60వేలకే కారు..అస‌లొస్తుందా?

bajaj--621x414
Spread the love

దేశీయ మార్కెట్లోకి అతి తక్కువ ధరకే బజాజ్‌ సంస్థ కారును అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనైతే గత వారం 10 రోజులుగా ఈ పోస్టులు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. బజాజ్‌ సంస్థ మార్కెట్లోకి రూ.60,000లకే చిన్న కారును తేనుందని.. ఈ కారు గంటకు 70 కి.మీ. గరిష్ట వేగంతో లీటరుకు 35 కి.మీ. మైలేజీని అందిస్తుందన్నది ఆ పోస్టుల సారాంశం. ఈ వార్తకు మరింత బలం చేకూర్చేలా బజాజ్‌ సంస్థల అధినేతలు ఆ కారును రిలీజ్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలూ చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామా న్యుల లో మరొక్కసారి చౌక ధర కార్లపై ఆశలు చిగురిస్తున్నాయి. సామాన్యుడి కారుగా ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టాటా నానో ప్రజల మన్ననలను ఆశించిన స్థాయిలో అందుకోవడంలో విఫలమైంది. దీంతో మళ్లీ సాధారణ భారతీయుడు సంప్రదాయక కంపెనీల కార్లవైపే దృష్టి సారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీలో రారాజుగా ఉన్న బజాజ్‌ కంపెనీ మార్కెట్లోకి చౌక కారును తేనున్నట్టుగా వస్తున్న వార్తలు తాజాగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. మరికొన్ని వార్తా సంస్థలైతే బజాజ్‌ షోరూంలకు వాహనాలు ఇప్పటికే చేరుకుంటున్నాయని కథనాలు ప్రచురిస్తున్నాయి.

ఆరేండ్లుగా అభివృద్ధి..

చౌక కారుగా ప్రచారమవుతున్న బజాజ్‌ చిన్న కారు అసలు పేరు ‘బజాజ్‌ క్యూట్‌’. వాస్తవానికి దీనిని కంపెనీ దేశంలో ఆటో రిక్షాల యాంత్రీకరణకు తెర తీయాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా తయారు చేస్తూ వస్తోంది. 2015లో కంపెనీ దీనిని దేశీయంగా ఆవిష్కరించింది. 13 బీహెచ్‌పీ సామర్థ్యంతో కూడిన వాటర్‌ కూల్డ్‌ డీటీఎస్‌ఐ, 4 వాల్వు ఇంజిన్‌తో దీనిని కంపెనీ రూపొందించింది. ముందుగా దీనిని ఆటో రిక్షాల స్థానంలో తీసుకువచ్చేలా కంపెనీ రూపొందించినప్పటికీ నిబంధనలు, ఆంక్షల కారణంగా ఇవి రోడ్డెక్కలేదు. ఆ తరువాత ఈ వాహనంలో భారీ మార్పులు చేస్తూ బజాజ్‌ క్యూట్‌ను తయారు చేశారు.

అనుమతుల నిరాకరణతో వెనక్కి…

చౌక కారుగా జనాల్లో చెక్కర్లు కొడుతున్న బజాజ్‌ క్యూట్‌ను భారత్‌లో అనుమతించేందుకు అప్పట్లో పలు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. నిబంధనల ప్రకారం భారత్‌లో యాంత్రీకరణ చేయబడినరిక్షాలను ప్రయివేటుగా విక్రయించడానికి వీలు లేదు. కానీ ఫ్రాన్స్‌ లాంటి కొన్ని ఐరోపా దేశాల్లో ప్రత్యేక నిబంధనలతో వీటి విక్రయాన్ని అనుమతిస్తున్నారు. అక్కడ వీటిని ఎలాంటి అనుమతులు రిజిస్ట్రేషన్లు లేకుండా యుక్త వయస్సు దాటినవారందరూ నేరుగా వాడుకొనేందుకు వీలుటుంది. అయితే బజాజ్‌ సంస్థ రూపొందించిన క్యూట్‌కు యూరోపియన్‌ డబ్ల్యూవీటీఏ సర్టిఫికేషన్‌ లభించింది. దీనికి తోడు నెదర్లాండ్‌ ఆర్‌డీడబ్ల్యూ అవార్డును కూడా ఈ కారు పొందింది.

అసలు చిక్కులివే..

దేశీయంగా కార్లకు డిమాండ్‌ పెరుగుతోన్న సమయంలోనే బజాజ్‌ సంస్థ ద్విచక్ర వాహనాలతో పాటు నాలుగు చక్రాల వాహనాల దిశగా అడుగులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పుడున్న కొన్ని ఆటోలను రూపొందించి మార్కెట్లోకి వదిలింది. చాలా మోడళ్లు వీటిలో విజయవంతమైయ్యాయి కూడాను. అయితే బజాజ్‌ ఎంతో వ్యయప్రాయాసలకోర్చి రూపొందించిన క్యూట్‌ మాత్రం ఇప్పటికిప్పుడు దేశీయంగా రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దేశంలో అమలులో ఉన్న 4-వీలర్‌ క్రాష్‌ టెస్ట్‌ ప్రమాణాలను బజాజ్‌ క్యూట్‌ తట్టుకొని నిలిచే స్థాయిలో లేదన్నది మార్కెట్‌ వర్గాల మాట.

క్యూట్‌ను ప్రమాదాలను తట్టుకొని నిలిచేలా ద్రుఢమైన మెటీరియల్‌తో తయారు చేయలేదని.. ఇందులో అసలు ఎయిర్‌బ్యాగ్‌ వ్యవస్థ మచ్చటనే లేనందున ఈ కారు విక్రయానికి ప్రభుత్వ అనుమతులు లభించడం కష్టమేనన్నది వారి విశ్లేషణ. ఈ వ్యవస్థను అందు బాటులోకి తేవాలంటే ప్రస్తుతం అనుకుం టున్నట్టుగా రూ.60,000లకు క్యూట్‌ను అందించడం కష్టతరమేనని వారు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ కారును వివిధ ఆధునిక సౌకర్యాలతో రూ.60,000ల నుంచి మొదలుకొని రూ.1.5 లక్షల ధరల శ్రేణిలో వివిధ మోడళ్లలో దీనిని అందుబాటులోకి తేవాలని కంపెనీ యోచనని తెలుస్తోంది. దీంతో అనుకున్న కనిష్ట ధరకంటే కూడా కొంచెం అటూ.. ఇటుగా ఈ కారును మార్కెట్లోకి తెచ్చేందుకే కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ వార్తలపై బజాజ్‌ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కంపెనీ కారు ప్రయత్నాల్లో కొనసాగుతోందన్న విషయం సుస్పష్టమవుతోంది. కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.


Related News

lanco-infra-pti

ల్యాంకో దివాళా…?

Spread the loveమౌలిక వసతుల రంగంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన లాంకో ఇన్ఫ్రాటెక్‌ సంస్థ ఇప్పుడు దివాలా దిశగాRead More

mobile ivomi 5

ఇండియాకి రెండో స్థానం

Spread the loveప్ర‌పంచ‌లోనే మ‌న దేశానికి రెండో స్థానం ద‌క్కింది. సెల్యూలార్ ఫోన్ల త‌యారీలో ఇండియా దూసుకెళ్లింది. చైనా త‌ర్వాతిRead More

 • మూడో పెళ్లికి మాల్యా రెడీ..
 • ఫేస్ బుక్ కి పెరుగుతున్న క‌ష్టాలు
 • ప్లాస్టిక్ నోట్లు వ‌స్తున్నాయ్…
 • పోర్బ్స్ లిస్టులో ఆయ‌నే టాప్
 • పడిపోయిన బంగారం ధరలు
 • మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు
 • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
 • వోడాఫోన్ బంపరాఫర్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *