటోంది. అంంతర్జాతీయ కారణాలతో పాటు రూపాయి విలువRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *